E-Paper
Advertisement

Tooth brushing: మార్నింగ్ బ్రష్ చేయడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? ఈ ‘రెండు నిమిషాల’ మ్యాజిక్ గురించి తెలుసా?

Tooth brushing: మార్నింగ్ బ్రష్ చేయడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? ఈ ‘రెండు నిమిషాల’ మ్యాజిక్ గురించి తెలుసా?
Advertisement

Tooth brushing: మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి పని బ్రష్ చేసుకోవడం. అయితే, బ్రష్ చేసే సమయంలో మన ఆలోచనలన్నీ ఆఫీసు పని మీదనో లేదా ఇంటి పనుల మీదనో ఉంటాయి. శ్రద్ధతో బ్రష్ చేయకుండా.. కేవలం 30 సెకన్ల నుండి నిమిషంలోనే బ్రష్ చేయడం ముగించేస్తుంటాం. ఇలా పళ్లు తోమడానికి తక్కువ సమయం కేటాయించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో బ్రష్ ఎంత సేపు చేయాలి? ఎలా చేయాలి? వంటి విషయాలు తెలుసుకుందాం.

ఆ రెండు నిమిషాల మ్యాజిక్..

డెంటిస్ట్‌ల ప్రకారం.. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 2 నిమిషాల పాటు బ్రష్ చేయడం తప్పనిసరి. మన నోటిలో పై భాగం, కింద భాగం, లోపలి వైపు, దంతాల మధ్య భాగాలను సరిగ్గా శుభ్రం చేయడానికి ఈ రెండు నిమిషాల సమయం ఖచ్చితంగా అవసరం. వన్ మినిట్‌లో బ్రష్ చేయడం వల్ల పళ్లపై ఉండే పాచి పూర్తిగా తొలగిపోదని చెబుతున్నారు వైద్యులు.

Advertisement

Also Read: గుడ్డు తెల్లసొనను ఇలా వాడితే 40లోనూ యవ్వనమైన మెరుపు గ్యారెంటీ.. మీరూ ట్రై చేస్తారా మరి?

అదే పనిగా రుద్దొద్దు..

బ్రష్ చేయమన్నారు కదా అని.. కొంతమంది పళ్లు తెల్లగా మెరవాలని 10 నిమిషాల పాటు గట్టిగా రుద్దుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. అతిగా లేదా గట్టిగా బ్రష్ చేయడం వల్ల పంటిపై ఉండే రక్షణ కవచం ఎనామిల్ అరిగిపోతుంది. దీంతో పళ్లు జివ్వుమని లాగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి.. బ్రషింగ్‌కు 2 నుంచి 3 నిమిషాల సమయం సరిపోతుంది.

బ్రష్ చేసే విధానం ఇది..

Advertisement

బ్రష్ చేసేటప్పుడు కేవలం అటు ఇటు రుద్దడమే కాకుండా.. బ్రష్‌ను 45 డిగ్రీల కోణంలో ఉంచి గుండ్రంగా తిప్పాలి. పళ్ల మధ్యలో చిక్కుకున్న ఆహార పదార్థాలను తొలగించేలా మెల్లగా రుద్దాలి. దీంతోపాటు నాలుకను శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే.. నోటిలోని 80% బ్యాక్టీరియా నాలుకపైనే ఉంటుంది.

దంత సమస్యలు రావు..

‘నోరు బాగుంటే ఊరు బాగుంటుంది’.. అనే సామెత ఉందిగా.. అలాగే నోటి ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ ఆహారాన్నైనా రుచిగా తినగలం. రేపటి నుండి బ్రష్ చేసేటప్పుడు కాస్త ఓపికగా ఆ రెండు నిమిషాల సమయాన్ని మీ పళ్ల కోసం కేటాయించండి. ఈ రెండు నిమిషాల పని భవిష్యత్తులో వచ్చే ఎన్నో దంత సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.

Also Read: కోడి లేకుండా గుడ్డు వస్తుందా? వెజ్ అని వాదించే వారి లాజిక్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

 

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×