E-Paper
Advertisement

తీరని కోరికల వల్ల పుట్టిన సీక్రెట్ ఎఫైర్… రిటైర్డ్ అయినా తప్పని తిప్పలు… బాబోయ్ పిచ్చెక్కిస్తున్న సీన్లు

తీరని కోరికల వల్ల పుట్టిన సీక్రెట్ ఎఫైర్… రిటైర్డ్ అయినా తప్పని తిప్పలు… బాబోయ్ పిచ్చెక్కిస్తున్న సీన్లు
Advertisement

Romantic Movie on OTT : ఒక మసాలా రొమాంటిక్ సినిమా చూడాలని ఉందా ? అయితే ఇప్పుడు చెప్పుకోబోయే కొరియన్ సినిమాను చూడాల్సిందే. ఇందులో కథ కంటే కూడా ఎక్కువగా హీరో హీరోయిన్ల మధ్య ఉండే బోల్డ్ సీన్ల మీదనే ఈ సినిమా నడుస్తుంది. అందుకే ఇది కేవలం పెద్దలకు మాత్రమే. పెళ్లయిన ఇద్దరు వ్యక్తులు తమ పార్ట్నర్స్ ను మోసం చేసి, దొంగచాటుగా కలుసుకోవడం.. ఆ మోజులో వాళ్లు ఎంత దూరం వెళ్లారు అనేదే ఈ సినిమా. ఇందులో రొమాన్స్ సీన్లు చాలా పచ్చిగా, డైరెక్ట్ గా ఉంటాయి. అందుకే అప్పట్లో ఈ సినిమా కొరియాలో ఒక సెన్సేషన్ అయ్యింది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇదొక తక్కువ బడ్జెట్ అడల్ట్ మూవీ. ఇందులో గొప్ప యాక్షన్ ఉండదు, కళ్లు చెదిరే లొకేషన్లు ఉండవు. అంతా ఇద్దరు వ్యక్తుల ఏకాంత సమయం చుట్టూనే తిరుగుతుంది. టైం పాస్ కోసం, కాస్త మసాలా కంటెంట్ చూడాలనుకునే వాళ్లు దీనిని ఎంచక్కా చూసేయచ్చు.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘లవ్ అఫైర్’ (Love Affair). 2014లో వచ్చిన ఈ సినిమాకు కిమ్ జంగ్-హ్వాన్ దర్శకత్వం వహించారు. ఇందులో హాన్ సే-ఆ (గా-హీ పాత్రలో), జియోన్ జు-హో (సియోంగ్-మిన్ పాత్రలో) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన హాన్ సే-ఆ నిజానికి ఒక మోడల్. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో జరిగిన ‘గ్రాండ్ బెల్ అవార్డ్స్’ వేడుకలో ఆమె వేసుకున్న వింతైన ఎర్రటి డ్రెస్ కొరియాలో పెద్ద దుమారం రేపింది. ఒళ్లంతా నల్లటి తాళ్లతో బిగించినట్లు ఉన్న ఆ డ్రెస్ వల్ల సినిమా కంటే ఆమెకే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. నిజానికి ఈమె నటన కంటే కూడా ఆ రెడ్ కార్పెట్ ఫోటోల వల్లే ఈ సినిమా గురించి చాలా మందికి తెలిసింది. ఇది చాలా తక్కువ బడ్జెట్‌తో కేవలం 91 నిమిషాల నిడివితో తీసిన సినిమా. ఇందులో శృంగార సన్నివేశాలు మోతాదుకు మించి ఉండటంతో దీనికి ‘A’ సర్టిఫికేట్ కూడా  ఇచ్చారు. ఇది ఒక ముసలోడికి, ఒక యంగ్ టీచర్‌కు మధ్య జరిగే శారీరక బంధాన్ని హైలైట్ చేస్తూ తీశారు. అందుకే విమర్శకుల నుంచి దీనికి పెద్దగా మంచి రేటింగ్స్ రాలేదు కానీ, బోల్డ్ కంటెంట్ ఇష్టపడే వారిలో మాత్రం ఇది బాగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా Just Wachలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కథలో హీరో సియోంగ్-మిన్ ఒక రిటైర్డ్ ఉద్యోగి. వయసు మీద పడ్డాక హాయిగా ప్రశాంతంగా గడపాల్సింది పోయి, ఒక చిన్న బుక్ షాప్ పెట్టుకుని బోర్ కొడుతున్న జీవితాన్ని గడుపుతుంటాడు. పెళ్లాంతో పడక సుఖం లేక, రోజులు భారంగా వెళ్లదీస్తున్న టైంలో అతనికి గా-హీ అనే ఒక అందమైన బ్యాలెట్ డాన్స్ టీచర్ పరిచయం అవుతుంది. ఆమెను చూడగానే మనోడిలో ఆరిపోయిన కోరికలన్నీ మళ్ళీ రాజుకుంటాయి. ఇటు పక్క గా-హీ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. మొగుడు ఉన్నాడే కానీ ఆమెకు కావాల్సిన సుఖాన్ని, ప్రేమను ఇవ్వడు. దీంతో ఆమె కూడా ఒక తోడు కోసం ఎదురుచూస్తుంటుంది.

ఇలా దాహం మీద ఉన్న ఈ ఇద్దరు ఒకటవుతారు. తప్పు అని తెలిసినా, ఆ కొత్త రుచికి అలవాటు పడిపోతారు. ఇద్దరూ తమ సంసారాలను పక్కన పెట్టి, దొంగచాటుగా కలుస్తూ రెచ్చిపోయి ఎంజాయ్ చేస్తారు. మొదట్లో సరదాగా, ఎంజాయ్‌మెంట్ కోసం మొదలైన ఈ బంధం మెల్లగా పిచ్చిగా మారిపోతుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఒకరి మీద ఒకరు మోజు పెంచుకుంటారు. కానీ ఈ దొంగ రొమాన్స్ ఎన్నాళ్లు సాగుతుంది? వీళ్ళ వ్యవహారం వల్ల ఇంట్లో గొడవలు మొదలవుతాయి. చివరకు ఈ అక్రమ మోజు వల్ల ఒకరికొకరు కాకుండా పోయే పరిస్థితి వస్తుంది. కామం కళ్లు గప్పితే జీవితాలు ఎలా నాశనం అవుతాయనేదే ఈ సినిమా క్లైమాక్స్. కాకపోతే ఇది కొంచెం బోల్డ్ గా చూపిస్తుంది.

Advertisement

Read Also : విమానం హైజాకింగ్‌తో మొదలై రక్త పిశాచిగా టర్న్… నెవర్ బిఫోర్ కథ మావా

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×