E-Paper
Advertisement

Homemade Hair Colour: ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ తయారు చేసుకుని వాడితే.. తెల్ల జుట్టు క్షణాల్లోనే మాయం

Homemade Hair Colour: ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ తయారు చేసుకుని వాడితే.. తెల్ల జుట్టు క్షణాల్లోనే మాయం
Advertisement

Homemade Hair Colour: ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగు మారిన జుట్టుతో అవస్థలు పడుతున్నారు. అయితే కొంత మంది తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి బయట మార్కెట్ లో దొరికే హెయిర్ కలర్స్‌తో పాటు షాంపూలను కూడా వాడుతుంటారు.

ఇవి తాత్కాలికంగా జుట్టును నల్లగా మార్చడంలో ఉపయోగపడతాయి. కానీ రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కలర్స్ వాడటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. వీటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో మనం నేచురల్ హెయిర్ కలర్ తయారు చేసుకుని వాడవచ్చు.

Advertisement

మీరు మీ జుట్టుకు ఎలాంటి హాని లేకుండా నల్లగా మారాలంటే ఇంట్లోనే ఈ ప్రత్యేకమైన హెయిర్ కలర్ తయారు చేసుకోండి. జుట్టు మూలాల నుండి తెల్లగా కనిపించినట్లయితే, ఈ హోమ్ మేడ్ హెయిర్ కలర్ అప్లై చేయండి. ఇది రసాయనాలు లేకుండానే జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడటమే కాకుండా జుట్టును సిల్కీగా, మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది.

ఇది జుట్టును నల్లగా మార్చడం ద్వారా తెల్ల జుట్టును దాచడంలో సహాయపడటమే కాకుండా జుట్టును సిల్కీగా, మృదువుగా, బలంగా చేస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి జుట్టు నల్లగా మారడానికి ఇంట్లోనే హెయిర్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Advertisement

హెయిర్ కలర్ తయారీ:

కావలసినవి:

పసుపు- 1 టీస్పూన్

నీలిమందు పొడి ( ఇండిగో పౌడ్ )- 6 టీ స్పూన్లు

పెరుగు- 1- 3 స్పూన్లు

మెంతి పొడి- 3 టీ స్పూన్లు

కాఫీ పౌడర్- 1 టేబుల్ స్పూన్

అలోవెరా జెల్- 1 టీ స్పూన్

తయారీ విధానం:

ఇంట్లోనే హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి ?

ముందుగా నానబెట్టిన మెంతి గింజల పౌడర్‌లో పెరుగు, కలబంద జెల్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి.

-ఇప్పుడు గ్యాస్ పై పాన్ పెట్టి అందులో పసునుతో పాటు ఇండిగో పౌడర్ వేసి పూర్తిగా నల్లబడే వరకు వేయించాలి. ఈ నల్లగా మారిన పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

-ఇప్పుడు సిద్ధం చేసుకున్న పెరుగు, అలోవెరా జెల్, మెంతి పేస్ట్‌లో తయారు చేసుకున్న నల్లటి పొడిని వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోనే ఒక చెంచా కాఫీ పొడిని కూడా కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి.

Also Read: ఎంతటి తెల్లజుట్టు అయినా.. ఇలా చేస్తే క్షణాల్లోనే నల్లగా మారడం ఖాయం

-వెంట్రుకల మూలాల నుంచి తల మొత్తం ఎక్కడెక్కడ తెల్ల జుట్టు ఉందో అక్కడ ఈ కలర్‌ను అప్లై చేయండి.

– హెయిర్ కలర్ అప్లై చేసిన దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత జుట్టును మీరు వాడే షాంపూతో వాష్ చేసుకోండి.

-ఈ హెయిర్ కలర్ వాడటం వల్ల రసాయనాలు లేకుండా జుట్టు అంతా సులభంగా నల్లగా మారుతుంది. దీంతో పాటు, జుట్టు మృదువుగా, షైనీగా తయారవుతుంది.

Related News

మాత్రను నోట్లో వేసుకుని నీళ్లు తాగాలా? లేదా నీళ్లతోపాటు మాత్ర వేసుకోవాలా? ఏది డేంజర్?

ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య రంధ్రం.. డిజైన్ కోసం కాదా? కారణం తెలిస్తే పక్కా షాకవుతారు!

అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. రూ.46 లక్షల సాలరీ.. అన్నీ వదిలి ఇండియన్ ఆర్మీలోకి

బిడ్డకు ఆకలి వేసిందో లేదో ఎలా తెలుసుకోవాలి? తల్లిదండ్రులకు రెస్పాన్సివ్ ఫీడింగ్ గైడ్

మనసంతా ప్రేమ.. ఈ తేదీల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే మీరు చాలా లక్కీ

పండుగ వేళ అందరిలో స్పెషల్‌గా కనిపించాలా? ఈ 5 మేకప్ లుక్స్ ట్రై చేయండి

డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు చెల్లించాలి? 2026లో కొత్త ట్రెండ్ గురూ

పిల్లలు ఇంటి గోడలపై డ్రాయింగ్ వేస్తూ పాడు చేశారా? నో టెన్షన్ క్రేయాన్ మరకలు క్లీన్ చేసే సింపుల్ ట్రిక్స్ ఇవిగో

Big Stories

Advertisement
×