E-Paper
Advertisement

Bald Head: మనదేశంలోని మగవారిలో సగం మందికి బట్టతల సమస్య, అసలు కారణం ఏమిటో తెలుసా?

Bald Head:  మనదేశంలోని మగవారిలో సగం మందికి బట్టతల సమస్య,  అసలు కారణం ఏమిటో తెలుసా?
Advertisement

భారతదేశంలోని యువకుల్లో బట్టతల సమస్య వేగంగా పెరుగుతోంది. చాలా మంది పురుషులు చిన్న వయసులోనే జుట్టును కోల్పోయి బట్టతలతో కనిపిస్తున్నారు. ఇది కేవలం వయస్సు పెరగడం వల్ల మాత్రమే కాదు, మరికొన్ని కారణాలు కూడా దీనికి కారణమవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో జీవించే యువకుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పరిశోధకుల చెబుతున్న ప్రకారం జుట్టు రాలిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం జీర్ణక్రియ ఆరోగ్యం. శరీరంలోని జీర్ణక్రియ సరిగా జరగక పోతే మనం తినే ఆహారంలో ఉన్న పోషకాలు శరీరానికి సరిగ్గా అందవు. దీంతో జుట్టు వేర్లు బలహీనంగా మారి క్రమంగా జుట్టు రాలిపోవడం ప్రారంభమవుతుంది.

నిద్రలేకపోయినా…

Advertisement

ఆధునిక జీవనశైలి కూడా ఈ సమస్యకు ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవాలి. పట్టణాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది యువకులు సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వంటి అలవాట్లు కూడా శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ కారణాల వల్ల జుట్టు ఆరోగ్యం కూడా క్రమంగా బలహీనపడుతోంది.

జుట్టు రాలిపోవడానికి ఒత్తిడి కూడా ముఖ్య కారణమే. నిపుణుల మాట ప్రకారం ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్ల సమతుల్యత మారుతుంది. దీనివల్ల జుట్టు పెరుగుదల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టు త్వరగా రాలిపోవడం జరుగుతుంది. కుటుంబ వారసత్వం కూడా బట్టతలకు కారణం అవుతుంది. కుటుంబంలో పెద్దలకు బట్టతల ఉంటే అదే సమస్య తరువాతి తరాలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది హార్మోన్ల ప్రభావంతో బట్టతల సంబంధాన్ని కలిగి ఉంటుంది.

Advertisement

Alos read: Orange Jelly: కేవలం 3 పదార్థాలతో ఇంట్లోనే టేస్టీ ఆరెంజ్ జెల్లీ చేసేయండి, రెసిపీ ఇదిగో

ఈ జాగ్రత్తలు

అయితే బట్టతల సమస్యను పూర్తిగా నివారించలేమని కాదు. సరైన జీవనశైలి పాటిస్తే జుట్టు ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. మొదటగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్, విటమిన్లు, ఐరన్ వంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం మంచిది. అలాగే రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం కూడా అవసరం. వ్యాయామం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు వేర్లకు అవసరమైన పోషకాలు సులభంగా చేరుతాయి. సరైన నిద్ర కూడా చాలా ముఖ్యం. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Also read: Stuffed Bitter gourd: టేస్టీ స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ.. ఇలా వండితే ఎవరికైనా నచ్చేస్తుంది

ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం. యోగా, ధ్యానం వంటి పద్ధతులు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. భారతదేశంలో యువకుల్లో పెరుగుతున్న బట్టతల సమస్యకు జీవనశైలి, ఒత్తిడి, జీర్ణక్రియ ఆరోగ్యం, కుటుంబ వారసత్వం వంటి అనేక అంశాలు కారణమే.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×