Croma Apple Sale 2026: సాధారణంగా యాపిల్ నుంచి వచ్చిన ఏ గ్యాడ్జట్ అయినా రేటు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే.. ఆ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే, మిడిల్‌క్లాస్ యువతకు ఐఫోన్స్ అయినా ఐప్యాడ్స్ అయినా కొనుగోలు చేయడం అంటే ఆర్థిక భారం అనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి వారి కోసమే ఒక గుడ్ న్యూస్.
ప్రముఖ రిటైల్ సంస్థ క్రోమా తమ సెకండ్ ఫేజ్ Everything Apple సేల్‌ను మొదలుపెట్టింది. మే 16 వరకు ఉండే ఈ సేల్‌లో యాపిల్ ప్రొడక్టులపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. నేరుగా ఇచ్చే డిస్కౌంట్లు మాత్రమే కాకుండా.. పాత ఫోన్ల ఎక్స్ఛేంజ్ మీద బోనస్, బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, టాటా నియో కాయిన్స్ వంటి ప్రయోజనాలతో ధరలు భారీగా తగ్గాయి. ఆ వివరాల్లోకి వెళితే..
ఈ సేల్‌లో అందరినీ ఊరిస్తున్న డీల్ ఐప్యాడ్ 11. మామూలుగా బయట దీని ధర సుమారు రూ.34,900 ఉంది. కానీ ఇప్పుడు క్రోమా ఇస్తున్న స్పెషల్ కూపన్లు, టాటా నియో సేవింగ్స్ అన్నీ వాడితే.. కేవలం రూ.29,489కే లభిస్తోంది. కాలేజీ స్టూడెంట్స్‌కి, ఉద్యోగస్తులకు మంచి ట్యాబ్లెట్ కావాలనుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Also Read: యాపిల్ లవర్స్ ఎగిరి గంతేసే ఛాన్స్.. iPhone 16పై ఏకంగా రూ.21,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు ఇవిగో!
ఈ సేల్‌లో ఐప్యాడ్ మాత్రమే కాదు.. ఐఫోన్ 17 మీద కూడా క్రోమా కత్తిలాంటి ఆఫర్ ఇచ్చింది. రూ.82,900 ఉన్న ఈ ఫోన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఇతర బోనస్‌లు కలుపుకుంటే రూ.44,768 ప్రారంభ ధరకే వచ్చేస్తోంది. ఇక మ్యాక్‌బుక్ విషయానికి వస్తే.. మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం5 మీద స్టూడెంట్స్, టీచర్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్ ఉంది. రూ.1,20,000 రేటున్న ఈ ల్యాప్‌టాప్ అన్ని ఆఫర్లు పోను కేవలం రూ.74,619కే లభిస్తోంది.
కేవలం ఇవే కాకుండా iPad Air M4 రూ.55,490కి, AirPods Pro 3 రూ.22,491కి అందుబాటులో ఉన్నాయి. అలాగే Apple Watch SE 3ను
రూ.23,388కే సొంతం చేసుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్స్‌ను హెచ్‌డిఎఫ్‌సి టాటా నియో కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. ఇంకో 10 శాతం ఎక్స్‌ట్రా సేవింగ్స్ కూడా వస్తాయి. ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది కాబట్టి.. బడ్జెట్ ఇబ్బంది లేకుండా నచ్చిన యాపిల్ ప్రొడక్ట్‌ను ఇప్పుడే కొనేయొచ్చు.