E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెరగడం లేదా? ఖర్చు లేకుండా ఇలా చేస్తే తీగలు తీగలుగా పెరుగుతుంది

మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెరగడం లేదా? ఖర్చు లేకుండా ఇలా చేస్తే తీగలు తీగలుగా పెరుగుతుంది
Advertisement

ఇటీవలి కాలంలో మనీ ప్లాంట్ మొక్కను అందరూ పెంచుతున్నారు. ప్రతి ఇంటిలో ఈ మొక్క ఈ ఇండోర్ మొక్కగా సాధరణమైంది. చాలా మంది ఇంటి అందాన్ని పెంచడానికి ఈ మొక్కను ఉంచుతారు. మరికొందరు వాస్తు నమ్మకాల ప్రకారం అదృష్టం.. సానుకూల శక్తి కోసం ఇంట్లో ఉంచుతారు.
అయితే మనీ ప్లాంట్‌ను ఆరోగ్యంగా పెంచడం కొన్నిసార్లు సవాలుగా మారుతుంది. ముఖ్యంగా మొక్క పెరిగేకొద్దీ దాని తీగలు కిందకు వంగిపోతాయి. కొన్ని సందర్భాల్లో కుండ బయటకు కూడా వేలాడుతూ కనిపిస్తాయి.

మనీ ప్లాంట్‌కు సరైన సపోర్ట్ అవసరం

మనీ ప్లాంట్ సహజంగా పెరిగే స్వభావం కలిగిన మొక్క. బయట మొక్కలు ప్రకృతిలో ఇది చెట్లు లేదా ఇతర ఉపరితలాలను పట్టుకుని పైకి పెరుగుతాయి. సపోర్ట్ లేకపోతే తీగలు నేలపై విస్తరించిపోతాయి. దీనివల్ల మొక్క పెరుగుదల మందగించవచ్చు. సరైన ఆధారం ఉంటే మొక్క నిలువుగా పెరుగుతుంది. అలాగే ఆకులు పెద్దవిగా, ఆరోగ్యంగా మారతాయి. నిలువుగా పెరిగే మనీ ప్లాంట్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది.

మనీ ప్లాంట్‌కు కొబ్బరి పీచు సరైన సపోర్ట్

Advertisement

మనీ ప్లాంట్ కోసం ఖరీదైన గార్డెనింగ్ వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో మిగిలిపోయే కొబ్బరి పీచుతో అద్భుతమైన సపోర్ట్ తయారు చేయవచ్చు. సాధారణంగా కొబ్బరికాయ ఉపయోగించిన తర్వాత దాని పీచును చాలామంది పారేస్తారు. కానీ ఈ పీచు.. మనీ ప్లాంట్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి పీచు ఎక్కువసేపు తేమను నిల్వ ఉంచుతుంది. అలాగే మొక్క వేర్లు పట్టుకునేందుకు సహజమైన ఉపరితలంగా పనిచేస్తుంది.

ఇంట్లోనే మాస్ స్టిక్ ఎలా తయారు చేయాలి?

మాస్ స్టిక్ తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక పొడవైన చెక్క కర్ర లేదా ఉపయోగంలో లేని ఒక చిన్న ప్లాస్టిక్ పైపు తీసుకోండి.
ఆ తర్వాత కొబ్బరి పీచును తీసుకుని ఆ కర్ర చుట్టూ సమానంగా చుట్టండి. అది విడిపోకుండా తాడు లేదా వైర్‌తో బిగించండి. ఇలా చేస్తే మీ ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మాస్ స్టిక్ సిద్ధమవుతుంది.

కుండలో సపోర్ట్ స్టిక్‌ను ఎలా అమర్చాలి?

Advertisement

తయారు చేసిన స్టిక్‌ను మనీ ప్లాంట్ కుండలో జాగ్రత్తగా ఉంచండి. దాన్ని సుమారు 10 నుంచి 15 సెంటీమీటర్ల లోతు వరకు మట్టిలో గట్టిగా నొక్కాలి. స్టిక్ నిటారుగా నిలబడేలా చూసుకోవాలి. అది కదలకుండా ఉంటే మొక్కకు సరైన మద్దతు లభిస్తుంది.

మనీ ప్లాంట్‌ను స్టిక్‌కు ఎలా అనుసంధానించాలి?

స్టిక్‌ను అమర్చిన తర్వాత మనీ ప్లాంట్ తీగలను మెల్లగా దాని చుట్టూ చుట్టాలి. తీగలను బలవంతంగా వంచకూడదు. అవసరమైతే తాడుతో కట్టవచ్చు. కొంతకాలానికి మొక్క సహజంగానే స్టిక్‌ను పట్టుకుని పైకి ఎక్కడం ప్రారంభిస్తుంది.

Also Read: ప్రపంచంలోనే అత్యంత అందమైన యువతులు ఏ దేశంలో ఉంటారు? నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే

కొబ్బరి పీచు గ్రోత్‌ను ఎలా పెంచుతుంది?

మనీ ప్లాంట్ తీగలపై వేర్లు ఏర్పడతాయి. ఈ వేర్లు కొబ్బరి పీచును బలంగా పట్టుకుంటాయి. పీచులో ఉండే తేమను కూడా అవి గ్రహిస్తాయి. దీంతో మొక్కకు అదనపు తేమ, పోషకాలు లభిస్తాయి. ఫలితంగా ఆకులు పెద్దవిగా, పచ్చగా మారుతాయి. మొక్క వేగంగా పెరిగి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Related News

మనసులో ప్రేమను భార్యకు తెలిపే స్టైల్ వేరు.. న్యూమరాలజీ ద్వారా మీ భర్త స్వభావాన్ని తెలుసుకోండి

ఉదయం అలారం మోగుతున్నా ఆఫ్ చేసి పడుకుంటున్నారా? అలారం లేకుండానే లేవడానికి సింపుల్ టిప్స్

వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్

మీరు రోజుకు ఎన్ని స్క్వాట్స్ చేయాలి? మీ ఫిట్‌నెస్ లెవెల్ తెలిపేందుకు గుంజీల పరీక్ష

మధుమేహం ఉన్నవారికి ప్రతి రోజు ఆ సమయంలోనే ప్రమాదం ఎక్కువ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ టిప్స్ పాటించాలి

ఐఐటి vs ఐఏఎస్.. సాఫ్ట్‌వేర్ వద్దు ప్రభుత్వం ఉద్యోగం ముద్దు.. పెళ్లి సంబంధాల్లో ఇప్పటికీ ఇదే తంతు

జిమ్ చేస్తే జుట్టు రాలే సమస్య.. ఇది నిజమేనా?

Big Stories

×