E-Paper
Advertisement

New Year 2026: ప్రపంచమంతా జనవరి 1నే ‘న్యూ ఇయర్’ ఎందుకు జరుపుకుంటుంది? చరిత్ర, ప్రాముఖ్యత తెలుసుకోండిలా!

New Year 2026: ప్రపంచమంతా జనవరి 1నే ‘న్యూ ఇయర్’ ఎందుకు జరుపుకుంటుంది? చరిత్ర, ప్రాముఖ్యత తెలుసుకోండిలా!
Advertisement

New Year 2026: నూతన సంవత్సరం అంటే కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త జీవితం అనే భావన అందరికీ కలుగుతుంది. కానీ ఒక సందేహం మాత్రం చాలామందిలో ఇప్పటికీ ఉంది. అదేమిటంటే.. ప్రపంచం మొత్తం ఎందుకు జనవరి 1వ తేదీనే న్యూ ఇయర్‌గా సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది? ఇంతకీ ఈ తేదీ ఎలా మొదలైంది? దీనికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ మనం ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

ప్రాచీన కాలంలో సంవత్సర లెక్కలు నేటిలా ఒకే విధంగా ఉండేవి కావు. అప్పట్లో మనుషులు ప్రకృతి ఆధారంగానే కాలాన్ని గణించేవారు. వ్యవసాయం, ఋతువులు, చంద్రుడి చలనం వంటి అంశాలే కొత్త సంవత్సరానికి ప్రమాణంగా ఉండేవి. అందుకే చాలా నాగరికతల్లో వసంత ఋతువు వచ్చే మార్చి నెలనే కొత్త సంవత్సర ప్రారంభంగా భావించేవారు.

జనవరి పేరెలా వచ్చిందంటే?

Advertisement

న్యూ ఇయర్ జనవరి 1కి మారడానికి ప్రధాన కారణం రోమన్ సామ్రాజ్యం. మొదట రోమన్ క్యాలెండర్‌లో కూడా సంవత్సరం మార్చితోనే మొదలయ్యేది. అయితే పాలనా అవసరాలు, కొత్త అధికారుల నియామకాలు సులభంగా ఉండాలనే ఉద్దేశంతో క్రీ.పూ.153లో సంవత్సర ప్రారంభాన్ని జనవరి 1కి మార్చారు. జనవరి అనే పేరు రోమన్ దేవుడు జానస్ నుంచి వచ్చింది. జానస్ గతాన్ని, భవిష్యత్తును ఒకేసారి చూసే దేవుడిగా భావించబడేవాడు. అందుకే కొత్త ప్రారంభాలకు జనవరి సరైన సమయమని రోమన్లు నమ్మారు.

గ్లోబల్ న్యూ ఇయర్‌గా..

తర్వాత జూలియస్ సీజర్ క్రీ.పూ.46లో జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. ఇందులో జనవరి 1నే అధికారికంగా సంవత్సర ప్రారంభంగా నిర్ణయించారు. అయితే కాలక్రమంలో క్యాలెండర్ లెక్కల్లో స్వల్ప తేడాలు ఏర్పడ్డాయి. ఈ లోపాలను సరిచేయడానికి 1582లో పోప్ గ్రిగోరి 13వ గ్రిగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. ఇదే క్యాలెండర్ నేడు ప్రపంచంలోని చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. ఈ మార్పుతో జనవరి 1 గ్లోబల్ న్యూ ఇయర్ డేగా స్థిరపడింది.

భావోద్వేగ ప్రారంభం..

Advertisement

జనవరి 1కి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం కొత్త ఏడాది ప్రారంభమైన రోజు మాత్రమ కాదు. పాత ఏడాదికి ముగింపు చెప్పి, కొత్త ఆశలతో ముందుకు సాగడానికి ఇదొక ఎమోష్నల్ సెంటిమెంట్ లాంటిది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున వేడుకలు, ప్రార్థనలు, కుటుంబ సమావేశాలు లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే చాలామంది ఈ రోజున కొత్త నిర్ణయాలు తీసుకుని జీవనశైలిని మార్చుకోవాలని ప్రయత్నిస్తారు.

1న జరుపుకోవడానికి కారణమిదే:

అయితే ప్రతి దేశం, ప్రతి సంస్కృతి జనవరి 1నే కొత్త సంవత్సరంగా పాటించదు. భారతదేశంలో ఉగాది, గుడి పడ్వా, విశు వంటి పండుగలు వేర్వేరు కాలగణనల ఆధారంగా వస్తాయి. అలాగే చైనా లూనార్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఒకే తేదీ ఉండాలనే నియమంతో జనవరి 1ను అంతర్జాతీయ న్యూ ఇయర్‌గా అంగీకరించారు.

మొత్తానికి.. జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకోవడం వెనుక దీర్ఘమైన చరిత్ర ఉందని తెలుస్తోంది. కాలంతో పాటు మారిన క్యాలెండర్లు, పాలనా అవసరాలు, మానవ ఆలోచనలే దీనికి కారణం. కానీ తేదీ ఏదైనా.. న్యూ ఇయర్ అసలైన అర్థం మాత్రం ఒక్కటే. గతాన్ని మరచిపోయి.. కొత్త ఆశలతో ముందుకు సాగమని.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×