E-Paper
Advertisement

Cucumber Juice: దోసకాయ జ్యూస్‌‌తో సమస్యలన్నీ పరార్ !

Cucumber Juice: దోసకాయ జ్యూస్‌‌తో సమస్యలన్నీ పరార్ !

Cucumber Juice: దోసకాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దోసకాయ రసం రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. తరుచుగా దోసకాయ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.

ముఖ్యంగా కంటి చూపుకు కీరదోస కాయ ఎంతో మేలు చేస్తుంది. దోసకాయలో విటమిన్ కె కూడా ఉంటుంది. దోసకాయ రసం తాగడం వల్ల కలిగే లాభాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దోసకాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

బరువు తగ్గడంలో సహాయం:
పెరిగిన బరువుతో ఇబ్బంది పడేవారు దోసకాయ రసం తాగడం మంచిది. దోసకాయ రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా సమయం పాటు ఆకలి అనిపించకుండా చేస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:
జీర్ణ సమస్యలతో బాధపడేవారికి దోసకాయ రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది. దోసకాయలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

చర్మానికి మేలు చేస్తుంది:
దోసకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా చర్మం మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.

కంటికి మంచిది:
దోసకాయలో విటమిన్ కె ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపును మెరుగుపరచడంలో , కంటిశుక్లం వంటి సమస్యల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కంటి సంబంధిత సమస్యలు  రాకుండా చేస్తుంది.

Also Read: బ్రౌన్ రైస్ తింటే నిజంగానే షుగర్ కంట్రోల్‌ చేసుకోవచ్చా..?

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది:
వేసవిలో మాత్రమే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని అనుకుంటాం. కానీ వర్షాకాలంలో కూడా శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దోసకాయలో 96% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది:
దోసకాయలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి దోసకాయ రసం ప్రయోజనకరంగా ఉంటుంది.

దోసకాయ జ్యూస్ ఎలా తయారు చేయాలి ?

కావలసినవి:
దోసకాయ- 1
నీరు – తగినంత
నిమ్మరసం- రుచి ప్రకారం
పుదీనా ఆకులు- రుచి ప్రకారం

తయారీ విధానం:
దోసకాయ జ్యూస్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం, ముందుగా దోసకాయను బాగా కడిగి తొక్క తీసి వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో పుదీనా ఆకులను వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత రసాన్ని వడపోసి గ్లాసులోకి తీసుకోవాలి. మీకు కావాలంటే, దీనిలో నిమ్మరసం, ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేయవచ్చు.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×