E-Paper
Advertisement

Hair Colour: సెలూన్‌కు వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ వేసుకోండి

Hair Colour: సెలూన్‌కు వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ వేసుకోండి
Advertisement

Hair Colour: చిన్నా పెద్దా తేడా లేకుండా తెల్ల జుట్టుతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. అనేక మంది జుట్టు నల్లగా మారడం కోసం రెగ్యులర్‌గా రంగులు వేస్తుంటారు. ఇలాంటి వారు హెయిర్ సెలూన్‌కి వెళ్లే బదులు ఇంట్లోనే మీ జుట్టుకు సులభంగా రంగులు వేసుకోవచ్చు.

ఈ రోజుల్లో జుట్టుకు రంగు వేయడం సర్వసాధారణమైపోయింది. చాలా మంది జుట్టు రంగు మారడంతో నల్లగా మారేందుకు రకరకాల రంగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం యూత్‌లో కూడా హెయిర్‌ కలరింగ్‌పై ఆసక్తి బాగా పెరిగింది. అందుకోసం తరచుగా హెయిర్ సెలూన్‌లకు కూడా వెళతారు.

Advertisement

సెలూన్లలోహెయిర్ కలర్ వేయడానికి వందల్లో ఖర్చవుతుంది. అది ఒక్కో సారి వేలల్లో కూడా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ఇంట్లో కూడా మీ జుట్టుకు సులభంగా రంగు వేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు రంగు వేయడానికి ముఖ్యమైన చిట్కాలు..

Advertisement

ప్యాచ్ టెస్ట్:
జుట్టు ఏదైనా కొత్త రంగును ఉపయోగించే ముందు ఎల్లప్పుడూ ప్యాచ్ టెస్ట్ చేయండి. అంటే ముందుగా తీసుకున్ని కలర్ ను ఒక చోట జుట్టుకు కాస్త పెట్టి చూడండి. ఇలా చేసినప్పుడడు ఎలాంటి అలర్జీ అనిపించకపోతే మీకు ఆ రంగు వల్ల ఎలాంటి అలర్జీ, దద్దుర్ల వంటివి రావని అర్థం.

సామాగ్రిని సేకరించండి:
ఆ తర్వాత మీ జుట్టుకు వేయాలనుకున్న రంగు, గ్లౌజులు, దువ్వెన, గిన్నె, పాత టవల్, టైమర్ అందుబాటులో పెట్టుకోండి.

జుట్టును సిద్ధం చేయండి:
హెయిర్ కలర్ వేసే ముందు జుట్టును బాగా కడగండి. ఆ తర్వాత కండీషనర్ అప్లై చేసి జుట్టును బాగా ఆరనివ్వండి.

రంగును పెట్టేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి:
హెయిర్ కలర్ : జుట్టు రంగుతో వచ్చే సూచనలను జాగ్రత్తగా చదవండి. ఆ తర్వాత ఫాలో అవ్వండి
జుట్టును విభాగాలుగా విభజించండి: జుట్టును చిన్న భాగాలుగా విభజించండి. తద్వారా రంగు సమానంగా చేయవచ్చు.
రంగు వేయండి: బ్రష్ లేదా దువ్వెన సహాయంతో, మూలాల నుండి జుట్టు చివర్ల వరకు రంగు వేయండి.
సమయం చూడండి : మీరు జుట్టుకు రంగు వేసిన తర్వాత కావాల్సినంత సమయం ఇవ్వండి.
వాష్ చేయండి: చల్లటి నీటితో హెయిర్ కలర్ ను బాగా కడగాలి. ఆ తర్వాత కండీషనర్ ఉపయోగించండి.

Also Read: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

అదనపు చిట్కాలు..
సహజ రంగులు: మీరు రసాయనతో తయారు చేసిన జుట్టు రంగులనుపెట్టడం ఆపాలంటే మీరు హెన్నా, పసుపు లేదా కాఫీ వంటి సహజ రంగులను ఉపయోగించవచ్చు.
ఎండలోకి వెళ్లకండి: రంగు వేసిన తర్వాత, కొన్ని రోజులు సూర్యరశ్మిని పడకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే ఇది రంగు త్వరగా పోయేలా చేస్తుంది.
క్రమం తప్పకుండా కండీషన్: జుట్టు పొడిబారకుండా, నిర్జీవంగా కనిపించకుండా ఉండేలా క్రమం తప్పకుండా రంగు వేయండి.
నిపుణుల సహాయం కోరండి: మీరు మొదటిసారి మీ జుట్టుకు రంగు వేస్తుంటే, నిపుణుల నుండి సలహా తీసుకోవడం మంచిది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×