E-Paper
Advertisement

Muskmelon Seeds Benefits: కర్బూజ గింజలతో బెనిఫిట్స్ ఎన్నో !

Muskmelon Seeds Benefits: కర్బూజ గింజలతో బెనిఫిట్స్ ఎన్నో !
Advertisement

Muskmelon Seeds Benefits: ప్రకృతిలో సహజంగా లభించే పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. పండ్లలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. పండ్లలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లలో కర్బూజ కూడా ఒకటి. ఈ పండులో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. అంతే కాకుండా పోషకాలు అధికంగా ఉంటాయి.

ఇదిలా ఉంటే చాలా మంది కర్బూజ పండు తినగానే అందులో ఉన్న విత్తనాలను పడేస్తుంటారు. ఈ విత్తనాలను పడేసేవారు అనేక ప్రయోజనాలను కోల్పోయినట్టే అని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కర్బూజ విత్తనాలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాలు:
కర్బూజ గింజలలో విటమిన్ సి, ఇ, ప్రోటీన్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, జింక్, ఫైబర్ , వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే కర్బూజ గింజలలో లైకోపిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీర కణాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుంది.
ప్రయోజనాలు
రోగ నిరోధక వ్యవస్థ:
కర్బూజ గింజలు తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడడానికి సహాయపడతాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం:
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కర్బూజ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నిరోధిస్తాయి.
జీర్ణక్రియ:
ఫైబర్ అధికంగా ఉండే కర్బూజ గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలు తినడం వల్ల మలబద్దకం, జీర్ణక్రియ సమస్య నయమవుతుందని అంటున్నారు. 2016 లో ఫుడ్ ఫంక్షన్ జనరల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం కర్బూజ గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఈ పరిశోధనలో చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
అధిక రక్తపోటు: కర్బూజ గింజలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో ఈ గింజలు చక్కగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తరుచుగా ఈ గింజలను తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి.
ఎముకల ఆరోగ్యం:
కర్బూజ గింజలు మెగ్నీషియం, పాస్పరస్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి ఎముకల సాంద్రతను పెంచడానికి దోహదం చేస్తాయి. అంతే కాకుండా ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

Advertisement

Also Read: ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. ఏం అవుతుందో తెలుసా !

చర్మం ఆరోగ్యం:
ఈ గింజల్లో విటమిన్ ఏ, సి, ఇలు ఎక్కువగా ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ బాడీలో తగ్గే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి ఈ విత్తనాలు సహాయపడతాయి. అలాగే చర్మంపై ముడతలు రాకుండా చేయడంతో పాటు వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో ఈ గింజల సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×