E-Paper
Advertisement

OTT Movie : పగలు ఆసుపత్రిలో సేవలు… రాత్రయితే బ్రూటల్ మర్డర్స్… థ్రిల్లింగ్ మూమెంట్స్… దిమాక్ ఖరాబ్ ట్విస్టులు

OTT Movie : పగలు ఆసుపత్రిలో సేవలు… రాత్రయితే బ్రూటల్ మర్డర్స్… థ్రిల్లింగ్ మూమెంట్స్… దిమాక్ ఖరాబ్ ట్విస్టులు
Advertisement

OTT Movie : థ్రిల్లర్ జానర్ ఇప్పుడు అందరికీ ఫేవరెట్. వీటిలో ఆడియన్స్ ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడానికి కావాల్సిన థీమ్స్ ఉంటాయి. అందుకే టివి ఆన్ చేయగానే ముందుగా ఇలాంటి స్టోరీలనే సర్చ్ చేస్తుంటారు. అలాంటి వాళ్లకోసమే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉంది. ఇది మూగ – చెవిటి ఉన్న ఒక యువకుడు, ఆస్పత్రిలో ఉండే తన తండ్రిని కాపాడేందుకు ఒక సైకో గ్యాంగ్‌తో పోరాడే సన్నివేశాలతో తిరుగుతుంది. ఈ సినిమా తండ్రి, కొడుకు బంధం ఎంత బలమైనదో ఎమోషనల్ గా చూపిస్తుంది. క్లైమాక్స్‌లో కన్నీళ్లు పెట్టించే సీన్స్ హార్ట్ ని టచ్ చేస్తాయి. ఈ తమిళ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2023లో వచ్చిన ఈ తమిళ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు “తిరువిన్ కురల్”. ఇది హరీష్ ప్రభు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చింది. ఇందులో అరుల్నిధి, ఐశ్వర్య రాజేష్, భారతీరాజా, మహేంద్రన్, సుబ్రమణ్య శివ నటించారు. ఈ సినిమా 2023 ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 2023 జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో తమిళ, తెలుగు, మలయాళం డబ్బింగ్ తో అందుబాటులో ఉంది. 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఇయండిబిలో 5.1/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

తిరు అనే యువకుడికి వినికిడి, చెవిటి లోపం ఉంటుంది. ఒకరోజు తన తండ్రి కన్స్ట్రక్షన్ సైట్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరతాడు. అదే ఆస్పత్రిలో ఒక సైకో గ్యాంగ్ తిరు తండ్రిని టార్గెట్ చేసి దాడులు చేస్తుంది. వీళ్ళు చాలా క్రూరంగా హత్యలు చేస్తుంటారు. తిరుకి వైకల్యం ఉన్నప్పటికీ సైన్ లాంగ్వేజ్, తెలివితో గ్యాంగ్‌ను ఎదుర్కొని తండ్రిని కాపాడేందుకు పోరాడతాడు. ఈ ప్రక్రియలో అతని గర్ల్‌ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తుంది. ఉత్కంఠతతో నడిచే ఈ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో ఉంచుతాయి.

Read Also : ఒకే రాత్రి వరుస హత్యలు… పోలీసులను పరుగులు పెట్టించే కేసు… ఓటీటీలోకి తెలుగు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Advertisement

కథ ముందుకు సాగేకొద్దీ పాత రహస్యం బయటపడుతుంది. 15 ఏళ్ల క్రితం మురుగేశన్ ఒక పెద్ద కాంట్రాక్ట్ కోసం, బాషా అనే వ్యక్తిని మోసం చేసినట్లు తెలుస్తుంది. అతని ఫ్యామిలీ కూడా చిన్నా భిన్నం అవుతుంది. అందుకే ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని ICUలోనే మురుగేశన్‌ను చంపాలని భాషా ప్లాన్ వేస్తాడు. క్లైమాక్స్ వరకు తీరు ఫ్యామిలీని కూడా భాషా గ్యాంగ్ వెంటాడుతుంది. ఇక ఊహించని ట్విస్టులతో సినిమా ముగుస్తుంది. ఆ ట్విస్టులు ఏమిటి ? తిరు తన తండ్రిని కాపాడుకుంటాడా ? ఆ గ్యాంగ్ రివేంజ్ లో వీళ్ళు బలవుతారా ? అనే విషయాలను మాత్రం, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×