E-Paper
Advertisement

Hair Dye: హెయిర్ డై జుట్టుకు వేసుకుంటే కాలేయానికి ప్రమాదమా? ఇదెంత వరకు నిజం

Hair Dye: హెయిర్ డై జుట్టుకు వేసుకుంటే కాలేయానికి ప్రమాదమా? ఇదెంత వరకు నిజం
Advertisement

హెయిర్ డై వాడటం వల్ల లివర్‌కు నష్టం జరుగుతుందా? జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు లేదా ఫ్యాషన్ కోసం చాలామంది రెగ్యులర్‌గా హెయిర్ డై వాడుతున్నారు. అయితే ఇందులో ఉండే కెమికల్స్ వల్ల ఆరోగ్యంపై, ముఖ్యంగా లివర్‌పై ప్రభావం ఉంటుందనే భయం కొందరిలో కనిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజం? నిపుణులు ఏం చెబుతున్నారు?

కాలేయానికి హాని కలుగుతుందా?
సాధారణంగా హెయిర్ డై వాడటం వల్ల లివర్‌కు పెద్దగా హాని కలగదు. డైలో ఉండే కెమికల్స్ చర్మం ద్వారా శరీరంలోకి చాలా తక్కువ మోతాదులో మాత్రమే చేరతాయి. అందువల్ల, సాధారణంగా నెలలో ఒకసారి లేదా కొంతకాలానికి ఒకసారి డై వాడే వారికి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే, సాధారణ వినియోగంలో భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. పూర్తిగా ప్రమాదం లేదని కూడా చెప్పలేము. చాలా అరుదుగా కొందరికి హెయిర్ డై వల్ల అలెర్జీ లేదా ఇతర రియాక్షన్లు రావచ్చు. కొన్ని కేసుల్లో లివర్ ఇంజరీ లేదా హెపటైటిస్ వంటి సమస్యలు వచ్చినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి. కానీ ఇవి చాలా అరుదైన సంఘటనలు. ముఖ్యంగా ఎక్కువసార్లు డై వాడే వారు లేదా ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రమాదం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు.

Advertisement

Also read: Mango Storage: వేసవిలో మామిడి పండ్లు ఎలా నిల్వ చేయాలి? ఫ్రిజ్ లో పెట్టవచ్చా?

ఈ జాగ్రత్తలు తీసుకోండి
హెయిర్ డై కంటే ఇతర అలవాట్లు లివర్‌కు ఎక్కువ హాని చేస్తాయి. ముఖ్యంగా పొగ త్రాగడం లివర్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. హెయిర్ డై వాడుతూ పొగ త్రాగితే, శరీరంలో టాక్సిన్స్ పెరిగి లివర్‌పై ఒత్తిడి మరింత పెరుగుతుంది. అందుకే నిపుణులు హెయిర్ డై మానేయడం కంటే, స్మోకింగ్ మానేయడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. హెయిర్ డై వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి నాణ్యత ఉన్న బ్రాండ్లను మాత్రమే ఉపయోగించడం మంచిది. డై వేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం ద్వారా అలెర్జీ ఉందో లేదో తెలుసుకోవచ్చు. గాయాలు ఉన్న స్కిన్‌పై డై వాడకూడదు. అలాగే తరచుగా డై వాడటం తగ్గించడం కూడా మంచిది. మొత్తంగా చూస్తే, సరైన జాగ్రత్తలతో హెయిర్ డై వాడితే పెద్ద ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Also read: Beauty tips: షేవింగ్ లేదా వాక్సింగ్… ఏది చేయించుకుంటే చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి?

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×