E-Paper
Advertisement

Breast cancer: ఈ రెండు పనులు చేయండి చాలు, రొమ్ము క్యాన్సర్ రాదు

Breast cancer: ఈ రెండు పనులు చేయండి చాలు, రొమ్ము క్యాన్సర్ రాదు
Advertisement

భారతదేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణాలని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సరైన నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి, కడుపు చుట్టూ కొవ్వు పెరగడం వంటి అంశాలు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును ఎక్కువ చేస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఒకప్పుడు వయసు పెరిగిన మహిళల్లోనే ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు చిన్న వయసు మహిళలలో కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. దీనికి కారణం చెడు జీవన విధానం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి కారణాలని నిపుణులు చెబుతున్నారు.

నిద్ర చాలా ముఖ్యం
నిద్ర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో వైద్య పరిశోధనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సరైన సమయానికి సరిపడా నిద్ర లేకపోతే శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ హార్మోన్ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి కలిగి ఉంటుంది అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రాత్రి వేళ మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటి పరికరాల వినియోగం ఎక్కువ కావడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. దీని వల్ల శరీరం పూర్తిగా విశ్రాంతి పొందదు. దీర్ఘకాలంగా ఇలాంటి అలవాట్లు కొనసాగితే అనేక ఆరోగ్య సమస్యలతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది.

Advertisement

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోండి
పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు మరింత ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. ఇది సాధారణ కొవ్వు కంటే ఎక్కువ హానికరం. ఈ కొవ్వు శరీరంలో వాపు కలిగించే పదార్థాలను విడుదల చేస్తుంది. అలాగే ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఈ కొవ్వు ద్వారా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఎక్కువకాలం ఈస్ట్రోజన్ ప్రభావం ఉండటం బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును పెంచే అంశంగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేవలం బరువు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు, కడుపు భాగంలో కొవ్వు పెరగడం మరింత ప్రమాద సూచకంగా వైద్యులు చెబుతున్నారు.

ఈ మార్పులు చేసుకోండి
ఈ పరిస్థితుల్లో జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. రాత్రి వేళ స్క్రీన్ వినియోగం తగ్గించడం, ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే కడుపు కొవ్వు తగ్గేందుకు నడక, యోగ, తేలికపాటి వ్యాయామాలు చేయాలి. పోషకాహారం తీసుకోవడం, జంక్ ఫుడ్ తగ్గించడం కూడా చాలా అవసరం. ఒత్తిడి తగ్గించే అలవాట్లు పెంచుకోవాలి. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా పూర్తిగా అడ్డుకోకపోయినా, ముప్పును గణనీయంగా తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న అలవాట్ల మార్పులతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అనే విషయాన్ని ప్రతి మహిళ గుర్తుంచుకోవాలి.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×