E-Paper
Advertisement

Sarfaraz Khan: వేలంలో అన్ సోల్డ్‌..కానీ 14 సిక్సర్లతో సర్ఫరాజ్ భీక‌ర సెంచ‌రీ..ఇక CSKను ఆప‌డం ఎవ‌డి త‌రం కాదు

Sarfaraz Khan: వేలంలో అన్ సోల్డ్‌..కానీ 14 సిక్సర్లతో సర్ఫరాజ్ భీక‌ర సెంచ‌రీ..ఇక CSKను ఆప‌డం ఎవ‌డి త‌రం కాదు

Sarfaraz Khan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడబోతున్న సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan ) అదరగొట్టాడు. కేవలం 14 సిక్సర్లతో సెంచరీ నమోదు చేసి దుమ్ము లేపాడు. విజయ్ హజారే ట్రోఫీ లో ( vijay hazare trophy 2025) భాగంగా గోవాతో ( Goa ) జరిగిన మ్యాచ్ లో ముంబై ( Mumbai ) తరఫున బరిలోకి దిగాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ నేపథ్యంలోనే 75 బంతుల్లో 9 బౌండరీలు అలాగే 14 సిక్సర్లతో దుమ్ము లేపాడు. ఈ దెబ్బకు 157 పరుగులు చేసి రఫ్పాడించాడు. సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసకర బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 444 పరుగులు సాధించింది. సర్ఫరాజ్ ఖాన్ దుమ్ము లేపిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 2026 టోర్నమెంటులో ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కచ్చితంగా టైటిల్ నెగ్గుతుందని అంటున్నారు.

Also Read:  PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

14 సిక్సర్లతో సర్ఫరాజ్ ఖాన్ భీక‌ర సెంచ‌రీ

విజయ్ హజారే ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. గ్రూప్ -సీలో ఉన్న గోవా అలాగే ముంబై మధ్య ఫైట్ జరిగింది. జైపూర్ లోని జైపూరియా విద్యాలయ గ్రౌండ్ లో ఈ అదిరిపోయే మ్యాచ్ నిర్వహించారు. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్నిత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 444 పరుగులు సాధించింది. ఇందులో యశస్వి జైస్వాల్ 46 పరుగులతో రాణించగా.. ముషీర్ ఖాన్ అలాగే సర్ఫరాజ్ గాని ఇద్దరు అదరగొట్టారు. ఇద్దరు బ్రదర్స్ 200కు పైగా పరుగులు సాధించారు. ముషీర్ ఖాన్ 66 బంతులు 60 పరుగులు సాధించగా , అతని సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ 157 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో ముంబై భారీ స్కోరు సాధించగలిగింది. ముషీర్ ఖాన్ ఇన్నింగ్స్ లో 14 సిక్సర్లతో పాటు తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. 209 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు సర్ఫరాజ్ ఖాన్. ఇక 444 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో గోవా జట్టు తడబడుతోంది. 37 ఓవర్లు వాడిన గోవా 210 పరుగులు సాధించి ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయింది. మరో పదమూడు ఓవర్లలో అంటే 78 బంతుల్లో 235 పరుగులు సాధిస్తే గోవా విజయం సాధిస్తుంది. లేకపోతే ముంబై గ్రాండ్ విక్టరీ కొట్టనుంది.

దుమ్ము లేపిన అన్ సోల్డ్ ప్లేయర్

విజయ్ హజారే టోర్నమెంట్ లో సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు. మొన్నటి ఐపిఎల్ 2026 టోర్నమెంట్ మినీ వేలంలో మొదట సర్ఫరాజ్ ఖాన్ ఎవరు కొనుగోలు చేయలేదు. దీంతో అతడు అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. అయితే చివర్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతన్ని 75 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసి, అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు విజయ్ హజారే టోర్నమెంట్లో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×