BigTV English

RC16: కామెడీ ట్రాక్ ఎక్కుతున్న స్టార్ హీరోలు.. మొన్న ప్రభాస్.. నేడు చరణ్

RC16: కామెడీ ట్రాక్ ఎక్కుతున్న స్టార్ హీరోలు.. మొన్న ప్రభాస్.. నేడు చరణ్

RC16:  టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఈ మధ్య యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ లను బద్దలుకొడుతున్నారు. యాక్షన్స్, ఫైట్స్.. కొట్టుకోవడం, నరుక్కోవడం  ఇవే ట్రెండ్ గా నడుస్తున్నాయి. ఒకప్పుడు కామెడీతో అదరగొట్టిన హీరోలు.. ఇప్పుడు పూర్తిగా యాక్షన్ కు మారిపోయారు. అయితే ఇప్పుడు యాక్షన్ ట్రాక్ నుంచి కామెడీ ట్రాక్ ఎక్కుతున్నారు హీరోలు.  నటుడుగా అన్ని జోనర్స్ ట్రై చేయాలనీ ఎవరికైనా ఉంటుంది. మన స్టార్ హీరోలు కూడా ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నారు.


ఇప్పటికే ప్రభాస్.. రాజాసాబ్ సినిమాతో కామెడీ జోనర్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హర్రర్ కామెడీ జోనర్ అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ యాక్షన్ కు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ప్రభాస్ కామెడీ అంటే డార్లింగ్ గుర్తొస్తుంది.  అందులో ప్రభాస్ కామెడీ నెక్స్ట్ లెవెల్. అంతటి కామెడీ.. రాజాసాబ్ లో మరోసారి కనిపిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెప్తున్నారు. ఇక ఇప్పుడు  ప్రభాస్ బాటలోనే రామ్ చరణ్ నడుస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత  చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా  ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా   పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది.


ఇక ఈ సినిమా తరువాత చరణ్.. బుజ్జిబాబు సానా దర్శకత్వంలో RC16 చేస్తున్న  విషయం తెల్సిందే. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో RC16 గురించి చరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా  కామెడీ జోనర్ లో ఉంటుందని చెప్పుకురావడం విశేషం.

“ఇప్పటివరకు కామెడీ జోనర్ టచ్ చేయలేదు.. బుచ్చిబాబు సినిమా కామెడీ జోనర్ లో ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మరి   యాక్షన్ వదిలి కామెడీ  బాట పట్టిన ఈ హీరోలు ఎలాంటి రికార్డులు బద్దలుకొడతారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×