BigTV English
Advertisement

‘Gangs of Godavari’ OTT: ఓటీటీలోకి విశ్వక్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

‘Gangs of Godavari’ OTT: ఓటీటీలోకి విశ్వక్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Vishwak Sen’s ‘Gangs of Godavari’ OTT Release Date: ‘గామి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మే 31న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా మాస్ యాక్షన్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై గ్రాండ్‌ లెవెల్లో తెరకెక్కంది. ఇందులో విశ్వక్‌కు జోడీగా నేహా శెట్టి నటించగా.. మరో కీలక పాత్రలో తెలుగమ్మాయి అంజలి నటించి అదరగొట్టేసింది.


ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే మంచి టాక్ అందుకుంది. ఇందులో విశ్వక్ మాస్ యాక్షన్ ఓ రేంజ్‌లో ప్రేక్షకుల్ని అలరించింది. అలాగే నేహా అందాలు, అంజలి వయ్యారాలు అందరినీ కట్టిపడేశాయి. అయితే మరికొందరికి మాత్రం ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు. ఎందుకంటే అంతా వెంట వెంటనే జరిగిపోయినట్లు కనిపించడమే ఇందుకు ముఖ్య కారణం.

ఈ మూవీలో విశ్వక్ మొదటిగా వేశ్య పాత్రలో నటించిన అంజలితో ఉంటాడు.. అయితే అదే ఊరికి చెందిన మరో వ్యక్తి కూడా అంజలితో ఉండాలనుకుంటాడు. కానీ దానికి అంజలి అంగీకరించదు. దీంతో ఆక్రోసంతో విశ్వక్‌పై అతడు కోపం పెంచుకుంటాడు. అలా ఓ సమయంలో వారి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత విశ్వక్ వాల్ల ఊరిలో జరుగుతున్న ఇసుక అక్రమ దందాతో డబ్బులు సంపాదించాలని చూస్తాడు.


Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్విట్టర్ రివ్యూ.. లంకల రత్నం అదరగొట్టేశాడంటగా..!

అందులో చేరిన తర్వాత ఎమ్మెల్యే దగ్గర చేరుతాడు.. ఆయన దగ్గర మంచి పేరు సంపాదించి ఆ ఎమ్మెల్యే పైనే పోటీ చేస్తాడు. అలా పోటీ చేసి గెలిస్తాడు.. ఇదంతా చాలా స్పీడ్ స్పీడ్‌గా జరిగిపోతుంది. అందువల్ల కొందరికి ఈ మూవీ పెద్దగా ఎక్కలేదు. కానీ ఈ మూవీ వసూళ్లలో మాత్రం తన హవా కనబరుస్తుంది. థియేటర్లలో సూపర్ టాక్ వచ్చే సినిమాలు మరేవి లేకపోవడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇక థియేటర్లలో అదరగొడుతోన్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ వార్త బయటకొచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల అంటే జూన్ ఆఖరి వారంలో ఈ మాస్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×