E-Paper
Advertisement

Kidney Foods: వీటిని ఎక్కువ తిన్నారంటే కిడ్నీల పని మటాష్

Kidney Foods: వీటిని ఎక్కువ తిన్నారంటే కిడ్నీల పని మటాష్

మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనది. మన రక్తంలో ఉన్న మలినాలను వడకట్టి బయటకు పంపడం, శరీరంలో నీటి మోతాదును నియంత్రించడం, లవణాల సమతుల్యతను కాపాడడం వంటి పనులు కిడ్నీలు చేస్తాయి. అలాంటి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే ఆ ప్రభావం మొత్తం శరీరంపై పడుతుంది. రోజూ తీసుకునే కొన్ని రకాల ఆహారాలు కిడ్నీల ఆరోగ్యంపై పెద్ద ప్రభావానే చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహారాలను తరచూ అధికంగా తీసుకుంటే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంగా ఇలాంటి అలవాట్లు కొనసాగితే కిడ్నీ సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉప్పు అధికంగా ఉన్నవి
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు కిడ్నీలకు హానికరం. శరీరానికి అవసరమైనంత ఉప్పు సరిపోతుంది. కానీ రోజూ అధికంగా ఉప్పు తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు పెరగడం కిడ్నీలకు చాలా ప్రమాదం. చిప్స్, ప్యాకెట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, రెడీ టు ఈట్ పదార్థాలు ఎక్కువ ఉప్పు కలిగి ఉంటాయి. ఇవి తరచూ తింటే కిడ్నీలు అదనపు ఉప్పును బయటకు పంపేందుకు ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. దీని వల్ల కిడ్నీ పనితీరు క్రమంగా తగ్గుతుంది. ఇంట్లో వండిన తాజా ఆహారం తీసుకోవడం, ఉప్పు వినియోగాన్ని తగ్గించడం కిడ్నీలను రక్షించేందుకు ఉపయోగపడుతుంది అని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రాసెస్డ్ మాంసాహారం
ప్రాసెస్డ్ మాంసాహారం కిడ్నీలకు ముప్పుగా మారుతుంది. సాసేజ్, బేకన్, సలామీ వంటి మాంసాహార పదార్థాల్లో ఉప్పు మోతాదు ఎక్కువగా ఉంటుంది. అదనంగా రసాయన పదార్థాలు, ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్లిన తర్వాత కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. తరచూ ఈ రకమైన ఆహారం తీసుకునే వారిలో కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని పరిశోధనలు చెబుతున్నాయి. మాంసాహారం తీసుకోవాలనుకుంటే తాజా చేపలు, చికెన్ వంటి వాటిని పరిమితంగా తీసుకోవడం మంచిది. పప్పులు, కూరగాయల నుంచి ప్రోటీన్ పొందడం కూడా కిడ్నీలకు మేలు చేస్తుంది.

పంచదార చేసిన ఆహారాలు
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం కూడా కిడ్నీల ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తుంది. తీపి పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్, మిఠాయిలు, బేకరీ పదార్థాలు అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతుంది. అలాగే మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది. మధుమేహం కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణం అని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే కిడ్నీల్లో ఉన్న చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. దీని వల్ల రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే తీపి పదార్థాలను పరిమితంగా తీసుకోవడం చాలా అవసరం.

ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న ఆహారం కూడా కిడ్నీలకు ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది కూల్ డ్రింక్స్, ప్యాకెట్ స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ పదార్థాల్లో ఫాస్ఫరస్ మోతాదు అధికంగా ఉంటుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఈ ఖనిజం శరీరంలో పేరుకుపోతుంది. దీని వల్ల ఎముకల బలహీనత, గుండె సమస్యలు కూడా రావచ్చు. అలాగే కృత్రిమ స్వీట్‌నర్లు ఉన్న ఆహారాలను తరచూ తీసుకోవడం కూడా కిడ్నీల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. తాజా కూరగాయలు, పండ్లు, తగిన మోతాదులో నీరు, తక్కువ ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం అవసరం. రోజూ శారీరక చలనం అలవాటు చేసుకోవడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం కూడా కిడ్నీలకు మేలు చేస్తుంది. ఒకే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం కంటే అన్ని రకాల పోషకాలు సమపాళ్లలో అందేలా చూసుకోవాలి. చిన్న అలవాట్ల మార్పులతో పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే జీవన నాణ్యత కూడా మెరుగుపడుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×