E-Paper
Advertisement

ఇంట్లో వంటలు తిన్నా క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

ఇంట్లో వంటలు తిన్నా క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
Advertisement

ఇంట్లో ఆహారం తినడం చాలా ఆరోగ్యకరమని, ఎలాంటి వ్యాధులు రావని అందరూ నమ్ముతారు. కానీ డాక్టర్లు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. దేశంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వర్తికా విశ్వానీ ఇన్‌స్టాగ్రామ్ లో క్యాన్సర్ కారణాలను వివరించారు. క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రావడానికి ఆహారం మాత్రమే కారణం కాదు. తప్పుడు జీవనశైలి, వంట పద్ధతుల వల్ల కూడా వస్తుంది.

ఎక్కువ నూనె, వేయించిన వంటలు

ఇంట్లో చేసే వంటల్లో కూడా చాలా మంది ఎక్కువ నూనెతో, డీప్ ఫ్రై చేసిన వంటకాలు ఎక్కువగా తింటారు. నూనె ఎక్కువసార్లు వేడి చేస్తే.. హానికరమైన రసాయనాలు విడుదల చేస్తుంది. ఇవి శరీరంలో వాపును పెంచి క్యాన్సర్ రిస్క్‌ను పెంచవచ్చు. వేయించిన వంటలను తక్కువగా తినాలి. వాటికి బదులు ఉడికించిన కూరగాయలు, సలాడ్లు ఎక్కువగా తినాలి.

కాలిన ఆహారం హానికరం

Advertisement

గ్రిల్, రోస్ట్, ఎక్కువ వేడితో వండిన ఆహారంలో కాలిన భాగాలు హానికరమైన రసాయనాలు కలిగి ఉంటాయి. ఇలాంటి ఆహారాన్ని రోజూ తినడం మంచిది కాదు. మితంగా, సరైన ఉష్ణోగ్రతలో వండాలి.

తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా తినడం

చాలా మంది ఇంట్లో సాధారణం వండే ఆహారం తింటారు. కానీ వాటితో పాటు తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ లోపం వల్ల శరీర రక్షణ తగ్గుతుంది. రోజూ వివిధ రంగుల కూరగాయలు, సీజనల్ పండ్లు తినాలి.

ప్రాసెస్డ్ పదార్థాలు ఉపయోగించడం

Advertisement

ఇంట్లోనే ప్యాకెట్ సాస్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ ఉప్పు ఉన్న పదార్థాలతో చేసిన ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి హానికరం. తాజా పదార్థాలు ఎక్కువగా వాడాలి. లేబుల్స్ చదివి కొనాలి.

వ్యాయామం లేకపోవడం

మంచి ఆహారం తిన్నా వ్యాయామం లేకపోతే ఊబకాయం, వాపు పెరుగుతాయి. రోజూ నడక, యోగా, వ్యాయామం చేయాలి.

ధూమపానం, మద్యం

ఇంటి వంటలు తిన్నా ధూమపానం, ఎక్కువ మద్యం సేవించడం క్యాన్సర్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. వీటిని పూర్తిగా మానాలి.

ఒత్తిడి, నిద్రలోపం

నిరంతర ఒత్తిడి, తక్కువ నిద్ర శరీరాన్ని బలహీనపరుస్తాయి. రోజూ 7-8 గంటల మంచి నిద్ర, ధ్యానం, హాబీలు ఉండాలి.

పర్యావరణ కారణాలు

కాలుష్యం, రసాయనాలు కూడా క్యాన్సర్‌కు కారణమవుతాయి. వీలైనంతవరకు శుభ్రమైన వాతావరణంలో ఉండాలి.

క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు

క్యాన్సర్ ముందుగా గుర్తించడం ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చు. వయసు, కుటుంబ చరిత్ర ప్రకారం రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవాలి.

Also Read: తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయకూడదు.. పిల్లలు మనసులో ద్వేష భావన కలుగుతుంది

బ్యాలెన్స్ జీవనశైలి అవసరం

ఇంటి వంటలు మంచివి కానీ ఆరోగ్యం కోసం.. మంచి ఆహారంతో పాటు వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ అన్నీ కలిపి ఉండాలి. చిన్న చిన్న మార్పులు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఇస్తాయి.

Related News

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

Big Stories

Advertisement
×