E-Paper
Advertisement

Tips to Remove Pigeons: మీ బాల్కనీలో పావురాలు రెట్టలు వేస్తున్నాయా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్

Tips to Remove Pigeons: మీ బాల్కనీలో పావురాలు రెట్టలు వేస్తున్నాయా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్
Advertisement

Tips to Remove Pigeons| పావురాలంటే ప్రేమకు, శాంతికి ప్రతీక. అయితే ఎంతో అందంగా, అమాయకంగా కనిపించే ఈ పక్షుల వల్ల ఆరోగ్యానికి హాని కూడా జరుగుతుంది. పావురాలు సాధారణంగా గూడు కట్టుకోవడానికి, సేద తీరడానికి బహిరంగ ప్రదేశాల కంటే మనుషులు నివసించే ఇంటి బాల్కనీలను ఎక్కువగా ఇష్టపడతాయి.

ఇంట్లో బాల్కనీలు వాటికి సురక్షితంగా, వర్షం, ఎండ నుంచి రక్షణగా, విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఉంటాయి. అయితే పావురాలు అక్కడ కూర్చున్న సమయంలో అవి రెట్టలు వేస్తాయి. దీంతో బాల్కనీ అంతా మురికిగా మారుతుంది. ఆ రెట్టల వల్ల మనుషులకు ఆరోగ్యానికి హాని చేసే బ్యాక్టీరియా వ్యాపించి, దుర్వాసన కూడా వస్తుంది. రెట్టల దుర్వాసనతో శ్వాస తీసుకునేవారికి ఇబ్బంది ఉన్నవారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఈ సమస్యకు పరిష్కార మార్గం.. పావురాలను గాయపరచకుండా అక్కడ రాకుండా చేయాలి. పావురాలు బాల్కనీలో మీ ఇంటి బాల్కనీలో రాకుండా చేయడానికి కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి.

పావురాలు ఇష్టపడని వాసనలు

Advertisement

పావురాలకు కొన్ని వాసనలు నచ్చవు. ఘాటుగా ఉండే కొన్ని వాసనలు వాటికి అసౌకర్యం కలిగిస్తాయి. బాల్కనీలో ఆ ఘాటు వాసన వచ్చేలా చేస్తే పావురాలు ఆ ప్రదేశాన్ని వదిలివెళ్లిపోతాయి. ఈ వాసనలు క్రమం తప్పకుండా బాల్కనీలు ఉపయోగిస్తే పావురాలు మళ్లీ రావు. ఇవన్నీ ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు, పైగా పూర్తిగా సురక్షితం.

ఎర్ర కారం పొడితో స్ప్రే

ఎర్ర కారం (ఎండు మిరపకాయ పౌడర్) పొడిలో చాలా ఘాటు వాసన ఉంటుంది. పావురాలు ఈ వాసన ఉన్న చోటికి రావు. కారం పొడిని నీటితో కలిపి స్ప్రే బాటిల్‌లో నింపండి. పావురాలు ఎక్కువగా కూర్చునే లేదా గూడు కట్టే ప్రదేశాల్లో ఈ స్ప్రే చల్లండి. ప్రతి రోజూ చల్లితే పావురాలు అక్కడ రావడమే మానేస్తాయి.

వెనిగర్ సొల్యూషన్

Advertisement

వెనిగర్‌లో కూడా ఘాటు ఆమ్ల వాసన ఉంటుంది. పావురాలు ఈ వాసన చూస్తే చాలు అక్కడి నుంచి పారిపోతాయి. తెల్ల వెనిగర్ లేదా యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటితో కలిపి స్ప్రే చేయండి. బాల్కనీ చుట్టూ క్రమం తప్పకుండా చల్లండి. రోజూ ఉపయోగిస్తే బాల్కనీలో పావురాలు రావు.

యూకలిప్టస్ లేదా పెప్పర్‌మింట్ ఆయిల్

యూకలిప్టస్, పెప్పర్‌మింట్ ఆయిల్‌ లో ఘాటు సువాసన కలిగి ఉంటాయి. ఈ ఆయిల్ వాసన సహజంగానే పావురాలను దూరంగా ఉంచుతాయి. పావురాలు ఎక్కువగా కూర్చునే బాల్కనీ మూలల్లో కాటన్ బాల్స్‌పై రెండు-మూడు చుక్కలు ఆయిల్ వేసి ఉంచండి. వాసన తగ్గకుండా ప్రతి రెండు-మూడు రోజులకు ఒకసారి మార్చండి.

వెల్లుల్లి, ఉల్లి స్ప్రే తయారు చేయండి

వెల్లుల్లి, ఉల్లి బలమైన సహజ వాసనలు వెలువరిస్తాయి. పావురాలు ఈ వాసనలను అస్సలు ఇష్టపడవు. వెల్లుల్లి, ఉల్లిని నీటిలో మరగబెట్టి సొల్యూషన్ తయారు చేయండి. ఈ ద్రవం చల్లబడిన తరువాత స్ప్రే బాటిల్‌లో నింపి రోజూ బాల్కనీలో చల్లండి.

కోడి గుడ్డు పెంకులు

గుడ్డు పెంకులు కూడా పావురాలను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. విరిగిన గుడ్డు పెంకులు పావురాలకు అసౌకర్యం కలిగిస్తాయి. పావురాలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో గుడ్డు పెంకులు పరచండి. రెండు, మూడు రోజులకు ఒకసారి కొత్త పెంకులు మార్చండి.

Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి

ఈ పద్ధతులు ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలి?

స్ప్రేలను రోజుకు కనీసం రెండు సార్లు చల్లండి. పావురాలు ఎక్కువగా కూర్చునే లేదా గూడు కట్టే ప్రదేశాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. కాటన్ బాల్స్ లేదా గుడ్డు పెంకులు వంటి వాటిని ప్రతి మూడు రోజులకు ఒకసారి మార్చండి. వాసనలు కాలక్రమేణా తగ్గిపోతాయి కాబట్టి నిరంతరం ఉపయోగించడం చాలా ముఖ్యం.

పావురాలు ఇంటి చుట్టుపక్కల మురికి, ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాయి. సహజ వాసనలతో వాటిని సురక్షితంగా, సులభంగా నియంత్రించవచ్చు. సహజంగా లభించే కారం పొడి, కోడి గుడ్డు లాంటి పదార్థాల వాసనలు ఉపయోగించి మీ బాల్కనీని శుభ్రంగా, సురక్షితంగా ఉంచండి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×