E-Paper
Advertisement

Brinjal: వంకాయ తినకపోతే మీరెంత నష్టపోతున్నట్టో తెలుసా?

Brinjal: వంకాయ తినకపోతే మీరెంత నష్టపోతున్నట్టో తెలుసా?
Advertisement

మన రోజువారీ వంటలో ఎక్కువగా వాడే కూరల్లో వంకాయ ఒకటి. వంకాయలో ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమైన పోషకాలు ఉన్నాయి. చాలా మందికి వంకాయ కూరంటేనే నచ్చదు. దాన్ని తినేందుకు ఏమాత్రం ఇష్టపడరు. వంకాయ పేరు చెబితేనే ముఖం మాడ్చుకుంటారు. నిజానికి వంకాయ తినకపోతే మీరెంతో నష్టపోతున్నట్టు. వంకాయ తినడం మన శరీరానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి.

రక్తహీనత తగ్గుతుంది
వంకాయలో ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి రక్తాన్ని పెంచడంలో సహాయపడతాయి. రక్తహీనత వల్ల వచ్చే బలహీనత, అలసట తగ్గడానికి ఇది మంచిది. ప్రత్యేకంగా మహిళలు, టీనేజ్ అమ్మాయిలు వంకాయను వంటలో చేర్చుకుంటే వారికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

గుండె ఆరోగ్యానికి
వంకాయలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. దీంతో గుండెపోటు, బీపీ, స్ట్రోక్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే వంకాయ గుండెను రక్షించే హెల్తీ కూరగాయ.

షుగర్ ఉన్నవాళ్లకూ సేఫ్
వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు త్వరగా పెరగవు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో డయాబెటిస్ ఉన్నవారు కూడా నిశ్చింతగా తినొచ్చు. ఇది రక్తంలో షుగర్‌ను నెమ్మదిగా విడుదల చేస్తుంది.

Advertisement

మెదడుకు ఎంతో మేలు
వంకాయ తొక్కలో ఉండే నాసునిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు కణాలను రక్షిస్తుంది. మెదడులో వచ్చే దెబ్బతినే సమస్యలను తగ్గిస్తుంది. ఏకాగ్రత పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వంకాయ తినడం చాలా ముఖ్యం.

జీర్ణక్రియ కోసం
వంకాయ ఫైబర్‌తో నిండి ఉంటుంది. అందువల్ల ఇది తేలికగా జీర్ణమవుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు ఇది సహాయపడుతుంది. వంకాయతో చేసిన కూర పేగులను శుభ్రపరచి హానికర పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
వంకాయలో ఎక్కువగా నీరు ఉంటుంది. కాలరీలు చాలా తక్కువ. ఫైబర్ ఎక్కువ. దీంతో దీన్ని తింటే ఎక్కువసేపు ఆకలి పట్టదు. మధ్యలో పదే పదే తినాలనే భావం తగ్గుతుంది. అందుకే డైట్‌లో ఉండేవారు వంకాయ కూరను తప్పకుండా తినాలి. వంకాయలో ఉన్న విటమిన్ C, K, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తేమను అందిస్తాయి. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. జుట్టు వేర్లు బలపడటానికి కూడా ఇవి సహాయపడతాయి. జుట్టు రాలడం కొంతవరకు తగ్గే అవకాశం కూడా ఉంది.

వంకాయలో మ్యాగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. వయసు ఎక్కువవుతున్న వారికి వంకాయ మంచి కూరగా చెప్పవచ్చు. ఇది ఎముకల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. వంకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. దీంతో కాలేయంపై ఒత్తిడి తగ్గి, లివర్ పనితీరు మెరుగుపడుతుంది. ఇది సహజంగా శరీర డిటాక్సిఫికేషన్‌కు ఉపకరిస్తుంది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×