E-Paper
Advertisement

Hair Oiling Tips: తలకు నూనె ఇలా పెట్టుకుంటే ఊడమన్నా.. ఊడదు !

Hair Oiling Tips: తలకు నూనె ఇలా పెట్టుకుంటే ఊడమన్నా.. ఊడదు !

Hair Oiling Tips: జుట్టు మనిషికి అందాన్ని పెంచుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే అందుకు తగిన పోషణ కూడా అవసరం. జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం తలకు నూనె రాసుకోవడం అవసరం. తలకు నూనె రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి అని చెబుతుంటారు. కానీ ఎప్పుడు రాసుకుంటే మంచిది.. ఎన్ని రోజులకోసారి రాసుకుంటే మంచిది అనే విషయాల గురించి చాలా మందికి తెలియదు. ఇందుకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ దానికి ఒక సమయం, పద్ధతి ఉంటే మాత్రం మంచి ఫలితాలు పొందవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల ప్రయోజనాల కన్నా సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. తలకు నూనె ఎప్పుడు పెట్టుకోవాలి. ఎలా నూనె రాసుకోవాలి అనే విషయాల గురించి చాలా మందికి తెలియదు.

తలకు నూనె ఎప్పుడు రాసుకోవాలంటే..
నూనెలు జిగటగా ఉంటాయని మనందరికీ తెలుసు. తలకు నూనె అప్లై చేసిన తర్వాత ఎక్కువ సమయం ఉంచుకోవడం మంచిది కాదు. జుట్టు జిడ్డుగా ఉండడం వల్ల మలినాలు ఆకర్షిస్తుంది. అంతే కాకుండా ఇది తలలోకి చొచ్చుకుపోయి వెంట్రుకలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జుట్టుకు తరచుగా నూనె రాసుకోవడం మంచిది కాదు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు రాసుకుంటే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే.. తలకు నూనె రాసుకున్న తర్వాత తలస్నానం చేసే సంఖ్య కూడా జుట్టు రాలే సమస్యను పెంచుతుంది. మీకు తరచుగా తలస్నానం చేసే అలవాటు ఉంటే వారానికి నాలుగు సార్లు ఆయిల్ అప్లై చేయవచ్చు.

ఎంత నూనె రాయాలి:
జుట్టుకు ఎంత నూనె రాయాలి అనేది వెంట్రుకల రకం, ఆకృతి, పొడవు, మందంపై ఆధారపడి ఉంటుంది. మందపాటి పొడవాటి జుట్టు ఉన్నవారు ఎక్కువను రాసుకోవాలి. అలాగే సన్నగా పొట్టిగా హెయిర్ ఉండేవారు తక్కువ నూనెను వాడాలి. కొందరు నూనె ఎక్కువగా పెడితే జుట్టు పెరుగుతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.

నూనె రాసుకునే సరైన పద్ధతి:
తలకు నూనె రాయడం వేరు, జుట్టు కుదుళ్లకు పట్టించడం వేరు. చాలామందికి తెలియని అంశం ఏమిటంటే వెంట్రుకలకు నూనె రాయడం కన్నా తలకు పట్టించడం చాలా ముఖ్యం. వెంట్రుకలకు ఆయిల్ రాయడం వల్ల ఫలితం ఉండదు. కానీ తలకు నూనె పట్టించడం వల్ల మొత్తం వెంట్రుకలు బాగా పెరుగుతాయి. తలకు నూనె పట్టించే సమయంలో ఎంత బాగా మసాజ్ చేస్తే అంత మంచి ఫలితాలుంటాయి.

Also Read: జుట్టు ఎక్కువగా రాలి బట్టతల వస్తుందా? ఈ జాగ్రత్తలు పాటించండి!

తలకు నూనె సరైన సమయంలో రాయడం, మర్ధనా చేయడం వల్ల ఆరోగ్యకరమైన కురులు పొందవచ్చు. వెంట్రుకలు పొడవుగా కూడా తయారవుతాయి. వేడి, ఆక్సీకరణ ఒత్తిడి, మలినాల నుంచి వెంట్రుకలకు ఇది రక్షణ ఇస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గి ఆరోగ్యకరమైన మెరిసే కురులు మీ సొంతం అవుతాయి. వీటితో పాటు రక్తపోటు, హృదయ స్పందన రేటు ఆరంభంలో ఉంటే నియంత్రణలో ఉంటాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

Big Stories

×