BigTV English

Samantha: ఫెయిల్యూర్ హీరోయిన్ పై ప్రశంసలు.. అసలు కథ ఏంటంటే..?

Samantha: ఫెయిల్యూర్ హీరోయిన్ పై ప్రశంసలు.. అసలు కథ ఏంటంటే..?

Samantha.. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత (Samantha ) తాజాగా ఒక బాలీవుడ్ ఫెయిల్యూర్ హీరోయిన్ పై ప్రశంసలు కురిపించడంతో ఈ విషయం కాస్త తర్వాత చర్చనీయాంశంగా మారింది. మరి అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..


అనన్య పాండ్య పై ప్రశంసలు కురిపించిన సమంత..

ప్రముఖ బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే (Ananya Pandey)పై టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసల వర్షం కురిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల విడుదలైన చిత్రం సీటీఆర్ఎల్ లో అనన్య పాండే అద్భుతమైన నటనతో ఆకట్టుకుందని సోషల్ మీడియా వేదికగా సమంత కొనియాడింది. అంతేకాదు తప్పకుండా చూడాల్సిన సినిమాలలో ఇది కూడా ఒకటి అని, ప్రారంభం నుంచి చివరి వరకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చింది. అనన్య పాండే నటన నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన వెంటనే నా ఫోన్ తీసుకొని చాలా యాప్స్ ను నేను అన్ఇన్స్టాల్ కూడా చేశాను అంటూ రాసుకుంది సమంత.


సీటీఆర్ఎల్ లో అద్భుత నటన కనబరిచిన అనన్య..

ఇకపోతే బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనన్య పాండే తాజాగా నటించిన చిత్రం సిటిఆర్ఎల్. విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వ వహించిన ఈ సినిమా అక్టోబర్ 4వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రంలో నటుడు విహాన్ సమత్ కూడా నటించారు. అంతకుముందు అనన్య పాండే తో కలిసి కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ లో కూడా వీరిద్దరూ నటించిన విషయం తెలిసిందే.

తొలి తెలుగు చిత్రంతోనే ఫెయిల్యూర్..

ఇకపోతే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి సినిమాతోనే భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.. దీంతో కొంతమంది తెలుగు ఆడియన్స్ ఫెయిల్యూర్ హీరోయిన్ అంటూ కామెంట్ లు చేసినట్లు సమాచారం.

సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు..

ఇకపోతే అప్పుడు ఫెయిల్యూర్ అని విమర్శించిన వారు.. నేడు పాన్ ఇండియా హీరోయిన్ సమంత.. అనన్య పై ప్రశంసలు కురిపిస్తుండడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారని చెప్పవచ్చు. మరి ఇంత టాలెంట్ ని మనం ఉపయోగించుకోలేకపోయామే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే సమంతను మెప్పించింది అంటే ఇక ఆడియన్స్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సమంత సినిమాలు..

ఇకపోతే సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీలో నటిస్తోంది. దీని తర్వాత పలు చిత్రాలకు కూడా ఓకే చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల సమంత ఈషా ఫౌండేషన్ లో అమ్మవారికి పూజలు చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పూజలు చేస్తున్న సమంత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పంచుకుంది. ఇక సమంత విషయానికి వస్తే.. తనకు సంబంధం లేని విషయాలలో ఇరుక్కుంటూ తెగ ఇబ్బంది పడుతోందని చెప్పవచ్చు. ఎప్పుడో నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని ఆ బంధం నుంచి బయటకు వచ్చినా.. ఆ తాలూకా జ్ఞాపకాలు మాత్రం ఆమెను ఇంకా వెంటాడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ మంత్రి సురేఖ. సమంత పై చేసిన వ్యాఖ్యలతో సమంత మళ్ళీ మనోవేదనకు గురైందని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

 

View this post on Instagram

 

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×