E-Paper
Advertisement

Winter Safety Tips: ప్రతిరోజూ స్నానానికి గీజర్ వాడుతున్నారా?.. ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!

Winter Safety Tips: ప్రతిరోజూ స్నానానికి గీజర్ వాడుతున్నారా?.. ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!
Advertisement

Winter Safety Tips: రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల చాలామంది ఈ చలిలో వేడినీటి స్నానానికే ఓటేస్తున్నారు. దీంతో గీజర్లను ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే శీతాకాలంలో గీజర్లను వాడుతున్నట్లయితే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అజాగ్రత్తగా ఉండి ఏ చిన్న పొరపాటు జరిగినా అది విద్యుత్ షాక్‌కు దారితీసే అవకాశం ఉంది. కనుక.. గీజర్ వాడేటప్పుడు ఈ కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే..

ఎక్కువసేపు ఆన్‌లో ఉంచొద్దు:

చాలామంది స్నానానికి వెళ్లే ముందు గీజర్‌ను ఆన్ చేస్తుంటారు. దీంతో నీరు నిమిషాల వ్యవధిలో వేడెక్కుతుంది. దీనివల్ల సులభంగా స్నానం చేయవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే.. గీజర్‌ను ఆన్ చేసి అలానే ఎక్కువసేపు వదిలేస్తుంటారు.ఇలా తరచూ చేస్తుంటే మాత్రం గీజర్ పేలిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే మీరు గీజర్‌ని ఉపయోగించినప్పుడు.. ఎక్కువసేపు ఆన్‌లో లేకుండా చూసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత నీరు వేడెక్కిందని గమనించి వెంటనే గీజర్‌ను ఆపేయాలి.

భద్రతా ప్రమాణాలు ముఖ్యం:

Advertisement

కొన్ని స్థానిక కంపెనీలు గీజర్లలో భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉండవు. అలాంటి గీజర్లు త్వరగా పాడైపోయే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి గీజర్ల వల్ల ప్రమాదాల భయం కూడా ఎక్కువే. అందుకే గీజర్‌ను కొనుగోలు చేసేటప్పుడు బ్రాండెడ్ కంపెనీ నుంచి మాత్రమే కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే బాత్రూంలో సరైన స్థలంలో గీజర్ను ఇన్స్టాల్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. సరైన వెంటిలేషన్ అలేకపోయినా గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు గీజర్‌ను ఎప్పుడూ బాత్రూమ్ పైభాగంలో నీరు చేరని చోట అమర్చుకోవాలి.

రెండేళ్లకోసారి రీసైజ్:

మనం రెగ్యులర్‌గా ఉపయోగించే గీజర్ ఉప్పు నీటిని సరఫరా చేస్తుంటుంది. దీంతో కనీసం ప్రతి రెండేళ్లకోసారైనా గీజర్‌ను రీసైజ్ చేయాలి. లేదంటే.. షార్ట్ సర్క్యూట్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అలాగే చాలా గీజర్స్‌లో ఆటోమేటిక్ హీట్ సెన్సార్స్ అమర్చబడి ఉంటాయి. వాటిలోని ఆటోమేటిక్ సెన్సార్స్ పనిచేయడం ఆగిపోతే కూడా గీజర్ పేలిపోతుంది. కాబట్టి.. ఎప్పటికప్పుడు గీజర్ పనితీరును గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

Advertisement

Related News

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

Big Stories

Advertisement
×