BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu Promo: నైనికా, నబీల్ హాట్ పర్ఫార్మెన్స్.. కెమిస్ట్రీలో విష్ణుప్రియా, పృథ్వి పెయిర్ హిట్.. రెడ్ సిగ్నల్ ఎవరికి వచ్చింది?

Bigg Boss 8 Telugu Promo: నైనికా, నబీల్ హాట్ పర్ఫార్మెన్స్.. కెమిస్ట్రీలో విష్ణుప్రియా, పృథ్వి పెయిర్ హిట్.. రెడ్ సిగ్నల్ ఎవరికి వచ్చింది?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ హౌస్‌లో సండే అంటేనే ఫన్‌డే. ఇక ప్రతీ ఫన్‌డేలో కంటెస్టెంట్స్‌తో సినిమాలకు సంబంధించిన ఆటలు ఆడించడం, పాటలు పాడించడం.. ఆ తర్వాత అదే పాటలకు వారితో స్టెప్పులు వేయించడం కామన్. ఇక అలాగే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయినప్పటి నుండి ప్రతీ సండే ఎపిసోడ్‌లో విష్ణుప్రియా, పృథ్వి కలిసి కపుల్ డ్యాన్స్ చేయడం కామన్ అయిపోయింది. దీంతో వీరి కెమిస్ట్రీ సూపర్ హిట్ అని కొందరు ప్రేక్షకులు మార్కులు వేస్తున్నారు. ఇక హౌస్‌లోని అందరు కంటెస్టెంట్స్‌కు డ్యాన్స్ టీచర్‌లాగా మారిన నైనికా.. వారితో కలిసి స్టెప్పులేసి ఆడియన్స్‌ను అలరించింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


పజిల్ పోటీ

ఈసారి సండే ఫన్‌డేలో కంటెస్టెంట్స్‌కు నాగార్జున పజిల్స్ ఇచ్చారు. ఆ పజిల్స్‌ను సాల్వ్ చేస్తే పాట ఏంటో తెలుస్తుంది. దీంతో ఆ పాట ముందుగా కనిపెట్టిన కంటెస్టెంట్.. దానికి స్టెప్పులేయాలి. అలా ముందుగా పజిల్స్ గేమ్ ఆడడం కోసం పృథ్వి, నబీల్ పోటీకి దిగారు. అందులో నబీలే ముందుగా ఆ పాటను కనిపెట్టాడు. ఆపై ‘ఎఫ్ 2’లోని గిర్రా గిర్రా పాటకు నైనికాతో కలిసి స్టెప్పులేశాడు. ఆ పర్ఫార్మెన్స్ మధ్యలోనే తన వల్ల కాదు అని నబీల్ తప్పుకున్నా.. నైనికా మాత్రం తన చేయి పట్టుకొని డ్యాన్స్ చేయించింది. దీంతో వీరి పర్ఫార్మెన్స్ చాలా హాట్‌గా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఆ తర్వాత నైనికా, ప్రేరణ పజిల్ పోటీకి వచ్చారు.


Also Read: ‘హగ్ బాస్’పై నాగార్జున స్పందన.. ఇంకొకసారి ఇలా చేస్తే బయటికి పంపిస్తానంటూ అతడికి వార్నింగ్

అమ్మాయిల హాట్ పర్ఫార్మెన్స్

నైనికా కంటే ముందే కుర్చీ మడతపెట్టి పాట పజిల్‌ను సాల్వ్ చేసింది ప్రేరణ. పజిల్ గేమ్ గెలిచిన ఆనందంలో ప్రేరణ గంతులేయగా అది చూసి అందరూ నవ్వుకున్నారు. ఆపై నైనికా, ప్రేరణ కలిసి అదే పాటపై పర్ఫార్మ్ చేశారు. ఈ ఇద్దరి భామల హాట్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నాగార్జున కూడా ఇంప్రెస్ అయ్యి చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత సోనియా, నాగ మణికంఠ పజిల్ పోటీకి వచ్చారు. తమకు వచ్చిన సామి పజిల్ పాటను ముందుగా సోనియా సాల్వ్ చేసి గంట కొట్టింది. కానీ ఆ పాటకు వారిద్దరూ డ్యాన్స్ చేయకుండా పృథ్వి, విష్ణుప్రియాను ముందుకు పంపించారు. వాళ్లు కూడా ఆసక్తితో ముందుకొచ్చారు.

సామి పాటకు స్టెప్పులు

పృథ్వి మాత్రం తనకు డ్యాన్స్ రాదని సైలెంట్‌గా నిలబడినా.. విష్ణుప్రియానే ‘సామి’ పాటకు ఇరగదీసే స్టెప్పులేసింది. దీంతో వీరి కెమిస్ట్రీ హిట్ అని పలువురు ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ఆపై కంటెస్టెంట్స్‌లో ఎలిమినేషన్ టెన్షన్ మొదలయ్యింది. ఇంకా నామినేషన్స్‌లో విష్ణుప్రియా, యష్మీ, నాగ మణికంఠ, పృథ్వి, అభయ్ ఉన్నారు. వారందరికీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇచ్చారు. అందులో ఎవరికి రెడ్ సిగ్నల్ వస్తుందో వారు అన్‌సేఫ్, ఎవరికైతే గ్రీన్ సిగ్నల్ వస్తుందో వారు సేఫ్ అని నాగార్జున వివరించారు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8లో మూడోవారం అభయ్ ఎలిమనేట్ అయిపోయాడని బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ సమాచారం.

Related News

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజా జన్మలో సపోర్టింగ్ టాస్క్ అడగదు… నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Big Stories

×