E-Paper
Advertisement

Lava Blaze Duo 3: దేశీయ బ్రాండ్ నుంచి పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే ముక్కున వేలేసుకుంటారు!

Lava Blaze Duo 3: దేశీయ బ్రాండ్ నుంచి పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే ముక్కున వేలేసుకుంటారు!
Advertisement

Lava Blaze Duo 3: మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా నుంచి సరికొత్త సంచలనం రాబోతోంది. వినూత్నమైన డిజైన్‌తో కూడిన Lava Blaze Duo 3 స్మార్ట్‌ఫోన్ జనవరి 19న భారత మార్కెట్లో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో విడుదలైన టీజర్లు, అమెజాన్ లిస్టింగ్ వివరాల ప్రకారం.. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

డ్యుయల్ డిస్‌ప్లేతో సరికొత్త డిజైన్:

లావా బ్లేజ్ డ్యుయో 3లో అత్యంత ప్రధానమైన ఫీచర్ దాని డ్యుయల్ డిస్‌ప్లే. ప్రధానంగా 6.67 అంగుళాల Full HD+ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. అయితే, ఈ ఫోన్‌లో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. కెమెరా మాడ్యూల్‌లో ఉండే 1.6 అంగుళాల సెకండరీ AMOLED డిస్‌ప్లే. దీని ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయకుండానే నోటిఫికేషన్లు చూడటం, మ్యూజిక్ కంట్రోల్ చేయడం, రియర్ కెమెరాతో హై క్వాలిటీ సెల్ఫీలు తీసుకోవడం వంటి పనులు సులభతరం అవుతుంది.

Advertisement

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.10వేల లోపే 256GB స్టోరేజ్ iQOO 5G ఫోన్, అస్సలు మిస్ కావొద్దు!

అత్యాధునిక సాఫ్ట్‌వేర్:

పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా.. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌ను అమర్చారు. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్‌ను వేగవంతం చేస్తుంది. స్టోరేజ్ పెంచుకోవడానికి మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. యూజర్లకు ఎలాంటి అనవసరమైన యాప్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ అనుభూతి లభిస్తోందని కంపెనీ హామీ ఇస్తోంది.

పవర్‌ఫుల్ బ్యాటరీ:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ ప్రియుల కోసం Lava Blaze Duo 3 ఫోన్‌లో 50MP సోనీ AI ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. ఇది తక్కువ లైటింగ్‌లో కూడా స్పష్టమైన ఫొటోలను తీయగలదు. ఇక సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాను అందించారు. రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా వాడుకోవడానికి 5000mAh భారీ బ్యాటరీని అమర్చారు. అలాగే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో చాలా తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జ్ అవుతుంది.

ఆసక్తికరమైన ఫీచర్లు:

ప్రీమియం లుక్ కోసం మాట్టే ఫినిష్, ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను వాడారు. కేవలం 181 గ్రాముల బరువు ఉండే ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి చినుకుల నుండి రక్షణ లభిస్తుంది. అంతేకాదు.. Lava Blaze Duo 3లో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఆసక్తికరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. త్వరలోనే పూర్తి ధర వివరాలు వెల్లడి కానున్నాయి. లావా నుండి వస్తున్న ఈ డ్యుయల్ స్క్రీన్ ఫోన్ మార్కెట్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూద్దాం.

ధర వివరాలు(అంచనా):

టెక్ నిపుణులు అంచనాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15,999 నుండి రూ.16,999 మధ్య ప్రారంభ ధరతో లభించే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా 6GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌లో రానుండగా.. లాంచ్ ఆఫర్లు లేదా బ్యాంక్ డిస్కౌంట్లు కలిపితే రూ.15,000 లోపు ధరకే లభించే వీలుంది. ఈ బడ్జెట్‌లో డ్యూయల్ డిస్‌ప్లే, 5G ఫీచర్లతో వస్తున్నందున, ఇది దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోంది.

Also Read: మొదటి రోజే ఇలాగైతే ఎలా? వందే భారత్ స్లీపర్ రైలులో చెత్తాచెదారంపై నెటిజన్లు ఫైర్!

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×