E-Paper
Advertisement

Morning Super Foods: మార్నింగ్ తప్పకుండా తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసా..?

Morning Super Foods: మార్నింగ్ తప్పకుండా తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసా..?
Advertisement

Morning Superfoods: ఖాళీ కడుపుతో ఉదయం పౌష్టికాహారం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మార్నింగ్ తినే ఆహారం గంటల తరబడి మనల్ని ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఉదయం పూట మనం తినే ఆహారంలో సాధారణంగా ఫైబర్, ప్రోటీన్‌‌తో పాటు అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజు ఉదయం సూపర్ ఫుడ్స్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

అరటి పండ్లు:

Advertisement

వీటిలో ఫైబర్, విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అరటి పండ్లు మనకు లభించే ఉత్తమ ఆహారాల్లో ఒకటి. ఉదయాన్నే రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి కావసినంత శక్తి లభిస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు, అరటిపండ్లలో ఉండే కార్బోహైడ్రేట్లు ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తాయి.

ఖర్జూరం:

Advertisement

వీటిలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, విటమిన్లతో పాటు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజు వారి ఆహారంలో ఖర్జురాలను చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగే నష్టాన్ని నివారించవచ్చు.

Also Read: Cooking Oil: వంటనూనెను ఆ చోట పెడుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా

యాపిల్స్:

రోజుకో యాపిల్ తింటే డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. ఇందులో విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియంతో పాటు జింక్ వంటి పోషకాలు ఉంటాయి. యాపిల్ ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ తింటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆపిల్ శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది. ఆపిల్ తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.

బాదం:

వీటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఉదయం పూట బాదం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బాదం పప్పును పచ్చిగా లేక సలాడ్‌లో కలిపి తినవచ్చు. కాఫీ కాకుండా అప్పుడప్పుడు బాదం పాలు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. రాత్రంతా నానబెట్టి ఉదయం బాదం తింటే ఎంతో మంచిది.

Also Read: వావ్.. గుమ్మడి గింజలతో ఇన్ని లాభాలా.. తెలిస్తే షాక్ అవుతారు..

గుడ్లు:

గుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. సహజంగా లభించే ఇతర ఆహారాల కంటే గుడ్లలో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. అల్పాహారంగా ఉడకబెట్టిన గుడ్లను తినడం మంచిది. ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది.

చియా విత్తనాలు:

వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. మార్నింగ్ స్మూతీలో వీటిని చేర్చుకోవడం కూడాఆరోగ్యానికి మంచిది.

Related News

లెక్కలో యమ ఫాస్ట్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆర్థిక లావాదేవీల్లో నిపుణులు

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

Big Stories

Advertisement
×