E-Paper
Advertisement

పిల్లాడు ప్రతిరోజు చికెన్, మటన్ లేకుండా భోజనం చేయడం లేదా? వెజ్ కూరలు తినిపించడానికి సింపుల్ టిప్స్

పిల్లాడు ప్రతిరోజు చికెన్, మటన్ లేకుండా భోజనం చేయడం లేదా? వెజ్ కూరలు తినిపించడానికి సింపుల్ టిప్స్
Advertisement

చిన్నపిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం చాలా మంది తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా ఉంటుంది. కొంతమంది పిల్లలు పప్పు, కూరలు తినకుండా కేవలం చికెన్, గుడ్డు లాంటివి మారాం చేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా వారి అల్లరికి తగినట్లు తినిపిస్తుంటారు. ఇలా తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిగా అందవు. దీని ప్రభావం వారి ఎదుగుదల, శక్తి, ఆరోగ్యంపై పడుతుంది. అయితే పిల్లలపై కోపగించుకోవడం లేదా బలవంతం చేయడం కంటే ఓపికగా కొన్ని అలవాట్లు నేర్పితే పిల్లలు క్రమంగా ఆరోగ్యకరమైన ఆహారం తినడం ప్రారంభిస్తారు. నిపుణులు చెప్పిన ఈ ఐదు చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి.

కేవలం మటన్, చికెన్ తినడం మంచిది కాదు

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్య ఆహారం చాలా అవసరం. పప్పులు, కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ ఉన్న ఆహారాలు విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. కేవలం నాన్ వెజ్ మాత్రమే తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. పైగా కూరగాయలు తినడం వల్ల లభించే పోషకాలు లభించవు. దాంతో పిల్లలు బలహీనంగా మారడం, త్వరగా అలసిపోవడం, చురుకుదనం తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.

1. బలవంతంగా తినిపించడం మానేయండి

Advertisement

చాలా మంది తల్లిదండ్రులు.. పిల్లలు తినకపోతే బలవంతంగా తినిపిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు ఇంకా ఎక్కువగా ఆహారాన్ని తిరస్కరిస్తారు. ప్రశాంతంగా ఉండి, ఒత్తిడి లేకుండా తినే అవకాశం ఇవ్వడం మంచిది. దీంతో భోజన సమయం పిల్లలకు ఇష్టంగా మారుతుంది.

2. ప్రతిరోజూ కొద్దిగా పప్పు, కూర వడ్డించండి

పిల్లలు తింటారా లేదా అని ఆలోచించకుండా ప్రతిరోజూ కొద్దిగా పప్పు, కూరను వారి ప్లేట్‌లో పెట్టండి. ఒకే ఆహారాన్ని తరచూ చూస్తూ ఉంటే పిల్లలకు దాని గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత క్రమంగా రుచి చూసేందుకు ప్రయత్నిస్తారు.

3. పిల్లలతో కలిసి భోజనం చేయండి

Advertisement

పిల్లలు పెద్దలను చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. అందుకే వారిని ఒంటరిగా కూర్చోబెట్టి తినిపించడం కంటే కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం మంచిది. మీరు ఆనందంగా పప్పు, కూరలు తింటుంటే పిల్లలు కూడా వాటిని ప్రయత్నించాలనే ఆసక్తి చూపుతారు.

4. ఆహారాన్ని తాకే అవకాశం ఇవ్వండి

చిన్నపిల్లలు కొత్త ఆహారాన్ని ముందుగా చేతులతో తాకి, వాసన చూసి తెలుసుకోవాలని అనుకుంటారు. కొద్దిసేపు ఆహారంతో ఆడుకున్నా వెంటనే కోపగించుకోవద్దు. ఇలా చేయడం వల్ల వారికి కొత్త ఆహారం గురించి భయం తగ్గి, రుచి చూసేందుకు ఆసక్తి పెరుగుతుంది.

5. వారి అలవాట్లు క్రమంగా మార్చుకుంటే అభినందించండి

పిల్లలు ఒక చెంచా పప్పు తిన్నా లేదా ఒక్క ముక్క వెజ్ కూర తిన్నా వారిని ప్రశంసించండి. చిన్న విజయాలను గుర్తించడం వల్ల వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ప్రోత్సాహం క్రమంగా మంచి ఆహారపు అలవాట్లుగా మారుతుంది.

Also Read: మీ దాంపత్య జీవితంలో గొడవలు ఎప్పుడూ ఉండవు.. ప్రేమ మరింత పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటిస్తే

ఓపికతో ముందుకు సాగండి

ప్రతి పిల్లవాడు ఒకే వేగంతో నేర్చుకోడు. ఇతర పిల్లలతో పోల్చకండి. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ, ఒత్తిడి లేకుండా ప్రోత్సహించండి. ఒక ఆహారాన్ని పిల్లలు ఇష్టపడేందుకు చాలాసార్లు చూపించాల్సి రావచ్చు.

ఆరోగ్యకరమైన అలవాట్లు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు

పిల్లల ఆహారపు అలవాట్లను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రశాంతమైన భోజన వాతావరణం, కుటుంబంతో కలిసి తినడం, చిన్న విజయాలను అభినందించడం వంటి అలవాట్లు పిల్లల్లో మంచి ఆహారపు సంస్కృతిని పెంచుతాయి. ఇవి వారి ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడటానికి కూడా సహాయపడతాయి.

Related News

తరచూ ఫిట్స్ వస్తున్నాయా? మూర్ఛ వ్యాధిని నియంత్రించడానికి డాక్టర్ సూచనలు

ప్రపంచంలో ఏ అధ్యక్షుడికి లేని రాజభోగాలు.. కిమ్ ఆస్తులు, విలాసాల చిట్టా ఇదే!

నాన్నమ్మల కాలం నాటి గోంగూర నిల్వ పచ్చడి రెసిపీ..ఎప్పుడు చేసినా కిరాక్ రుచి!

కాకరకాయ కారం పొడి సింపుల్ రెసిపీ..క్షణాల్లోనే రెడీ అవుతుంది!

ఇంట్లోనే ఈజీగా కరకరలాడే..స్ప్రింగ్ రోల్స్ చేసుకోండిలా!

మైదా, శనగపిండి లేకుండా సూపర్ క్రిస్పీ స్నాక్స్.. మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచి

మీ కనుబొమ్మలు పలుచగా ఉన్నాయా? దట్టంగా పెరగాలంటే ఇలా చేయండి

పిల్లలు తప్పు చేసినా సరే.. కోపంలో ఈ మాటలు మాత్రం అనకండి!

Big Stories

Advertisement
×