E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రీల్స్ చేసేవాళ్లకి పండగే.. సినిమా రేంజ్ వీడియోలు తీసే.. టాప్-5 స్మార్ట్‌ఫోన్లు ఇవే!

రీల్స్ చేసేవాళ్లకి పండగే.. సినిమా రేంజ్ వీడియోలు తీసే.. టాప్-5 స్మార్ట్‌ఫోన్లు ఇవే!
Advertisement

Best Camera Phones: ఈ రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్స్, యూట్యూబ్ వ్లాగ్స్, షార్ట్స్ తో కుర్రకారు.. పెద్ద ఎత్తున తమ టాలెంట్ ను నెట్టింట ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కంటెంట్ వీడియోల రికార్డింగ్ కోసం.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగిన ఫోన్ల కోసం.. యువత తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాటిక్ విజువల్స్ నుండి నైట్ మోడ్ షూటింగ్స్ వరకు అదరగొడుతున్న ఈ ఏడాది టాప్-5 బెస్ట్ వీడియో రికార్డింగ్ స్మార్ట్‌ఫోన్లు ఏవో ఈ కథంలో చూద్దాం.

యాపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్

వీడియో రికార్డింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఐఫోన్. ఈసారి ఐఫోన్ 17 ప్రో మాక్స్ తన కెమెరా సిస్టమ్‌ను పూర్తిగా 48MP లెన్స్‌లతో అప్‌గ్రేడ్ చేసింది. దీనిని ఉపయోగించి 4K రిజల్యూషన్‌తో సెకనుకు 120 ఫ్రేముల (120fps) స్పీడ్‌తో ‘ప్రోరెస్’ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఇందులోని ‘యాపిల్ లాగ్ 2’ (Apple Log 2) కలర్ ప్రొఫైల్ వల్ల వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు సినిమా రేంజ్ కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. నడుస్తూ, పరిగెడుతూ వీడియోలు తీసినా.. దీనిలోని స్టెబిలైజేషన్ కారణంగా వీడియోలు ఏమాత్రం షేక్ అవ్వవు.

శాంసంగ్ గెలాక్సీ S26 ఆల్ట్రా

Advertisement

శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ S26 ఆల్ట్రాలో సరికొత్త ‘ప్రోవిజువల్ ఇంజిన్’ AI టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇది 8K వీడియోలను 30fps వద్ద అత్యంత స్పష్టంగా రికార్డ్ చేయగలదు. దీనిలోని ‘సూపర్ స్టడీ విత్ హారిజోన్ లాక్’ ఫీచర్ ద్వారా ఫోన్‌ను 360 డిగ్రీలు తిప్పినా సరే వీడియోలోని భూమి స్ట్రెయిట్‌గానే కనిపిస్తుంది. అలాగే చీకట్లో వీడియోలు తీయడానికి దీని ‘నైటోగ్రఫీ’ మోడ్ అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది.

వివో X300 ఆల్ట్రా

మొబైల్ ఫోటోగ్రఫీలో సంచలనాలు సృష్టిస్తున్న వివో.. ఈ X300 ఆల్ట్రా మోడల్‌తో వీడియో రంగంలోనూ దుమ్మురేపుతోంది. పాపులర్ ‘జైస్’ (Zeiss) లెన్స్‌లు, సొంత ‘బ్లూఇమేజ్’ (BlueImage) ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రూపొందింది. వీడియో క్వాలిటీ విషయానికి వస్తే.. తక్కువ వెలుతురు ఉన్న రూమ్‌, రాత్రి వేళల్లో వీడియో తీసేటప్పుడు మసకదనం లేకుండా క్లియర్ విజువల్స్ ను ఇది ఇస్తుంది. స్కిన్ టోన్స్ సహజంగా వచ్చేలా దీని కలర్ సైన్స్‌ను మార్చారు. 200MP పెరిస్కోప్ జూమ్ లెన్స్‌తో దూరంగా ఉన్న వాటిని కూడా క్లారిటీ తగ్గకుండా వీడియో తీసుకునే వెసులుబాటు ఈ ఫోన్ లో ఉంది.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో

Advertisement

గూగుల్ ఈ ఫోన్ లో.. తన సరికొత్త టెన్సర్ G5 చిప్‌సెట్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. దీనిలోని ‘వీడియో బూస్ట్’ (Video Boost) ఫీచర్.. 8K వీడియోలను AI సహాయంతో ప్రాసెస్ చేస్తుంది. సాధారణ వెలుతురులో తీసిన వీడియోను కూడా గూగుల్ AI క్లౌడ్ ప్రాసెసింగ్ ద్వారా ఒక హాలీవుడ్ రేంజ్ కలర్, లైటింగ్‌తో మార్చి ఇస్తుంది. కొత్తగా వచ్చిన ‘జెమిని ఓమ్ని’ ఫీచర్‌తో కేవలం వాయిస్ కమాండ్స్ ఇస్తూ ఫోట్లను, వీడియోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చని గూగుల్ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: ఏంటీ, ల్యాప్‌టాప్‌ Type-C పోర్ట్‌తో.. ఇన్ని అద్భుతాలు చేయెుచ్చా? ఇన్నాళ్లు ఛార్జింగ్‌కే అనుకున్నామే!

ఒప్పో ఫైండ్ X9 ఆల్ట్రా

ఒప్పో ఫైండ్ సిరీస్ ఎప్పుడూ క్రియేటివ్ వీడియో గ్రాఫర్లను ఆకట్టుకుంటూనే ఉంది. ఈసారి ఫైండ్ X9 ఆల్ట్రా.. క్వాడ్ ప్రైమరీ కెమెరా సెటప్‌తో మార్కెట్లోకి వచ్చింది. దీనిలోని హ్యాసెల్‌బ్లాడ్ (Hasselblad) కలర్ ట్యూనింగ్‌తో సినిమాటిక్ టోన్లను అందిస్తుంది. దీనిలోని డ్యూయల్ పెరిస్కోప్ కెమెరాలు వీడియో జూమింగ్ సమయంలో ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా చూస్తాయి. 4K 60fps రికార్డింగ్‌లో లైటింగ్ బ్యాలెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేస్తూ తీసే సినిమాటిక్ పోర్ట్రెయిట్ వీడియోలకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: ఇన్వర్టర్ ఏసీలు నిజంగానే కరెంట్ బిల్లును ఆదా చేస్తాయా? కొనేముందు తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు!

Tags

Related News

బార్‌కోడ్ vs క్యూఆర్ కోడ్.. రెండింటికి తేడా ఏంటి? ఏది ఎక్కువ పవర్‌ఫుల్?

ఏంటీ, ల్యాప్‌టాప్‌ Type-C పోర్ట్‌తో.. ఇన్ని అద్భుతాలు చేయెుచ్చా? ఇన్నాళ్లు ఛార్జింగ్‌కే అనుకున్నామే!

ఇన్వర్టర్ ఏసీలు నిజంగానే కరెంట్ బిల్లును ఆదా చేస్తాయా? కొనేముందు తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు!

ఏసీ వేసినా ఇల్లు వేడెక్కుతోందా? కూలింగ్‌ను దోచేస్తున్న.. ఆరుగురు దొంగలు వీళ్లే!

మీ వాట్సాప్ చాట్స్ ఇతరులు చూడకూడదా? అయితే ఈ ట్రిక్ మీ కోసమే!

Cyber Attack: కలకలం రేపుతున్న సైబర్ దాడులు.. తొలుత టాటా ఎలక్ట్రానిక్స్‌, ఆపిల్-టెస్లా రహస్యాలు సైతం

బెస్ట్ ఎల్‌జీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు

Big Stories

×