E-Paper
Advertisement

అరెరే.. ఇన్నాళ్లూ ఇది తెలియక ఇబ్బంది పడ్డామే.. బొద్దింకల పనిపట్టే సింపుల్ ట్రిక్ ఇదిగో!

అరెరే.. ఇన్నాళ్లూ ఇది తెలియక ఇబ్బంది పడ్డామే.. బొద్దింకల పనిపట్టే సింపుల్ ట్రిక్ ఇదిగో!
Advertisement

Cockroach Prevention: సాధారణంగా చాలామందికి కిచెన్‌లో ఎదురయ్యే పెద్ద సమస్య ఏదైనా ఉందంటే బొద్దింకలే. ఇవి కనిపించగానే ఒళ్లు జలదరిస్తుంది. ఈ బొద్దింకలు చూడటానికి అసహ్యంగా ఉండటమే కాదు.. ఇవి ఇంట్లో తిరుగుతున్నాయంటే రోగాలను మోసుకొస్తున్నాయని అర్థం. ముఖ్యంగా వర్షాకాలంలోనో, ఎండలు బాగా ముదిరినప్పుడో వీటి హడావిడి మరీ ఎక్కువగా ఉంటుంది. మరి ఇవి మన ఇంట్లోకి ఎందుకు వస్తాయి? వీటికి ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందామా..

బొద్దింకలు ఇంట్లోకి ఎందుకొస్తాయి?

బొద్దింకలకు కావలసిందల్లా మూడే మూడు.. అవే తిండి, నీరు, ఉండటానికి చిన్న సందు. మనం వంటగది గట్టు మీద వదిలేసిన చిన్న చిన్న అన్నం మెతుకులు, సింక్‌లో రాత్రంతా ఉంచే ఎంగిలి గిన్నెలు వీటికి పెద్ద విందు భోజనంలా అనిపిస్తాయి. వీటికి తిండి కంటే నీరు చాలా ముఖ్యం. అందుకే పైపుల దగ్గర ఎక్కడైనా నీరు కారుతున్నా, బాత్‌రూమ్‌లు ఎప్పుడూ తడిగా ఉన్నా ఇవి అక్కడ తిష్ట వేస్తాయి. ఇక పాత పేపర్లు, అట్టపెట్టెలు లాంటివి మూలల్లో ఉంటే వీటికి పండగే.

Advertisement

Also Read: వడదెబ్బ నుంచి రక్షణ కల్పించే ఉల్లిపాయ.. వేసవిలో దీనిని మించిన మెడిసిన్ మరొకటి లేదు!

వంటగదిని నీట్‌గా ఉంచుదాం..

బొద్దింకలను తరిమికొట్టాలంటే ముందుగా మార్చాల్సింది మన వంటగదిని. రాత్రి పడుకునే ముందు వంటగది గట్టును, స్టవ్‌ను ఒక్కసారి నీటితో తుడిచేస్తే బొద్దింకలకు ఆహారం దొరకదు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను గట్టి మూత ఉన్న డబ్బాల్లో పెట్టడం అలవాటు చేసుకోవాలి. సింక్‌లో ఎంగిలి గిన్నెలను రాత్రంతా ఉంచకుండా అప్పటికప్పుడే కడిగేస్తే.. సగం బొద్దింకలు కిచెన్‌లోకి రావు.

ఎక్కడా తేమ ఉండొద్దు..

Advertisement

నీరు దొరక్కపోతే బొద్దింకలు ఎక్కువ కాలం బతకలేవు. అందుకే ఇంట్లో ఎక్కడైనా కొళాయిలు లీక్ అవుతుంటే వెంటనే రిపేర్ చేయించాలి. సింక్ కింద భాగం ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. మనం స్నానం చేసిన తర్వాత బాత్‌రూమ్ తలుపులు తీసి ఉంచడం లేదంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడటం వల్ల తేమ తగ్గుతుంది. ఇల్లు ఎంత పొడిగా ఉంటే బొద్దింకలు అంత దూరంగా ఉంటాయి.

చిన్న చిన్న సందులను మూసేయాలి..

బొద్దింకలు ఎంత చిన్న సందులో నుండైనా దూరి వచ్చేస్తాయి. గోడలకు ఉన్న పగుళ్లు, కిటికీల దగ్గర ఉండే ఖాళీలను సిమెంట్ లేదంటే వేరే ఏదైనా మెటీరియల్‌తో మూసేయాలి. బయటి నుండి తెచ్చే కూరగాయల సంచులు, ముఖ్యంగా ఆన్‌లైన్ ఆర్డర్ల అట్టపెట్టెలను ఒకసారి చెక్ చేసుకున్నాకే ఇంట్లోకి తీసుకురావాలి. చాలాసార్లు బొద్దింకల గుడ్లు వాటి ద్వారానే మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

చాలామందికి పాత పేపర్లు, అట్టపెట్టెలను స్టోర్ రూమ్‌లోనో, మంచం కిందనో దాచే అలవాటు ఉంటుంది. బొద్దింకలు గుడ్లు పెట్టడానికి ఇవి మంచి అడ్డాలు. అందుకే అనవసరమైన సామాన్లను ఇంట్లో పేరుకుపోనివ్వద్దు. అప్పుడప్పుడు ఫ్రిజ్ వెనుక భాగం, గ్యాస్ స్టవ్ కింద కదిలించి శుభ్రం చేస్తూ ఉండాలి. బొద్దింకలను ఇంట్లోకి రాకుండా చూసుకోవడం సులభం కానీ, ఒక్కసారి అవి పాగా వేశాయంటే వెళ్లగొట్టడం చాలా కష్టం. అందుకే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.

Also Read: బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×