E-Paper
Advertisement

HBD Anil Ravipudi: డైరెక్టర్ కాదు డాక్టర్, అందుకే మరో రాజమౌళి అయ్యాడు!

HBD Anil Ravipudi: డైరెక్టర్ కాదు డాక్టర్, అందుకే మరో రాజమౌళి అయ్యాడు!
Advertisement

HBD Anil Ravipudi: ఒక సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది చాలామంది దర్శకుల చేతుల్లో ఉండదు. ఏ సినిమా ఎప్పుడు ఎటువంటి విజయం సాధిస్తుందో ఎవరు ఊహకు అందదు. అందుకే సూపర్ హిట్ సినిమా తీసిన దర్శకులు కూడా కొన్ని సందర్భాలలో డిజాస్టర్ సినిమాలు తీస్తూ ఉంటారు. కొంతమంది విపరీతమైన తెలివితేటలు ఉన్న దర్శకులు ఏవే కొత్త ప్రయత్నాలు చేసే ప్రాసెస్ లో డిజాస్టర్లు తీస్తుంటారు.

డైరెక్టర్ కాదు డాక్టర్

అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతారు. ముందుగా సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన దర్శకులు ప్రస్తావన వస్తే మొదటి వినిపించే పేరు ఎస్.ఎస్ రాజమౌళి. ఆ తరువాత ఈ కాలంలో 100 శాతం సక్సెస్ ఉన్న మరో డైరెక్టర్‌ అనిల్ రావిపూడి. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం నుంచి ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్టే. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దుమ్ముదులిపాయి. తాను చివరగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. చాలామంది ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ఆడియన్స్ యొక్క పల్స్ తెలియాలి అంటారు.

స్టార్ హీరోస్ తో సైతం

Advertisement

కొంతమంది ఆ పల్స్ తెలియడానికి మేమేమైనా డాక్టర్స్ మా అని కామెంట్స్ చేస్తారు. కానీ అనిల్ రావిపూడి విషయానికి వస్తే నిజంగా డాక్టర్ ఏమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఒక కథలో మెసేజ్ చెబుతూ కూడా ఆడియన్స్ ని ఎక్కడ నవ్వించాలో ఎలా ఎంటర్టైన్‌ చేయాలనే కంప్లీట్ క్లారిటీ ఉన్న దర్శకుడు అనిల్. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద అనిల్ సినిమాలు బాగా స్కోర్ చేస్తాయి. రచయితగా కెరియర్ మొదలుపెట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత కాలంలో దర్శకుడుగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన పటాస్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా తర్వాత ఇప్పటివరకు వెనుక తిరిగి చూడలేదు అనిల్.

చిరంజీవి సినిమాతో బిజీ

చాలామంది దర్శకులకు వాళ్ళ అభిమాన హీరోతో సినిమా చేయాలి అనే కోరిక ఉంటుంది. అయితే ఆ కోరిక కొందరు జీవితాల్లో మాత్రమే నెరవేరుతుంది. అనిల్ రావిపూడి విషయానికి వస్తే సీనియర్ సూపర్ స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసేసారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అంటే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ పేర్లు ఖచ్చితంగా వినిపిస్తాయి. వెంకటేష్ తో ఏకంగా మూడు సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. బాలకృష్ణతో సినిమా చేసి అవార్డులు పొందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తూ బాక్సాఫీస్ వద్ద కొత్త కలెక్షన్స్ కు దారి చూపించమన్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. నేడు అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా మన శంకర్ వరప్రసాద్ చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన వీడియోను అనిల్ కు బర్త్డే విషెస్ చెబుతూ విడుదల చేశారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×