E-Paper
Advertisement

Cold Showers In Summer: వేసవిలో చన్నీటి స్నానం చేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ

Cold Showers In Summer: వేసవిలో చన్నీటి స్నానం చేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ
Advertisement

Cold Showers In Summer: ఎండలో తిరిగి అలసిపోయి ఇంటికి రాగానే.. ఫ్రిజ్‌లో నీళ్లు తాగాలని లేదా ఐస్ లాంటి చల్లని నీటితో స్నానం చేయాలని అనిపించడం సహజం. తక్షణ ఉపశమనం కోసం మనం చేసే ఈ పని శరీరానికి మేలు చేయడం కంటే హాని చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో మన మెదడు చేసే ప్రక్రియకు ఈ చల్లని నీరు ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఎలాంటి నీటిని స్నానానికి వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో చన్నీళ్ల స్నానం ఎందుకు మంచిది కాదు?

Advertisement

ఎండాకాలంలో ఉష్ణొగ్రతలు 40 డిగ్రీలు దాటినప్పుడు మన శరీరం తనను తాను చల్లబరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు శరీర సహజ ప్రక్రియకు విరుద్ధంగా మారుతుంటాయి. అందులో ముఖ్యమైంది ‘కోల్డ్ షవర్’ లేదా అతి చల్లని నీటితో స్నానం చేయడం.

1. శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ:
మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు.. చర్మం దగ్గర ఉండే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీని వల్ల రక్త ప్రసరణ పెరిగి, చెమట రూపంలో వేడి బయటకు పోయి శరీరం చల్లబడుతుంది. అయితే.. మనం అకస్మాత్తుగా చల్లని నీటిని శరీరం పై పోసుకున్నప్పుడు, రక్తనాళాలు ఒక్క సారిగా కుంచించుకుపోతాయి. దీని వల్ల శరీరంలోని అంతర్గత వేడి లోపలే ఉండిపోయి.. బయటకు పోవడానికి మార్గం ఉండదు. దీని ఫలితంగా స్నానం చేసిన కాసేపటికే మీకు మళ్ళీ విపరీతమైన వేడి, చెమట పట్టడం మొదలవుతుంది.

Advertisement

2. మెదడుకు తప్పుడు సంకేతాలు:
చల్లని నీరు చర్మంపై పడగానే.. చర్మంలోని సెన్సార్లు మెదడుకు “బయట వాతావరణం చల్లగా ఉంది” అనే తప్పుడు సంకేతాన్ని పంపుతాయి. దీని వల్ల మెదడు వేడిని బయటకు పంపే.. ప్రక్రియను ఆపివేసి, శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అంటే మీరు చల్లబడాలని స్నానం చేస్తే.. మీ శరీరం మాత్రం లోపల వేడిని పెంచుకుంటుంది.

3. బాడీ షాక్:
ఎండలో తిరిగి వచ్చిన వెంటనే.. ఐస్ కోల్డ్ వాటర్ కింద నిలబడితే శరీరం ‘షాక్’కు గురయ్యే అవకాశం ఉంది. దీని వల్ల గుండె వేగం ఒక్క సారిగా పెరగడం, శ్వాస తీసుకోవడంలో.. ఇబ్బంది కలగడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి.. ఇది ప్రమాదకరంగా మారవచ్చు.

Also Read: ఎండల నుంచి రక్షణకు ‘ఉల్లి’ చేసే మేలు తల్లి కూడా చేయదు!

4. కండరాల నొప్పులు:
తీవ్రమైన వేడిలో కండరాలు రిలాక్స్ అయ్యి ఉంటాయి. అకస్మాత్తుగా చల్లని నీరు తగిలితే అవి బిగుసుకుపోయి నొప్పులకు దారి తీయవచ్చు. అందుకే.. జిమ్ లేదా వ్యాయామం చేసిన వెంటనే కూడా.. అతి చల్లని నీటి స్నానాన్ని చేయకూడదని చెబుతారు.

మరి ఏ నీటితో స్నానం చేయాలి?
వేసవిలో చల్లని నీటి కంటే గోరు వెచ్చని నీరు లేదా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటితో స్నానం చేయడం ఉత్తమం.

గోరు వెచ్చని నీరు చర్మంపై పడినప్పుడు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

ఇది శరీరంలోని వేడిని సహజంగా బయటకు పంపడానికి సహాయ పడుతుంది.

గోరు వెచ్చని స్నానం తర్వాత మన శరీరం క్రమంగా చల్లబడుతుంది. దీని వల్ల ఎక్కువ సేపు హాయిగా ఉంటుంది

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×