E-Paper
Advertisement

‘రారా ధీవర’ అంటూ రచ్చ లేపుతున్న నిఖిల్.. స్వయంభూ’ ఫస్ట్ సింగిల్ షేక్

‘రారా ధీవర’ అంటూ రచ్చ లేపుతున్న నిఖిల్.. స్వయంభూ’ ఫస్ట్ సింగిల్ షేక్
Advertisement

Swayambhu Movie : ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న నిఖిల్, ఇప్పుడు అంతకు మించిన భారీ బడ్జెట్ వండర్‌తో రాబోతున్నాడు. అదే ‘స్వయంభూ’.భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రారా ధీవర‌’ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

నిఖిల్ పై నిర్మాతల నమ్మకం.. భారీ బడ్జెట్ తో రిస్క్!

Advertisement

సాధారణంగా మీడియం రేంజ్ హీరోలపై వందల కోట్లు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు వెనకాడుతుంటారన్న సంగతి తెల్సిందే .కానీ నిఖిల్ మార్కెట్ స్టామినా ‘కార్తికేయ 2’ తర్వాత పూర్తిగా మారిపోయింది. అందుకే ‘స్వయంభూ’ కోసం నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఖర్చు పెట్టారని  విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది.ఇక సెట్స్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతి విషయంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది కూడా

మాస్ కు పూనకాలు తెప్పించే ‘రారా ధీవర‌’

Advertisement

తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రారా ధీవర‌’ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్‌ను, అతనిలో ఉన్న ధైర్యాన్ని, పోరాటాన్ని ఎలివేట్ చేస్తూ ఈ పాటను రూపొందించారు. ముఖ్యంగా ఈ పాట మేకింగ్ అయితే టాప్ నాచ్ ..ఇక లెజెండరీ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన”నువ్వే నీ ఉలి.. నువ్వే నీ శిల‌.. నీలో శ‌క్తిని.. శిల్పంగా మార్చ‌రా”
అనే లైన్స్ అయితే నెక్స్ట్ లెవల్. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ తన మార్క్ మ్యూజిక్‌తో నేపథ్య సంగీతాన్ని అదిరిపోయేలా ఇచ్చారు. సంతోష్ వెంకీ వాయిస్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇక వందలాది మంది డాన్సర్ల మధ్య రంగురంగులుగా తీసిన ఈ పాట విజువల్‌గా కూడా కనుల విందుగా ఉంది.

3Dలో యుద్ధ విన్యాసాలు.. 

ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. ‘స్వయంభూ’ 3D లో కూడా విడుదల కానుందట. సినిమాలో ఉండే యుద్ధ సన్నివేశాలు, కత్తుల యుద్ధం 3Dరూపంలో చూస్తుంటే ప్రేక్షకులకు థియేటర్లో గూస్ బంప్స్ రావడం ఖాయమని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. నిఖిల్ ఈ సినిమా కోసం కత్తిసాము నేర్చుకోవడం, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోవడం చూస్తుంటే తన కెరీర్ లోనే ఇది ఒక మైలురాయి మూవీ కాబోతోందని అర్థమవుతోంది.

సమ్మర్లో  ముహూర్తం ఖరారు?

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ వేసవిలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సింది.త్వరలోనే రిలీజ్ డేట్  పై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుందని  ఇన్ సైడ్ టాక్.ఇక సినిమా గురించి  ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజమౌళి సినిమాల తర్వాత ఆ రేంజ్ గ్రాండియర్ మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిఖిల్ ఈ ‘స్వయంభూ’తో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తాడో చూడాలి!

also read:‘మా ఇంటి బంగారం’ నుండి వచ్చేసిన ఫస్ట్ సింగిల్ .. తస్సాదియ్యా అంటున్న సామ్

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×