telugu titans vs puneri paltan: ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్ (పీకేఎల్) సీజన్ – 11 లో తెలుగు టైటాన్స్ జట్టుకి ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. లీగ్ దశను తెలుగు టైటాన్స్ విజయంతో ముగించింది. శుక్రవారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ భారీ విజయాన్ని సాధించి ప్లే ఆఫ్ కి వెళ్ళే అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. తెలుగు టైటాన్స్ 48 – 36 తో పుణేరి పల్టన్ పై విజయం సాధించింది. జట్టును కెప్టెన్, రైడర్ పవన్ సెహ్రవత్ ముందుండి నడిపించాడు. 16 సార్లు రైడింగ్ కి వెళ్ళి 11సార్లు విజయవంతంగా పాయింట్స్ ని తీసుకొచ్చాడు.
Also Read: Zaheer Khan – Sushila Meena: లేడీ జహీర్ ఖాన్ బౌలింగ్ చూశారా..ఇదిగో వీడియో !
నాలుగు బోనస్ పాయింట్లు కలుపుకొని మొత్తం 15 పాయింట్లు సాధించాడు. ఇక స్టార్ రైడర్ ఆశిష్ నర్వాల్ (11), అంకిత్ (6) పాయింట్లతో సత్తా చాటి తెలుగు టైటాన్స్ కి భారీ విజయాన్ని అందించారు. పునేరి పల్టాన్ తరపున ఆర్య వర్ధన్ నవలే (8), సబ్స్ ట్యూడ్ గా ఆలస్యంగా మైదానంలోకి దిగిన అజిత్ (10) పాయింట్లతో రాణించినా ఫలితం దక్కలేదు. ఆట ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ ఆధిపత్యం చెలాయించింది. ఫస్ట్ హాఫ్ లో పునేరి పల్టాన్ ను ఆల్ అవుట్ చేసిన తెలుగు టైటాన్స్.. విరామ సమయానికి 25 – 16 తో భారీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక సెకండ్ హాఫ్ లో పుణేరీ పల్టాన్ పుంజుకుంది.
దీంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. సెకండ్ హాఫ్ లో రెండు జట్లు చరోసారి ఆల్ అవుట్ అయ్యాయి. ఇక చివరి వరకు తన ఆదిత్యాన్ని కాపాడుకున్న తెలుగు టైటాన్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది. పుణేరి పల్టాన్ పై విజయం సాధించడంతో తెలుగు టైటాన్స్ పాయింట్స్ టేబుల్ లో ఏడవ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు మొత్తం 22 మ్యాచ్ లు ఆడిన తెలుగు టైటాన్స్ ఈ గెలుపుతో 12 విజయాలు, 10 ఓటములు నమోదు చేసింది. ఇక ఆరవ స్థానంలో ఉన్న ముంబై జట్టు 20 మ్యాచ్ లు ఆడితే 11 విజయాలు, ఏడు ఓటములు, రెండు టై లతో తెలుగు టైటాన్స్ కంటే ఓ స్థానం ముందంజలో ఉంది.
Also Read: Mohammed Rizwan Haris Rauf: SRH ప్లేయర్ ను కెలికిన పాక్ క్రికెటర్లు.. మ్యాచ్ మధ్యలో గొడవ
ముంబై జట్టు తన చివరి రెండు మ్యాచ్ల్ లలో భారీ తేడాతో ఓడిపోతే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ కి చేరుకుంటుంది. ఈ అద్భుతం జరిగితే తప్ప తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ కి చేరదు. ఇక అంతకు ముందు జరిగిన తొలి మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ 31 – 28 తో బెంగాల్ వారియర్స్ పై గెలుపొంది ప్లే ఆఫ్స్ కు ఐదవ జట్టుగా అర్హత సాధించింది. జైపూర్ గెలుపులో అర్జున్ దేశ్వాల్ (9) పాయింట్లతో గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం టేబుల్ టాపర్ గా హర్యానా స్టీలర్స్, రన్నరప్ గా పాట్నా పైరేట్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ని దక్కించుకున్నాయి. ఇక యూపీ, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ 4, 5 స్థానాలలో నిలిచి ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించాయి. ఆరవ స్థానం కోసం యూ ముంబా, తెలుగు టైటాన్స్ పోటీ పడుతున్నాయి