E-Paper
Advertisement

Raw onion benefits: ఎండల నుంచి రక్షణకు ‘ఉల్లి’ చేసే మేలు తల్లి కూడా చేయదు!

Raw onion benefits: ఎండల నుంచి రక్షణకు ‘ఉల్లి’ చేసే మేలు తల్లి కూడా చేయదు!
Advertisement

Raw onion benefits: తెలుగులో “ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు” అనే సామెత ఊరికే పుట్టలేదు. ముఖ్యంగా ఎండలు మండిపోయే ఈ సీజన్ లో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఎండలో బయటకు వెళ్లే వారు.. శరీరంలో వేడితో బాధపడేవారు తమ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను భాగంగా చేసుకోవడం వల్ల వడ దెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. ఇది కేవలం రుచి కోసమే కాకుండా.. బాడీని కూల్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వేసవిలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వేసవిలో పచ్చి ఉల్లిపాయ.. ఆరోగ్య రహస్యాలు:
వేసవి కాలం రాగానే మన ఆహారపు అలవాట్లు మారాలి. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, నీరసం రావడం సాధారణం. ఇలాంటి సమయంలో మన ఇంట్లో సులభంగా దొరికే ఉల్లిపాయ ఒక గొప్ప మెడిసిన్‌లా పనిచేస్తుంది.

Advertisement

1. వడదెబ్బ నుంచి రక్షణ:
వేసవిలో వచ్చే అతిపెద్ద ముప్పు ‘వడదెబ్బ. పచ్చి ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు , క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయ పడతాయి. పూర్వం ఎండలో ప్రయాణించే వారు తమ జేబులో ఒక ఉల్లిపాయను ఉంచుకునేవారు. అది శరీరానికి రక్షణగా ఉంటుందని నమ్మేవారు. పచ్చి ఉల్లిపాయను నేరుగా తినడం వల్ల రక్తప్రసరణ మెరుగు పడి.. వడ దెబ్బ తగలకుండా ఉంటుంది.

2. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో:
పచ్చి ఉల్లిపాయ శరీరానికి సహజసిద్ధమైన చలువను ఇస్తుంది. మధ్యాహ్నం భోజనంతో పాటు పెరుగులో ఉల్లిపాయ ముక్కలు కలిపి ‘రైతా’ రూపంలో లేదా సలాడ్ రూపంలో తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇది చెమట ద్వారా మలినాలను బయటకు పంపడమే కాకుండా.. చర్మం పొడి బారకుండా కాపాడుతుంది.

Advertisement

3. జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
వేసవిలో ఆహారం సరిగ్గా అరగకపోవడం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఉల్లిపాయలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను శుభ్ర పరుస్తుంది. ఇది పేగులలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహద పడుతుంది. దీని వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగి, ఆకలి పెరుగుతుంది.

4. రోగనిరోధక శక్తి పెంపు :
ఉల్లిపాయలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఎండల వల్ల వచ్చే అలసటను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలకం. ఇందులో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి. ముఖ్యంగా గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలను నివారించడంలో ఇది సహాయ పడుతుంది.

5. గుండె ఆరోగ్యానికి, మధుమేహానికి మేలు:
పచ్చి ఉల్లిపాయ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడుతుంది. ఇది రక్త పోటును నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. అలాగే.. ఉల్లిపాయలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.

Also Read: ఎండతో ఇక నో ఫైట్! ఈ సన్‌స్క్రీన్ హ్యాక్స్‌తో మీ స్కిన్ సూపర్ సేఫ్!

ఎలా తీసుకోవాలి?
సలాడ్: భోజనం చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలపై కొంచెం నిమ్మరసం, ఉప్పు చల్లుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యం లభిస్తుంది.

మజ్జిగ: పల్చటి మజ్జిగలో చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి తాగితే వడదెబ్బ తగలదు.

పెరుగు పచ్చడి: పెరుగులో ఉల్లిపాయలు కలిపి తీసుకోవడం వల్ల బాడీ కూల్‌గా ఉంటుంది.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×