E-Paper
Advertisement

Gongura Chicken Biryani: ఇంట్లోనే రుచికరమైన గోంగూర చికెన్ బిర్యానీ, రెసిపీ చాలా సులువు

Gongura Chicken Biryani: ఇంట్లోనే రుచికరమైన గోంగూర చికెన్ బిర్యానీ, రెసిపీ చాలా సులువు
Advertisement

గోంగూర అంటేనే ఆంధ్రుల ఇష్టమైన ఆకుకూర. ఆ గోంగూరను చికెన్ బిర్యానీతో కలిపితే వచ్చే రుచి మాటల్లో చెప్పలేం. సాధారణ చికెన్ బిర్యానీకి భిన్నంగా, గోంగూర చికెన్ బిర్యానీకి కొంచెం పుల్లటి టేస్ట్‌తో పాటు ప్రత్యేకమైన వాసన, రుచి ఉంటుంది. ఇంట్లోనే ఈ బిర్యానీని సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోండి.

గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం – రెండు కప్పులు
చికెన్ – అరకిలో
గోంగూర – ఒక పెద్ద కట్ట
ఉల్లిపాయలు – మూడు
టమాటాలు – రెండు
పచ్చిమిర్చి – నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
పెరుగు – అర కప్పు
కారం – ఒక స్పూన్
ధనియాల పొడి – ఒక స్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
బిర్యానీ ఆకులు – రెండు
లవంగాలు – అయిదు
యాలకులు – నాలుగు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
నూనె – అవసరమైనంత
ఉప్పు – రుచికి తగినంత
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
పుదీనా – మూడు స్పూన్లు

Advertisement

గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ
1. ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట పాటూ నానబెట్టాలి.
2. తర్వాత ఒక పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు వేసి బియ్యం వేసి డబ్బై శాతం వరకే ఉడికించాలి. ఆపై నీళ్లు వడకట్టి ఉడికిన అన్నాన్ని పక్కన పెట్టాలి.
3. ఇప్పుడు గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు వేసి వేరే పాత్రలో ఉడికించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో పేస్టులా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో చికెన్ తీసుకుని అందులో పెరుగు, అల్లం వెల్లులి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పావుగంటపాటూ మెరినేట్ చేయాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేసి ఉల్లిముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
6. తరువాత పచ్చిమిర్చి, టమాటాలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
7. ఇప్పుడు మెరినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలపాలి. చికెణ నుంచి నీరు వచ్చి అది ఇంకిపోయే వరకు ఉడికించాలి.
8. చికెన్ బాగా ఉడికిన తర్వాత అందులో గోంగూర పేస్ట్ వేసి కలపాలి.
9. చివరగా గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి.
10. ఇప్పుడు పెద్ద బిర్యానీ పాత్ర తీసుకుని స్టవ్ మీద పెట్టాలి.
11. ముందుగా కొంత చికెన్ మిశ్రమం వేసి దాని మీద కొంత ఉడికిన బాస్మతి అన్నం వేయాలి. అలా లేయర్లలా వేసుకోవాలి.
12. పై నుంచి కొద్దిగా నెయ్యి లేదా నూనె చల్లి మూత పెట్టి తక్కువ మంటపై 10 నిమిషాలు ఉడికించాలి. అంతే టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయినట్టే.

గోంగూర చికెన్ బిర్యానీ వాసన ఘుమఘుమలాడిపోతుంది. దీని రుచి కూడా అద్బుతంగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాంటి బిర్యానీ కన్నా ఇలా కొత్తగా చేసుకుని తింటే అదిరిపోతుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×