E-Paper
Advertisement

Soda Water Effects: ఖాళీ కడుపుతో సోడా తాగుతున్నారా? అయితే ఈ 4 ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లే!

Soda Water Effects: ఖాళీ కడుపుతో సోడా తాగుతున్నారా? అయితే ఈ 4 ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లే!
Advertisement

Soda Water Effects: ఎండ ఎక్కువగా ఉన్నప్పుడో లేదా బాగా దాహమేసినప్పుడు చాలామంది చల్లని సోడా తాగుతుంటారు. ఇలా తాగడం వలన అప్పటికప్పుడు ఉపశమనంగా అనిపించినా.. తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుక్కోవాల్సిందే అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా ఏమీ తినకుండా, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు సోడా తాగితే శరీరానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ‘ఈ ఒక్కసారికే కదా.. ఏమవుతుందిలే’ అని అనుకుంటే మాత్రం పొరపాటు చేసినట్టే. ఖాళీ కడుపుతో సోడా తాగడం వలన మన శరీరంలో జరిగే మార్పులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

కడుపులో గ్యాస్ బాంబు..

మనం సోడా తాగినప్పుడు అందులో ఉండే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ బయటకు వస్తుంది. కడుపులో ఆహారం లేనప్పుడు, ఈ గ్యాస్ అడ్డులేకుండా వేగంగా విస్తరిస్తుంది. దీనివల్ల మీ పొట్టలోని గోడలు ఒక్కసారిగా సాగిపోతాయి. ఫలితంగా విపరీతమైన కడుపు ఉబ్బరం, అసౌకర్యం తలెత్తుతాయి.

Advertisement

Also Read: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 4 తప్పులకు దూరంగా ఉండండి!

యాసిడ్ అటాక్..

ఖాళీ కడుపులోకి సోడాలోని పంచదార, కెమికల్స్ చేరగానే మన జీర్ణవ్యవస్థ గందరగోళానికి గురవుతుంది. దాన్ని అరిగించడానికి కడుపు ఒక్కసారిగా అధిక మొత్తంలో యాసిడ్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల గుండెలో మంట, కడుపులో వికారం కలగడం ఖాయం.

చక్కెర స్థాయులు పెరగడం..

Advertisement

ఆహారం లేకపోవడం వల్ల సోడాలోని పంచదారను అడ్డుకునే శక్తి శరీరానికి ఉండదు. ఆ పంచదార నేరుగా రక్తంలోకి ప్రవహిస్తుంది. ఈ హఠాత్తు మార్పును తట్టుకోవడానికి ప్యాంక్రియాస్ విపరీతంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో మీ గుండె వేగంగా కొట్టుకోవడం, ఒక్కసారిగా నీరసం రావడం జరుగుతుంది.

జీర్ణక్రియ దెబ్బతింటుంది..

శరీరంలోకి చేరిన ఈ భారీ ఎనర్జీ డ్రింక్‌ను హ్యాండిల్ చేయడానికి, మన బాడీ రక్తప్రవాహాన్ని జీర్ణవ్యవస్థ నుండి ఇతర భాగాలకు మళ్లిస్తుంది. దీనివల్ల మీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఆ తర్వాత మీరు ఏ ఆహారం తిన్నా అది సరిగ్గా అరగక భారంగా అనిపిస్తుంది. కాబట్టి.. ఒకవేళ సోడా తాగాలనిపిస్తే, ముందుగా ఏదైనా తిన్న తర్వాతే తాగడం మంచిది.

Also Read: అసలు ఏంటి ఈ బ్లూ టర్మరిక్? మనకు తెలిసిన పసుపు కంటే ఇది భిన్నమైందా?

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×