E-Paper
Advertisement

Stuffed Bitter gourd: టేస్టీ స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ.. ఇలా వండితే ఎవరికైనా నచ్చేస్తుంది

Stuffed Bitter gourd: టేస్టీ స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ.. ఇలా వండితే ఎవరికైనా నచ్చేస్తుంది
Advertisement

కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి కాకరకాయ చాలా ఉపయోగపడుతుంది. అయితే దీని చేదు రుచి కారణంగా చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ అదే కాకరకాయను స్టఫ్డ్ కాకరకాయలా వండితే అందరూ ఇష్టంగా తింటారు. సరైన మసాలాలతో తయారు చేస్తే చేదు కూడా కొంత తగ్గి చాలా టేస్టీగా ఉంటుంది.

స్టఫ్డ్ కాకరకాయ రెసిపీకి కావలసిన పదార్థాలు
కాకరకాయలు – 5 లేదా 6
ఉల్లిపాయలు – రెండు
జీలకర్ర పొడి – ఒక స్పూన్
ధనియాల పొడి – ఒక స్పూన్
సోంపు పొడి – ఒక స్పూన్
కారం – ఒక స్పూన్
పసుపు – అర టీ స్పూన్
అమ్చూర్ పొడి (మామిడి పొడి) – ఒక స్పూన్
ఉప్పు – తగినంత
ఇంగువ – చిటికెడు
నూనె – అవసరమైనంత

Advertisement

Also read: Black Neck: మెడ నలుపును సులువుగా వీటితో తొలగించుకోవచ్చు, ఖర్చేమీ కాదు

స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ
1. ముందుగా కాకరకాయలను బాగా కడగాలి. తర్వాత వాటి పై తొక్కను కొంచెం తీసేయాలి. పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు.
2. తర్వాత ప్రతి కాకరకాయ మధ్యలో పొడవుగా కోయాలి. లోపల ఉన్న గింజలను నెమ్మదిగా తీసేయాలి.
3. ఇప్పుడు వాటిపై కొద్దిగా ఉప్పు రాసి ఒక గంట నుంచి రెండు గంటల వరకు ఉంచాలి.
4. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు కొంత తగ్గుతుంది. తర్వాత వాటిని నీటితో కొద్దిగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
6. తర్వాత మెత్తగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా వేయించాలి.
7. ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారే వరకు వేయిస్తే రుచి మరింత పెరుగుతుంది.
8. తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి, పసుపు, కారం వేసి బాగా కలపాలి.
9. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసి కలపాలి. చివరగా అమ్చూర్ పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు స్టఫ్ చేయడానికి మసాలా రెడీ అయినట్టే.
10. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కాకరకాయలను తీసుకోవాలి. వాటిలో పెట్టిన చీలిక మధ్యలో తయారుచేసిన మసాలాను లోపల నింపాలి.
11. అవసరమైతే కాకరకాయలను ఒక సన్నని దారంతో కట్టుకోవచ్చు. ఇలా కడితే వేయించే సమయంలో మసాలా బయటకు రాదు.
12. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేడి చేయాలి. తర్వాత మసాలా నింపిన కాకరకాయలను అందులో వేయాలి.
13. మంటను తక్కువగా ఉంచి నెమ్మదిగా వేయించాలి. మధ్య మధ్యలో కాకరకాయలను తిప్పుతూ అన్ని వైపులా బాగా వేయించాలి.
14. సుమారు పావుగంట సేపు కాకరకాయలు బాగా మెత్తగా అవుతాయి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ స్టఫ్డ్ కాకర కాయ రెడీ అయినట్టే.

Advertisement

దీన్ని వేడి వేడి అన్నంతో, రొట్టెలతో లేదా చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను ఒకసారి చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రెండు నుంచి మూడు రోజులు కూడా నిల్వ ఉంచి తినవచ్చు.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×