E-Paper
Advertisement

Sangareddy District: గురుకులం విద్యార్థుల మధ్య మత చిచ్చు.. చెప్పులతో కొట్టుకుంటూ..

Sangareddy District: గురుకులం విద్యార్థుల మధ్య మత చిచ్చు.. చెప్పులతో కొట్టుకుంటూ..
Advertisement

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలోని రెసోనెన్స్ గురుకుల్ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య మత ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారి తల్లిదండ్రుల మధ్య దాడికి దారితీసింది. హాస్టల్ గదిలో గోడపై మతపరమైన రాతలు రాయడం, వాటిని చెరిపివేయడం కారణంగా డిసెంబర్ 2న రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవ జరిగింది.

ఈ విషయం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, కొందరు తల్లిదండ్రులు క్యాంపస్‌కు వచ్చి ప్రిన్సిపాల్ గదిలో, కాలేజీ సిబ్బంది సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఒకరిని చెప్పుతో కొట్టగా, మరొకరిని గల్లా పట్టి కొట్టారు. లక్షల ఫీజులు చెల్లించి తమ పిల్లలను చేరిస్తే, ఇలాంటి అమానుష దాడులు జరగడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విషయాన్ని దాచిపెట్టడంపై మిగతా విద్యార్థుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల వసూలుపై ఉన్న శ్రద్ధ పిల్లల భద్రతపై లేదని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ గొడవ చివరకు బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్‌కు చేరింది.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×