E-Paper
Advertisement

Egg Facts: కోడి లేకుండా గుడ్డు వస్తుందా? వెజ్ అని వాదించే వారి లాజిక్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

Egg Facts: కోడి లేకుండా గుడ్డు వస్తుందా? వెజ్ అని వాదించే వారి లాజిక్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!
Advertisement

Egg Facts: ఫ్రెండ్స్‌తో కలిసి ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు లేదా పార్టీస్ చేసుకున్నప్పుడు వచ్చే ముఖ్యమైన డిస్కషన్ ఏంటంటే.. ఏంటి బ్రో నువ్వు వెజిటేరియన్ కదా.. మరి గుడ్డు ఎలా తింటున్నావు? అని ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. దానికి సమాధానంగా కొందరు ఇది కోడిపెట్టే గుడ్డు కాబట్టి నాన్‌వెజ్ అని వాదిస్తే, మరికొందరు పాలు జంతువుల నుంచి వచ్చినా వెజ్ అయినప్పుడు.. గుడ్డు ఎందుకు కాదు?’ అని ఎదురుదాడి చేస్తారు. అసలు ఈ గోల ఏంటి? సైన్స్ ఏం చెబుతోంది? మన లోకల్ లాజిక్ ఏం చెబుతుందో ఒకసారి చూసేద్దాం.

సైన్స్ ఏమంటోంది?

మనం తినే గుడ్లు దాదాపు అన్నీ అన్‌ఫెర్టిలైజ్డ్ గుడ్లు. అంటే.. వీటి నుంచి పిల్లలు పుట్టే ఛాన్స్ అస్సలు లేదు. సింపుల్‌గా చెప్పాలంటే, దీనిలో ప్రాణం ఉండదు. అందుకే సైన్స్ పరంగా చూస్తే.. గుడ్డులో మాంసం ఉండదు కాబట్టి, ఇది వెజిటేరియన్ కేటగిరీ కిందకే వస్తుందని చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం. పాలు ఎలాగైతే జంతువుల నుంచి వచ్చినా మనం వెజ్ అంటామో, గుడ్డును కూడా అలానే చూడాలని వారి వాదన.

Advertisement

Also Read: గుడ్డు తెల్లసొనను ఇలా వాడితే 40లోనూ యవ్వనమైన మెరుపు గ్యారెంటీ.. మీరూ ట్రై చేస్తారా మరి?

 మూడు రకాల వాదనలు:

మన చుట్టూ ఇప్పుడు మూడు గ్రూపుల జనం ఉన్నారు. ఒకరు ‘ప్యూర్ వెజిటేరియన్స్’.. వీళ్లు గుడ్డును నాన్‌వెజ్‌గానే భావిస్తారు. రెండో గ్రూపు ‘నాన్‌ వెజిటేరియన్స్’..  వీళ్లకి ఎలాగో అన్నీ ఇష్టమే. కానీ.. మూడో గ్రూపు ఒకటుంది, వాళ్లే ‘ఎగ్గిటేరియన్స్’. వీళ్లు మాంసం ముట్టరు కానీ, గుడ్లు మాత్రం లాగించేస్తారు. వీళ్ల లాజిక్ ఏంటంటే.. గుడ్డు ఒక సంపూర్ణ ఆహారం, బాడీకి ప్రోటీన్ కావాలి కాబట్టి గుడ్డును వెజ్‌ అనుకుని తినేస్తుంటారు.

అసలు విషయం ఇదీ..

Advertisement

నిజానికి ఇది.. ఎవరి నమ్మకం మీద వాళ్లు తీసుకునే నిర్ణయం. ఒకవేళ జీవం లేనిది వెజ్ అని నమ్మితే గుడ్డు వెజ్ కిందే వస్తుంది. లేదు.. జంతువుల నుండి వచ్చేది ఏదైనా నాన్‌వెజ్ అని మీరు భావిస్తే అది నాన్‌వెజ్ అవుతుంది. అయితే, ఈ మధ్యకాలంలో చాలామంది డైటీషియన్లు గుడ్డును వెజ్ లిస్టులో చేర్చడానికే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. అందులో ఉండే పోషకాలు కోసం. మొత్తానికి గుడ్డు వెజ్ అయినా.. నాన్‌వెజ్ అయినా.. ఆరోగ్యానికి మాత్రం ఒక సూపర్ ఫుడ్. కాబట్టి.. కన్ఫ్యూజన్ పక్కన పెట్టి, మీకు నచ్చితే హ్యాపీగా ఆమ్లెట్ వేసేసుకోండి.

Also Read:  73 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్.. కుర్రాళ్లను కళ్లు తిప్పుకోకుండా చేస్తున్న వృద్ధుడి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

 

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×