E-Paper
Advertisement

Hair Thinning Baldness: మీరు చేసే ఈ తప్పు వల్లే బట్టతల.. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు ఇవే

Hair Thinning Baldness: మీరు చేసే ఈ తప్పు వల్లే బట్టతల.. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు ఇవే
Advertisement

Hair Fall Thinning Baldness| జుట్టు రాలడం అనే సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య వారిని ఆందోళనకు గురి చేస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. బట్టతల రావడం అనేది జుట్టు రాలిపోవడం వల్లే జరుగుతుందని అందరూ భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదని డాక్టర్లు చెబుతున్నారు. చర్మ, జుట్టు వైద్య నిపుణులు.. జుట్టు రాలడం గురించి, బట్టతల రాబోతోందని శరీరం ఇచ్చే సంకేతాల గురించి వివరించారు. ఈ సంకేతాలని నిర్లక్ష్యం చేస్తే బట్టతల వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీన్ని ముందస్తుగా గుర్తిస్తే జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు.

బట్టతల రావడం వెనుక జుట్టు రాలడం వల్ల మాత్రమే జరగదు

సోషల్ మీడియాలో చర్మ, జట్టు వైద్య నిపుణులు (డెర్మటాలజిస్ట్) డా. నరేంద్ర నికుంభ్ జుట్టు ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన సమాచారం వివరించారు. జుట్టు రాలడం ఒక్కటే బట్టతలకు కారణం కాదని ఆయన చెప్పారు. కొంతమందికి ఒక్కసారిగా బట్టతల వచ్చేస్తుంది. వారిలో క్రమంగా జుట్టు రాలడం లాంటిది జరగదు. ఇది సాధారణంగా జన్యుపరమైన జుట్టు సమస్యల వల్ల జరుగుతుంది. వీరిలో జుట్టు రాలడం అనే సంకేతాలు ముందుగా కనిపించవు. కానీ వారి జట్టు బలహీనంగా, పలచగా ఉంటుంది. ఈ సమస్యను వారు నిర్లక్ష్యం చేస్తారు. ఈ తప్పు కాలక్రమేణా బట్టతల రావడానికి కారణమవుతుంది.

జుట్టు పలచబడటం బట్టతలకు సంకేతం

Advertisement

జుట్టు పలచబడటం.. బట్టతల రావడానికి ముఖ్యమైన ఆరంభ సంకేతం. దీని అర్థం జుట్టు కుదుళ్లు బలహీనంగా, పలచగా మారాయని. జుట్టు సాంద్రత కూడా నెమ్మదిగా తగ్గుతుంది. ఈ మార్పు క్రమంగా, నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి చాలామంది దీన్ని పట్టించకోరు. చాలా మంది జుట్టు రాలడం మీద మాత్రమే దృష్టి పెడతారు, పలచబడటం మీద కాదు. ఇక్కడే వారు పెద్ద తప్పు చేస్తారు.

జుట్టు సాంద్రత అంటే ఏమిటి?

జుట్టు సాంద్రత అంటే జుట్టు కుదుళ్ల సంఖ్య, వాటి మందం. తలపై జుట్టు సంఖ్య అదే ఉన్నా సాంద్రత తగ్గవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి గతంలో 100 జుట్టు కుదుళ్లు ఉండేవి. ఒక సంవత్సరం తర్వాత కూడా సంఖ్య 100గానే ఉండవచ్చు. కానీ ఆ జుట్టు కుదుళ్లు ఇంతకు ముందు కంటే పలచగా, బలహీనంగా మారవచ్చు. దీని వల్ల తలపై చర్మం ఎక్కువగా కనిపిస్తూ.. ఆ ప్రాంతం గుండు లాగా అనిపిస్తుంది.

ఈ సంకేతాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు?

Advertisement

చాలా మంది జుట్టు రాలడాన్ని మాత్రమే హెచ్చరికగా భావిస్తారు. జుట్టు రాలడం కనిపించకపోతే తాము సురక్షితంగా ఉన్నామని అనుకుంటారు. కానీ పలచబడటం ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా నెమ్మదిగా జరుగుతుంది. ఈ ఆలస్యం వల్ల జుట్టు సమస్య మరింత ముదిరిపోతుంది. ముందుగానే గమనించడం ద్వారా పెద్ద నష్టాన్ని నివారించవచ్చు.

జుట్టు పలచబడితే ఏం చేయాలి?

జుట్టు పలచబడడం గమనించగానే చర్య తీసుకోవాలి. ముందుగా జగ్రత్త పడితే జుట్టు రాలడాన్ని కాస్త నెమ్మదించవచ్చు, లేదా నియంత్రించవచ్చు. జుట్టు బలం, మందాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. జీవనశైలిలో మంచి మార్పులు చేస్తే జుట్టు మళ్లీ ఆరోగ్యకరంగా మారవచ్చు లేదా పూర్తిగా బట్టతల రాకుండా నివారించవచ్చు.

జుట్టు మందం ఎలా పెంచాలి?

వారానికి ఒకటి లేదా రెండు సార్లు తలపై నూనెతో మసాజ్ చేయండి. ఇలా చేస్తే కుదుళ్ల రంధ్రాలు ఉత్తేజపరుస్తుంది, రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన రంధ్రాలు మంచి జుట్టు పెరుగుదలకు, మందానికి సహాయపడతాయి. మీ జుట్టు రకం, తలపై చర్మానికి సరిపడే నూనెలు ఎంచుకోండి.

సరైన పోషకాలు తీసుకోండి

మీ ఆహారం జుట్టు ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్, జింక్, అవసరమైన విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోండి. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలకు, జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. అన్ని పోషకాలు ఉండే సమతుల్య ఆహారం.. తలపై చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Also Read: మీ బాల్కనీలో పావురాలు రెట్టలు వేస్తున్నాయా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్

మానసిక ఒత్తిడిని నియంత్రించండి

ఒత్తిడి జుట్టు సన్నబడటం, రాలడాన్ని మరింత పెంచుతుంది. ఇది హార్మోన్లను ప్రభావితం చేసి జుట్టు పెరుగుదల చక్రాన్ని దెబ్బతీస్తుంది. వ్యాయామం లేదా ధ్యానం వంటి రిలాక్సేషన్ పద్ధతులు ప్రయత్నించండి. ప్రశాంతమైన మనస్సు మంచి జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

బట్టతల ఎప్పుడూ జుట్టు రాలడం నుంచి ప్రారంభం కాదు. జుట్టు పలచబారిపోవడం ఒక ముఖ్యమైన ఆరంభ సంకేతం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక జుట్టు సమస్యలు వస్తాయి. జుట్టు సాంద్రత మార్పులపై శ్రద్ధ వహించండి. ముందు జాగ్రత్తలు తీసుకుంటే బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును కాపాడుకోవచ్చు.

ముఖ్యమైన గమనిక: పై తెలిపిన వివరాలు వైద్య నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఇందులో ఏమైనా తప్పిదాలుంటే వాటికి ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

 

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×