E-Paper
Advertisement

Everyday Items: టూత్ బ్రష్.. వాటర్ బాటిల్.. పిల్లో.. ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి? లేకపోతే ఏమవుతుంది?

Everyday Items: టూత్ బ్రష్.. వాటర్ బాటిల్.. పిల్లో.. ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి? లేకపోతే ఏమవుతుంది?
Advertisement

Everyday Items: మనం రోజూ ఉపయోగించే కొన్ని వస్తువులు మనకు తెలియకుండానే అనారోగ్యానికి కారణమవుతుంటాయి. ముఖ్యంగా బెడ్ షీట్లు, బాత్ రూమ్‌లో వాడే లూఫాలు(స్కబ్బర్లు) బ్యాక్టీరియాకు నిలయాలుగా మారుతుంటాయి. అలాగే వాటర్ బాటిల్స్, పిల్లోస్‌లో.. చెమట, చనిపోయిన చర్మ కణాలను భారీగా పేరుకుపోయి ఉంటాయి. ఇది కేవలం శుభ్రతకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన చర్మ ఆరోగ్యం, శ్వాసకోశ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

బెడ్‌రూంలో పొంచి ఉన్న ముప్పు:

ప్రతిరోజూ రాత్రి కప్పుకుని నిద్రపోయే బెడ్ షీట్లు మనం అనుకున్నంత శుభ్రంగా ఉండవు. రాత్రి మన శరీరం నుండి సహజంగానే నూనెలు, చెమట, వేల సంఖ్యలో చనిపోయిన చర్మ కణాలు విడుదలౌతాయి. ఇవి బెడ్ షీట్లలో పేరుకుపోయి, కంటికి కనిపించని దుమ్ము పురుగులు, బ్యాక్టీరియా పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటి వల్ల చర్మంపై మొటిమలు రావడం, అలర్జీలు తలెత్తడం, దుర్వాసన వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే కనీసం వారానికి ఒకసారి బెడ్ షీట్లను వేడి నీటితో ఉతకాలంటున్నారు నిపుణులు.

Advertisement

Also Read: విటమిన్ B12 లోపాన్ని గుర్తిండమెలా? ఈ సమస్య తగ్గాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

బాత్రూంలో బ్యాక్టీరియా నిలయాలు:

చాలామంది స్నానం చేసేటప్పుడు శరీరాన్ని రుద్దుకోవడానికి లూఫాలను వాడుతుంటారు. నిజానికి ఇవి బెడ్ షీట్ల కంటే వేగంగా బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తాయి. లూఫాలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు చనిపోయిన చర్మ కణాలను పట్టి ఉంచుతాయి. దీనికి తోడు బాత్ రూమ్‌లో ఉండే తేమ, వేడి వల్ల అక్కడ బ్యాక్టీరియా, బూజు చాలా వేగంగా విస్తరిస్తాయి. ఇలాంటి లూఫాలను వాడటం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు, దురద వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి మూడు నుండి నాలుగు వారాలకు ఒకసారి లూఫాను మార్చడం లేదా క్రమం తప్పకుండా క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

తరచూ మార్చాల్సిన ఇతర వస్తువులు:

Advertisement

ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది. మనం నిరంతరం తాకే వస్తువులలో తేమ చేరినప్పుడు అవి బ్యాక్టీరియాకు ఇల్లుగా మారుతాయని గుర్తించాలి. వీటితో పాటు టూత్ బ్రష్, వాటర్ బాటిల్, పిల్లోస్‌ను కూడా తరచూ మారుస్తుండాలి. ఈ చిన్న చిన్న మార్పుల వల్ల చర్మ సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా, ఇంట్లో కూడా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పినట్లు అవుతుంది.

Also Read: ఈ బ్లడ్ గ్రూప్ అంటే దోమలకు ఎందుకంత ఇష్టం? ఎందుకంత స్పెషల్?

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×