E-Paper
Advertisement

యాపిల్ లవర్స్ ఎగిరి గంతేసే ఛాన్స్.. iPhone 16పై ఏకంగా రూ.21,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు ఇవిగో!

యాపిల్ లవర్స్ ఎగిరి గంతేసే ఛాన్స్.. iPhone 16పై ఏకంగా రూ.21,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు ఇవిగో!
Advertisement

Flipkart SASA LELE Sale: యాపిల్ బ్రాండ్లకు యువతలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యాపిల్ నుంచి వచ్చిన iPhone 16 అమ్మకాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతటి రికార్డ్ బ్రేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. అలాంటి ఈ సూపర్ డూపర్ ఫోన్‌మీ ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న SASA LELE సేల్‌లో దిమ్మతిరిగే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.. ఇప్పుడే దీనిని బుక్ చేసుకోవాలనిపించేలా ఉన్నాయి. ఈ సేల్ వివరాలు తెలియాలంటే కథనంలోకి వెళ్లిపోదాం రండి..

రూ.21వేలు తగ్గింపు:

నిజానికి iPhone 16 మొదట లాంచ్ అయినప్పుడు దాని ధర దాదాపు రూ.79,900 వరకు ఉండేది. కానీ ఇప్పుడు iPhone 17 రాకతో రేటు తగ్గింది. దీనికి తోడు ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అన్నీ కలిపితే ఈ ఫోన్ కేవలం రూ.58,900కే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే.. లాంచ్ ప్రైస్ మీద సుమారు రూ.21,000 వరకు మిగుల్చుకోవచ్చన్నమాట.

ఎంతోమంది డ్రీమ్ ఈ ఫోన్:

Advertisement

ఈ ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా లైట్ వెయిట్‌గా, చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీని 6.1 ఇంచ్ డిస్‌ప్లే క్వాలిటీ అయితే మామూలుగా ఉండదు. కలర్స్ అన్నీ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. బయట ఎండలోకి వెళ్లినా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. పైగా వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి.. చిన్నపాటి వర్షంలో తడిచినా ఈ ఫోన్‌కు ఏమీకాదు.

Also Read: ఐఫోన్, శాంసంగ్ బ్యాటరీలకు బాబు లాంటి ఫోన్.. Huawei Nova 15 Max లాంచ్, ఇక చూసుకో రచ్చ రచ్చే!

పనితీరు ఎలా ఉందంటే?

Advertisement

ఐఫోన్‌లో పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిలో వాడిన ఏ18 చిప్‌సెట్ వల్ల ఫోన్ ఎంత వాడినా అస్సలు స్లో అవ్వదు. ఎంత పెద్ద గేమ్స్ ఆడినా, ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అలాగే దీనిలో 8GB RAM ఉంది కాబట్టి.. మల్టీ టాస్కింగ్‌కి తిరుగుండదు. ఇంకా రాబోయే కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్నీ ఈ ఫోన్‌కు వస్తూనే ఉంటాయి.

ఫొటోల క్లారిటీ వేరే లెవల్:

ఇకపోతు iPhone 16 కెమెరా విషయానికొస్తే.. వెనకాల 48MP మెయిన్ కెమెరా ఉంది. దీంతో పగలు గానీ, రాత్రి పూట గానీ ఫొటోలు చాలా క్లారిటీగా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం ఉన్న 12MP కెమెరా ఇన్ స్టాగ్రామ్ రీల్స్, వీడియో కాల్స్ కోసం పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఫొటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకు ఐఫోన్ ఎప్పుడూ బెస్ట్ ఛాయిసే కదా.

ఇతర ఆఫర్ల వివరాలు:

iPhone 16 బ్యాటరీ లైఫ్ కూడా ఆ రోజంతా హాయిగా వచ్చేలా డిజైన్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్క ఐఫోన్ 16 మాత్రమే కాదు.. ఈ సేల్‌లో ఐఫోన్ 17 సిరీస్ మీద కూడా మంచి ఆఫర్లు ఉండబోతున్నాయి. మొత్తానికి తక్కువ రేటులో ఐఫోన్ కొనాలనుకుంటున్న వాళ్లకు ఇది నిజంగానే గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

Also Read: అమెజాన్‌లో పిచ్చెక్కించే సేల్.. శాంసంగ్ టాప్ ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్, స్టాక్ అయిపోయేలోపే పట్టేయండి!

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×