E-Paper
Advertisement

Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 4 తప్పులకు దూరంగా ఉండండి!

Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 4 తప్పులకు దూరంగా ఉండండి!
Advertisement

Heart Health: సాధారణంగా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి నిత్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ, కొన్నిసార్లు మనకు ఏమాత్రం హాని చేయవు అనిపించే చిన్న చిన్న అలవాట్లే మన గుండెను ప్రమాదంలోకి నెట్టేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన దినచర్యలో భాగమైపోయిన కొన్ని పద్ధతులు దీర్ఘకాలంలో గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ ప్రమాదకరమైన అలవాట్లు ఏంటో.. వాటినెలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర లేమే గుండెకు పెద్ద శత్రువు..

శరీరానికి, మనస్సుకు కావాల్సిన అసలైన విశ్రాంతి నిద్రలోనే లభిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల కేవలం అలసట మాత్రమే కాదు, రక్తపోటు పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలు మొదలవుతాయి. పెరిగిన బీపీ నేరుగా గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి ముప్పులకు దారితీస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం 7 – 8 గంటల పాటు నిద్ర పోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Advertisement

Also Read: రోజూ ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగితే.. మొండి కొవ్వు కరగడమే కాదు, చర్మం కూడా మెరుస్తుంది!

గంటల కొద్దీ కూర్చోవడం..

మారుతున్న జీవనశైలి వల్ల చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోజంతా కూర్చీకే అతుక్కుపోతున్నారు. దీంతో శరీరంలో రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం పడుతుంది. పగలు శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సమయం కూర్చునే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మధ్యమధ్యలో చిన్నపాటి నడక లేదా కదలికలు ఉండటం గుండెకు చాలా అవసరం.

మానసిక ఒత్తిడితో సతమతం..

Advertisement

గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాల్లో ఒత్తిడి అత్యంత ముఖ్యమైనది. దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురవ్వడం వల్ల ఛాతీలో నొప్పి, జీర్ణక్రియ మందగించడం, మానసిక ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల గుండెపై భారం తగ్గుతుంది. అలాగే అతిగా కెఫిన్ తీసుకోవడం, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారం, అల్పాహారం మానేయడం వంటివి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

జీవనశైలిలో మార్పులు..

చాలామంది ఇతరుల బాధ్యతలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ తమ సొంత ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తుంటారు. అందరి గురించి ఆలోచించడం మంచిదే కానీ, మన శరీరం ఇచ్చే హెచ్చరికలను కూడా గమనించాలి. ఇతరుల కోసం తాపత్రయపడుతూ ఒత్తిడికి లోనై ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం సరికాదు. మనం బాగుంటేనే ఇతరులను చూసుకోగలమనే నిజాన్ని గుర్తుంచుకోవాలి. సరైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. ఈ చిన్న మార్పులే మన గుండెను పదికాలాల పాటు పదిలంగా ఉంచుతాయి.

Also Read: మీ రింగుల జుట్టును చూసి అందరూ కుళ్లుకోవాలా? అయితే ఈ సీక్రెట్స్ మీ కోసమే!

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×