E-Paper
Advertisement

ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నిరుపేద విద్యార్థిని..!

ఇంటర్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నిరుపేద విద్యార్థిని..!
Advertisement

State Topper: స్వేచ్ఛ బ్యూరో: కడుపేద కుటుంబం తండ్రి లేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాలే ఆధారం అయినా పట్టుదలతో చదివి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది కమలాపూర్ మండలానికి చెందిన కోరే వైష్ణవి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల (ఎం.జె.పి) పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న కోరే వైష్ణవి 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన వైష్ణవి చిన్నప్పటి నుంచే కష్టాలను ఎదుర్కొంటూ చదువులో ప్రతిభ కనబరిచింది. తండ్రి లేకపోయినా తల్లి సంధ్యారాణి కష్టపడి చదివించగా వైష్ణవి పట్టుదలతో ఈ ఘనత సాధించింది.

గ్రామంలో హర్షం..

వైష్ణవి పదవ తరగతిని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పూర్తి చేసి ప్రస్తుతం ఎం.జె.పి బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం పట్ల గ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ వైష్ణవిని అభినందించి నగదు ప్రోత్సాహం అందజేశారు. కష్టపడి చదివి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కడుపేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిని రాష్ట్ర ప్రథమంగా నిలవడం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Advertisement

Also read: న‌వ్వుతూ.. వెక్కిరిస్తూ… ! ప్రియాంక ప్ర‌సంగానికి పార్ల‌మెంటు ఫిదా…

కురుమ సంఘం సభ్యులు 

అదేవిధంగా కురుమ సంఘం సభ్యులు వైష్ణవిని శాలువాతో సత్కరించి నగదు ప్రోత్సాహం అందించారు. ఒకటో వార్డు సభ్యురాలు మార్క సరిత వైష్ణవిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, గ్రామస్తులు వైష్ణవిని అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కష్టాలను అధిగమించి పట్టుదలతో చదివితే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని వైష్ణవి మరోసారి నిరూపించింది.

Advertisement

Also read: ఫుట్ పాత్ పై సర్కార్ సీక్రెట్ ఆపరేషన్.. మార్కింగ్ పడితే కూల్చివేత పక్కా..!

Related News

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×