E-Paper
Advertisement

The Raja Saab – Mirai: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దూకుడు.. వారం రోజుల గ్యాప్‌లో రెండు బడా సినిమాల రిలీజ్..!

The Raja Saab – Mirai: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దూకుడు.. వారం రోజుల గ్యాప్‌లో రెండు బడా సినిమాల రిలీజ్..!
Advertisement

The Raja Saab – Mirai – People Media Factory: టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ నిర్మాణ సంస్థకు అధినేతలుగా ఉన్నారు. అయితే ఈ నిర్మాణ సంస్థ స్థాపించిన మొదట్లో చిన్న చిన్న సినిమాలను నిర్మించారు. అలా మంచి హిట్లు సాధిస్తూ ఆఖరికి టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతుంది ఈ సంస్థ. అంచెలంచెలుగా ఎదిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు దానిని మరింత పెంచుకునే పనిలో పడింది.

ఇందులో భాగంగానే వరుస సినిమాలు నిర్మిస్తుంది. అందులో మాస్ మహారాజ రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ నిర్మిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీని తర్వాత తన లైనప్‌లో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు వచ్చే ఏడాది అంటే 2025 ఏప్రిల్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అందులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా ఒకటి. దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రాజాసాబ్’.

Advertisement

ఈ సినిమాకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇందులో ప్రభాస్ లుక్, స్టైల్ వేరె లెవెల్‌ ఉన్నాయి. దీంతో ప్రభాస్‌ను ఇప్పటి వరకు మాస్ అండ్ యాక్షన్ లుక్‌లో చూసిన అభిమానులు ఒక్కసారిగా క్లాసిక్ స్టైల్లో చూసి ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. కాగా మేకర్స్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు.

Also Read: ‘రాజాసాబ్’ గ్లింప్స్ రిలీజ్.. ప్రభాస్ ఏమున్నాడురా బాబు

Advertisement

అన్ని పనులు కంప్లీట్ చేసి ‘రాజాసాబ్’ను వచ్చే ఏడాది 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్‌లు రానున్నాయి. ఇక ఇదే బ్యానర్‌లో తెరకెక్కుతోన్న మరో భారీ బడ్జెట్ సినిమా ‘మిరాయ్’. ఈ ఏడాది ప్రారంభంలో ‘హనుమాన్’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జ.. ఇప్పుడు ‘మిరాయ్’తో బడా ప్రాజెక్టు కొట్టేశాడు. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోతున్న మరో బడా ప్రాజెక్టు ఇది.

దీనిపై కూడా అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఎలాంటి బజ్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అన్ని పనులు పూర్తి చేసి ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది 2025 ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో వేచి చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×