E-Paper
Advertisement

తెల్ల బట్టలు పాతబడ్డాయని పారేస్తున్నారా? రూపాయి ఖర్చు లేకుండా మళ్లీ కొత్తవాటిలా మెరిపించండిలా!

తెల్ల బట్టలు పాతబడ్డాయని పారేస్తున్నారా? రూపాయి ఖర్చు లేకుండా మళ్లీ కొత్తవాటిలా మెరిపించండిలా!
Advertisement

Laundry Tips: సాధారణంగా సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే.. చాలామంది తెల్ల బట్టలు వేసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వాటిని మెయింటైన్ చేయడమే పెద్ద తలనొప్పి. తెల్లని షర్టులు గానీ, కుర్తాలు గానీ ఒక్కరోజులో పాడైపోవు. ఉతికిన ప్రతిసారీ కొంచెం కొంచెంగా ఆ తెలుపు తగ్గిపోతూ ఉంటుంది. సడెన్‌గా ఒకరోజు.. అప్పటిదాకా తళతళలాడిన బట్ట కాస్త పాతబడినట్టు, వెలిసిపోయినట్టు కనిపిస్తుంది. నిజానికి ఇక్కడ బట్ట పాడవ్వదు. మనం వాడే డిటర్జెంట్, ఒంటి జిడ్డు, నీళ్లలోని గార ఆ బట్ట పోగుల్లో చేరిపోవడం వల్లే అలా జరుగుతుంది. దీనికోసం గట్టిగా బ్లీచ్ వాడేయడం కంటే.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే మళ్లీ ఆ కొత్త మెరుపును తీసుకురావచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

వంట సోడాతో మురికికి చెక్:

తెల్ల బట్టలు కాస్త డల్‌గా కనిపిస్తున్నప్పుడు ఇంట్లో ఉండే వంట సోడా (బేకింగ్ సోడా) బాగా పనిచేస్తుంది. ఇది బట్ట లోపల దాక్కున్న మురికిని ఇట్టే పోగొడుతుంది. దాని కోసం బట్టలు ఉతికేటప్పుడు ఒక అరకప్పు సోడా కలిపితే చాలు. అయితే బట్టలు మరీ పాతవిలా కనిపిస్తుంటే మాత్రం.. కాసేపు గోరువెచ్చని నీటిలో సోడా వేసి నానబెట్టండి. ఆ తర్వాత మామూలుగా ఉతికేస్తే ఆ మురికి వదిలి కొత్త కళ వస్తుంది.

వైట్ వెనిగర్‌తో కొత్త మెరుపు:

Advertisement

కొన్ని తెల్ల బట్టలు ఉతకగా ఉతకగా తెల్లగా కాకుండా బూడిద రంగులోకి వచ్చేస్తుంటాయి. దీనికి కారణం మనం వాడే సోపు లేదా డిటర్జెంట్ సరిగ్గా వదలక బట్టలోనే ఉండిపోవడం. దీన్ని వదిలించడానికి వైట్ వినేగర్ బాగా పనికొస్తుంది. బట్టలు ఉతికేసిన తర్వాత చివరగా నీళ్లలో జాడిస్తాం కదా, అప్పుడు కొంచెం వినేగర్ వేస్తే సరి. ఇది బట్టలను మెత్తగా చేయడమే కాదు.. ఆ పాత రంగును వదిలించి కాంతిని ఇస్తుంది. అయితే వినేగర్‌ను డైరెక్ట్‌గా డిటర్జెంట్‌తో కలపకూడదు.

Also Read: ఇలాంటి డీల్‌‌ను ఎప్పుడూ చూసుండరు.. రూ.30 వేలకే iPad, సగం ధరకే iPhone 17, ఆఫర్ కొద్ది రోజులే!

పసుపు మరకలు పోవట్లేదా?

Advertisement

చెమట వల్ల తెల్ల బట్టలు ముఖ్యంగా కాలర్లు, చంకల భాగంలో పసుపుగా మారుతుంటాయి. దీనికి నిమ్మరసం బెస్ట్ సొల్యూషన్. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి బట్టలను కాసేపు నానబెట్టాలి. ఉతికిన తర్వాత వాటిని ఎండలో ఆరబెడితే సూర్యరశ్మి ఆ రంగును ప్రకాశవంతంగా మారుస్తుంది. ఎండలో ఆరబెట్టడం అనేది మన అమ్మమ్మల కాలంనాటి పద్ధతే అయినా.. తెల్ల బట్టల మెరుపుకు దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు.

జిడ్డు మరకలు మటుమాయం:

కొన్నిసార్లు కాలర్ల దగ్గర జిడ్డు మరకలు అస్సలు వదలవు. అలాంటప్పుడు ఇంట్లో ఉండే డిష్ వాష్ లిక్విడ్ వాడొచ్చు. ఆ నూనె లేదా జిడ్డు మరక మీద ఒక చుక్క వేసి మెల్లగా రుద్ది ఉతికితే జిడ్డు ఇట్టే వదిలిపోతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. తెల్ల బట్టలను ఎప్పుడూ రంగు బట్టలతో కలిపి ఉతకకూడదు. వేరే బట్టల రంగులు కొంచెం అంటుకున్నా తెల్ల బట్టలు త్వరగా పాడైపోతాయి.

ఎంత సర్ఫ్ వాడుతున్నారు?

చాలామంది కామన్‌గా చేసే తప్పేంటంటే.. ఎక్కువ సర్ఫ్ వాడితే బట్టలు బాగా తెల్లగా అవుతాయని అనుకోవడం. కానీ నిజానికి ఎక్కువ డిటర్జెంట్ వాడితే అది బట్టల్లో పేరుకుపోయి మురికిని త్వరగా ఆకర్షిస్తుంది. అందుకే అవసరమైనంతే వాడండి. అలాగే చెమట పట్టిన బట్టలను ఎక్కువ రోజులు అలానే ఉంచకుండా వెంటనే ఉతికేయడం మంచిది. తెల్ల బట్టలను ఎంత సున్నితంగా చూసుకుంటే అవి అంత ఎక్కువ కాలం కొత్త వాటిలా కనిపిస్తాయి.

Also Read: యాపిల్ లవర్స్ ఎగిరి గంతేసే ఛాన్స్.. iPhone 16పై ఏకంగా రూ.21,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు ఇవిగో!

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×