Tips For Black Hair: జుట్టు అందంగా, నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత జీవన విధానంతో పాటు అనారోగ్య కారణాల వల్ల చాలా మంది చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యతో పాటు జుట్టు రాలడాన్ని ఎదుర్కుంటున్నారు. ఇలాంటి సమయంలోనే చాలా మంది ప్రజలు అనేక జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ జుట్టు నల్లగా మారడం కోసం మెంతులు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మెంతుల్లో అధిక మెత్తంలో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్ ఎ, సి, కె, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా వాటి పెరుగుదలకు సహాయపడతాయి. ఇందులో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు, మెంతికూరలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు, తలలో ఉండే దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి.మరి నల్లటి, అందమైన జుట్టు కోసం మెంతులను ఎలా ఉపయోగించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులతో బ్లాక్ హెయిర్:
మెంతి గింజలను సరిపడా తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని స్కాల్ప్ ,హెయిర్‌పై బాగా అప్లై చేసి 30-45 నిమిషాల పాటు అలాగే ఉంచండి. దీని తర్వాత సాధారణ నీటితో జుట్టును వాష్ చేసుకోండి. ఇది జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. అంతే కాకుండా మూలాల నుండి చివర్ల వరకు బలంగా, మెరిసేలా చేస్తుంది.
మెంతులు, పెరుగు:
దీనిని తయారు చేయడానికి, మెంతి గింజలను పెరుగులో రాత్రంతా నానబెట్టి, ఉదయం దానిని గ్రైండ్ చేసి చిక్కటి పేస్ట్‌గా చేయాలి. దీన్ని జుట్టు మూలాలపై అప్లై చేసి 20-30 నిమిషాల తర్వాత కడిగేయాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ,మెంతి యొక్క లక్షణాలు జుట్టుకు పూర్తి పోషణను అందిస్తాయి. అంతే కాకుండా వాటిని కండిషన్ చేస్తాయి. జుట్టుకు సహజమైన మెరుపును కూడా అందిస్తాయి.
మెంతులు, కొబ్బరి నూనె:
గోరు వెచ్చగా వేడిచేసిన కొబ్బరి నూనెలో మెంతులు వేసి, 5-10 నిమిషాలు ఉడికించి, చల్లారనివ్వండి. ఈ నూనెతో తలకు సున్నితంగా మసాజ్ చేయండి. ఇది జుట్టు మూలాలకు పోషణనిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
మెంతులు, అలోవెరా జెల్:
అలోవెరా జెల్‌లో మెత్తగా రుబ్బిన మెంతి పొడిని కలిపి పది నిమిషాల తర్వాత తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోండి. ఈ పేస్ట్ స్కాల్ప్‌లో తేమను కాపాడుతుంది. అంతే కాకుండా మంట లేదా దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
Also Read: ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ తయారు చేసుకుని వాడితే.. తెల్ల జుట్టు క్షణాల్లోనే మాయం
మెంతులు, ఉల్లిపాయలు:
మెంతి గింజలను నీటిలో ఉడకబెట్టి, అది సగానికి తగ్గిన తర్వాత చల్లబరచండి. ఈ నీటిలో ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి, దానితో మీ జుట్టును వాష్ చేయడం వల్ల జుట్టుకు మెరుపు రావడమే కాకుండా జుట్టుకు బలం కూడా పెరుగుతుంది.