E-Paper
Advertisement

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!
Advertisement

Healthy Tips: వందేళ్లు బతికాడా లేదా అన్నది పాత ముచ్చట.. బతికిన నాలుగు రోజులు బెడ్‌పై పడకుండా, రోగాల బారిన పడకుండా యాక్టివ్‌గా ఉన్నాడా లేదా అన్నదే అసలు ముచ్చట.”చావు ఎప్పుడైనా రావచ్చు.. కానీ ఉన్నంత కాలం హాస్పిటల్స్ చుట్టూ తిరగకూడదు” అని కోరుకునే వారి సంఖ్య ఇప్పుడు పెరిగిపోయింది. సరిగ్గా ఇదే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు, సైంటిస్టులు సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు. ‘ఆయుష్షు’ (Lifespan) పెంచుకోవడం కంటే.. ‘ఆరోగ్యకరమైన ఆయుష్షు’ (Healthspan) సాధించడమే నేటి ఆధునిక వైద్య రంగం ముందున్న అతిపెద్ద టాస్క్.

ఇటీవల ఆక్స్‌ఫర్డ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్మార్ట్ ఏజింగ్ సమ్మిట్’ (Smart Aging Summit) ఓ సంచలన నివేదికను విడుదల చేసింది. మనం ఎంతకాలం బతుకుతాం? వృద్ధాప్యంలో మన ఆరోగ్యం ఎలా ఉంటుంది? అనే విషయాలు కేవలం మన పూర్వీకుల నుంచి వచ్చిన జన్యువులపై (Genes) మాత్రమే ఆధారపడి లేవని ఈ స్టడీ తేల్చిచెప్పింది. మన ఆయుష్షును డిసైడ్ చేయడంలో మన జీవనశైలి, రోజువారీ అలవాట్లే 80 శాతానికి పైగా రోల్ ప్లే చేస్తున్నాయట. అంటే.. మన హెల్త్ మన చేతుల్లోనే ఉందన్నమాట!

Advertisement

జీన్స్ కంటే లైఫ్‌స్టైలే కింగ్!
కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ లేదా అల్జీమర్స్ (మతిమరుపు) వంటి వ్యాధులు ఉన్నప్పటికీ.. సరైన లైఫ్‌స్టైల్ మెయింటైన్ చేస్తే ఆయా రోగాల ముప్పు నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చని సైంటిస్టులు గట్టిగా చెబుతున్నారు. బాల్యం నుంచి లేదా మధ్యవయసు నుంచైనా సరే.. ఈ పంచసూత్రాలని పాటిస్తే వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడే పరిస్థితి రాదని స్పష్టం చేస్తున్నారు.

ఒక సారి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ‘పంచసూత్రాలు’ఏంటో  చూస్తే …
నిత్య వ్యాయామం – బాడీకి రీఛార్జ్:
రోజువారీ శారీరక చలనం లేకపోవడం వల్లే సగం రోగాలు వస్తున్నాయి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (Brisk Walking), యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. గుండె కండరాలు బలోపేతమై, మెదడు పనితీరు మెరుగవుతుంది.
సమతుల్య ఆహారం – ది బెస్ట్ మెడిసిన్:
ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, మితిమీరిన చక్కెర పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజూ తినే ఆహారంలో ఆకుకూరలు, తాజా పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించి కణాల క్షీణతను అడ్డుకుంటాయి.
ధూమపానం, మద్యపానానికి ‘నో’
నివేదిక ప్రకారం.. హెల్త్ స్పాన్‌ను దారుణంగా దెబ్బతీసే వాటిల్లో స్మోకింగ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇది నేరుగా డీఎన్ఏ (DNA)ను డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఆల్కహాల్ అలవాటును పరిమితం చేయడం లేదా పూర్తిగా మానేయడం వల్ల లివర్, గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటాయి.
క్వాలిటీ స్లీప్ & స్ట్రెస్ మేనేజ్‌మెంట్:
నిద్రలేమి అనేది సైలెంట్ కిల్లర్. రాత్రి వేళల్లో సరైన నిద్ర లేకపోతే కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరిగిపోయి హైబీపీ, ఊబకాయం, డిప్రెషన్‌కు దారితీస్తుంది. మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్, హాబీలకు సమయం కేటాయించాలి.
సామాజిక బంధాలు – ఒంటరితనానికి చెక్:
మనుషులతో మాట్లాడటం, స్నేహితులతో సమయం గడపడం వల్ల మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. ఒంటరితనం అనేది మనిషిని మానసికంగానే కాక శారీరకంగానూ కృంగదీస్తుందని, మంచి సామాజిక సంబంధాలు ఉన్నవారిలో మతిమరుపు (Dementia) వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ చాలా తక్కువని సైంటిస్టులు గుర్తించారు.
ఏ వయసులోనైనా సరే.. ఇప్పుడే స్టార్ట్ చేయండి!
“ఇప్పటికే వయసు అయిపోయింది.. ఇప్పుడు మార్చుకుంటే ఏం లాభం?” అనుకుంటే పొరపాటే. 40 లేదా 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా ధూమపానం మానేసి, బరువు అదుపులో ఉంచుకుంటూ శారీరక శ్రమ పెంచిన వారిలో.. అకాల మరణాల ముప్పు 60%-70% వరకు తగ్గినట్లు లాంగ్ టర్మ్ స్టడీస్ నిరూపించాయి.
కాబట్టి, ఎక్కువ కాలం బతకడం మాత్రమే కాదు.. బతికినంత కాలం ఎవరిపైనా ఆధారపడకుండా, హెల్తీగా జీవించడమే అసలైన ‘సక్సెస్‌ఫుల్ ఏజింగ్’. ఇవాల్టి నుంచే మీ రోజువారీ అలవాట్లను మార్చుకోండి.. లాంగ్ లైఫ్‌తో పాటు హెల్తీ లైఫ్‌ను మీసొంతం చేసుకోండి!
Also read :‘పెద్ది’ అట్టర్ ప్లాప్ మేనేజ్‌మెంట్: ఏపీలో రూ. 600 రేటు పెంచినా ఓపెన్ కాని బుకింగ్స్..

Tags

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య పని ఒత్తిడి.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×