E-Paper
Advertisement

త్యాగానికి మరో రూపం అమ్మ.. మదర్స్ డే స్పెషల్ విషెస్

త్యాగానికి మరో రూపం అమ్మ.. మదర్స్ డే స్పెషల్ విషెస్

Mother’s Day Wishes 2026: ఈ ప్రపంచంలో ‘అమ్మ’ అనే పదానికి ఉన్న పవర్ మరే పదానికీ లేదు. మనం పుట్టిన క్షణం నుంచి మన ఎదుగుదల వరకు, ప్రతి అడుగులోనూ నీడలా ఉండి నడిపించేది అమ్మే. మదర్స్ డే అంటే కేవలం ఒక ప్రత్యేకమైన రోజు మాత్రమే కాదు. అది మన కోసం అహర్నిశలు శ్రమించే ఆ దేవతకు మనం ఇచ్చే చిన్న కృతజ్ఞత. నేటి బిజీ లైఫ్‌లో కూడా అమ్మ పట్ల మనకున్న ప్రేమను సరి కొత్తగా.. ట్రెండీగా ఎక్స్‌ప్రెస్ చేయడానికి బెస్ట్ కోట్స్ మీకోసం..

తల్లుల హృదయాన్ని హత్తుకునే కొటేషన్స్:

1. అమ్మంటే కేవలం జన్మనిచ్చిన వ్యక్తి మాత్రమే కాదు. కంటిపాపలా కాపాడుకుంటూ మన ఎదుగుదలకు తన జీవితాన్ని ధారపోసే నిరంతర శ్రామికురాలు. అలాంటి అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

2. నడక నేర్పిన పాదాల నుంచి, నాగరికత నేర్పే ఆలోచనల వరకు ప్రతి అడుగులోనూ అమ్మ దీవెనలు ఉంటాయి. అందుకే.. అమ్మే మన మొదటి గురువు, దైవం. హ్యాపీ మదర్స్ డే అమ్మా..

3. కమ్మని కబురు చెప్పాలన్నా.. కష్టం వస్తే కన్నీరు తుడవాలన్నా మొదట గుర్తొచ్చే పేరు అమ్మ. ఆమె ప్రేమకు సాటి వచ్చేది ఈ సృష్టిలో మరొకటి లేదు. హ్యాపీ మదర్స్ డే.

4. ఆకలి వేస్తే అన్నం పెట్టి, భయం వేస్తే అభయమిచ్చి, మనం ఏడుస్తుంటే.. తల్లడిల్లిపోయే కరుణామయి అమ్మ. అలాంటి అమ్మలకు అనంత కోటి వందనాలు. హ్యాపీ మదర్స్ డే

5. లోకమంతా నన్ను వేలెత్తి చూపినా.. నాలో లోపాలు వెతికినా, నువ్వు నా బంగారం అని గుండెలకు హత్తుకునే ఏకైక నిస్వార్థ ప్రేమికురాలు కేవలం అమ్మ మాత్రమే. హ్యాపీ మదర్స్ డే

6. మాతృత్వం అనేది ఒక అద్భుతం. నవమాసాలు మోసి, పురిటి నొప్పులను భరించి, మనకు ప్రాణం పోసిన అమ్మ రుణం తీర్చుకోవడం ఎవరికైనా అసాధ్యమైన పని. హ్యాపీ మదర్స్ డే ..

7. ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత హోదా సంపాదించినా.. అమ్మ ఒడిలో దొరికే ఆ ప్రశాంతత, ఆ కమ్మని నిద్ర కోట్లు ఖర్చు పెట్టినా.. మరెక్కడా దొరకవు. హ్యాపీ మదర్స్ డే

8. నీ ప్రతి విజయం వెనక అమ్మ ప్రోత్సాహం ఉంటుంది. నీ ప్రతి ఓటమిలో ఆమె ఓదార్పు ఉంటుంది. అమ్మే మన జీవితానికి అసలైన స్ఫూర్తి ప్రదాత. హ్యాపీ మదర్స్ డే.

9. దేవుడు కంటికి కనిపించడు అంటారు కానీ.. రూపం మార్చుకొని అమ్మలా మన ఇంట్లోనే ఉంటూ మన బాగోగులు చూసుకుంటున్నాడు. హ్యాపీ మదర్స్ డే.

10. కమ్మని అమ్మ చేతి వంటలో ఉండే రుచి వెనక ఆకలి మాత్రమే కాదు. మన మీద ఆమెకు ఉండే అనంతమైన ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. హ్యాపీ మదర్స్ డే

11. మన సంతోషం కోసం తన కోరికలను త్యాగం చేస్తూ.. మన చిరునవ్వులోనే తన లోకాన్ని వెతుక్కునే.. అమ్మకు ఈ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రేమాభివందనాలు.

12. కాలం మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు. కానీ బిడ్డపై అమ్మకు ఉండే మమకారం ఎప్పటికీ తరగదు. అమ్మ ప్రేమ కాలాతీతమైనది. అత్యంత స్వచ్ఛమైనది. హ్యాపీ మదర్స్ డే.

13. చీకటిలో దారి చూపే దీపంలా ఎండలో.. నీడనిచ్చే చెట్టులా అమ్మ మన జీవితాంతం తోడుంటుంది. అమ్మా.. నువ్వు ఎప్పుడూ ఇలాగే నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. హ్యాపీ మదర్స్ డే అమ్మా.

14. ఈ ప్రపంచంలో అన్ని బంధాల్లోనూ ఏదో ఒక స్వార్థం ఉంటుంది కానీ.. ఏమీ ఆశించకుండా ప్రేమించే ఏకైక బంధం కేవలం తల్లి ప్రేమ మాత్రమే.. హ్యాపీ మదర్స్ డే అమ్మా..

15. మౌనంగా ఉన్నా మన మనసులోని మాటను గ్రహించగల శక్తి కేవలం అమ్మకే ఉంది. ఆమె కళ్లకు మన బాధ, సంతోషం అద్దంలా స్పష్టంగా కనిపిస్తాయి. హ్యాపీ మదర్స్ డే

16. అమ్మ పంచే అనురాగం అమృతం కంటే తీయనైనది. ఆ అమృతాన్ని ప్రతి రోజూ ఆస్వాదించే అదృష్టం మనందరికీ కలగాలని కోరుకుంటూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

17. మనం ఎంత ఎదిగిపోయినా అమ్మ దృష్టిలో ఎప్పుడూ చిన్న పిల్లలమే. ఆ చనువు, ఆ వాత్సల్యం మన జీవితానికి ఒక గొప్ప రక్షణ కవచం లాంటివి. హ్యాపీ మదర్స్ డే

18.నీ త్యాగాలకు వెల కట్టలేం, నీ ప్రేమను కొలవలేం. నా ప్రతి ఊపిరిలో నీ పేరు ఉంటుంది అమ్మా.. నువ్వే నా సర్వస్వం, నా ప్రాణం. హ్యాపీ మదర్స్ డే అమ్మా..

19. మాటలు చాలవు నీ మమకారాన్ని వర్ణించడానికి.. నా మనసు నిండా నీకే చోటు అమ్మా. హ్యాపీ మదర్స్ డే..

20. ఈ మాతృ దినోత్సవం నాడే కాదు. ఏడాదిలో ప్రతి రోజూ అమ్మను గౌరవిద్దాం, ప్రేమిద్దాం. ఆమె కళ్లలో ఆనందాన్ని నింపుతూ గొప్పగా చూసుకుందాం. లవ్ యు అమ్మా.. హ్యాపీ మదర్స్ డే.

Tags

Related News

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

Big Stories

×