E-Paper
Advertisement

New year 2026 Wishes: ఈ సరికొత్త కోట్స్‌తో మీ స్నేహితులు, ఆప్తులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేయండి

New year 2026 Wishes: ఈ సరికొత్త కోట్స్‌తో మీ స్నేహితులు, ఆప్తులకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేయండి
Advertisement

New year 2026 Wishes: గత ఏడాది మనకు మిగిల్చిన మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. కొత్త ఆశలు, ఆశయాలతో 2026 లో అడుగుపెడుతున్నాం. ఈ శుభ సందర్భంగా అందరి జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నూతన సంవత్సరం 2026 సందర్భంగా అద్భుతమైన కోట్స్, వాట్సాప్ స్టేటస్‌‌ల ద్వారా మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.

Advertisement

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026:

1.ఈ 2026వ సంవత్సరం మీ ఇంట్లో సిరి సంపదలను, సుఖశాంతులను నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు”

Advertisement

2. “కొత్త ఉదయం, కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు.. ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను.” హ్యాపీ న్యూ ఇయర్..

3. మిత్రమా! నీ చిరునవ్వు ఈ ఏడాది పొడవునా ఇలాగే ఉండాలి. నీ ప్రతి అడుగు విజయతీరాల వైపు సాగాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు!”

4. “2026 – ఇది నీ విజయాల సంవత్సరం కావాలి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయి” హ్యాపీ న్యూ ఇయర్ .

5. “పాత బాధలను మర్చిపోదాం.. కొత్త ఆనందాలను పంచుకుందాం. హ్యాపీ న్యూ ఇయర్ 2026″

6. కొత్త ఏడాది మీ జీవితంలో కోటి కాంతులను తీసుకురావాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

7. ఈ ఏడాది మీ ఇంటిల్లిపాదికీ సుఖ సంతోషాలు, ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.

8. కొత్త ఏడాది మీ మోములో మరిన్ని చిరు నవ్వులను నింపాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

9. ఈ సంవత్సరం మీకు అన్నింటా గెలుపునందించే ఏడాది కావాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.

10. గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ అభ్యుదయాన్ని.. ఆకాంక్షిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

11. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

12. సంబరాలు మిన్నంటే వేళ, నింగి నేల కాంతుల హేళ, కావాలి మీ జీవితాలు వెలుగుల ఈ వేళ .. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

13. నూతన సంవత్సరంలో మీరు అనుకున్నది సాధించాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

14. “ఈ కొత్త ఏడాది మీకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని.. మీ ఇల్లు ఎప్పుడూ ఆనంద నిలయంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.

15.”కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త ఆశయాలు.. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ ఈ 2026లో నెరవేరాలని ఆశిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు “

16.”మిత్రమా! పాత చేదు జ్ఞాపకాలను వదిలేద్దాం, కొత్త ఆశలతో 2026కి స్వాగతం పలుకుదాం. మీకు, మీ కుటుంబానికి హ్యాపీ న్యూ ఇయర్!”

Also Read: ప్రపంచమంతా జనవరి 1నే ‘న్యూ ఇయర్’ ఎందుకు జరుపుకుంటుంది? చరిత్ర, ప్రాముఖ్యత తెలుసుకోండిలా!

17.”క్యాలెండర్ లో పేజీ మారడమే కాదు, నీ జీవితంలో గొప్ప మార్పు రావాలని, ఈ ఏడాది నీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటూ.. న్యూ ఇయర్ శుభాకాంక్షలు!”

18.”కష్టాలన్నీ కరిగిపోయి, సుఖసంతోషాలు వెల్లివిరియాలి. ఈ 2026 మీకు ఒక అద్భుతమైన సంవత్సరంగా మిగిలిపోవాలి. హ్యాపీ న్యూ ఇయర్!”

19.”ప్రేమ, ఆప్యాయతల నడుమ ఈ కొత్త ఏడాదిని జరుపుకుందాం. మన బంధం మరిన్ని ఏళ్లు ఇలాగే బలంగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్!”

20. “కమ్మని కలల సమాహారం.. ఈ నూతన సంవత్సరం! మీకు, మీ కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు – 2026!”

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×